గ్యాల్‌షింగ్
గ్యాల్‌షింగ్, సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం. సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నగరానికి సుమారు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం రహదారి మార్గం ద్వారా కలుపబడి ఉంది.[1] ఈ పట్టణంలో నేపాలీలు ఎక్కువగా ఉన్నారు, నేపాలీ భాష మాట్లాడేవారి సంఖ్య కూడా ఎక్కువే. 6,500 అడుగుల (1,900 మీ.) ఎత్తులో ఈ పట్టణం ఉంది. సంవత్సరంలో ఎక్కువ కాలం సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగివుండే ఈ పట్టణంలో కొన్నిసార్లు మంచు కురుస్తుంది.
గ్యాల్‌షింగ్
గీజింగ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°17′N 88°16′E / 27.28°N 88.27°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | సిక్కిం |
జిల్లా | పశ్చిమ సిక్కిం |
Government | |
• Type | నగర పంచాయితీ |
Elevation | 823 మీ (2,700 అ.) |
జనాభా (2011) | |
• Total | 4,013 |
భాషలు | |
• అధికారిక | నేపాలీ, నేపాలీ, భూటియా, లెప్చా, లింబు, నెవారి, రాయ్, గురుంగ్, మంగర్, షెర్పా, తమంగ్, సున్వర్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 737 111 |
టెలిఫోన్ కోడ్ | 03595 |
Vehicle registration | ఎస్ కె-02 |
భౌగోళికం
మార్చుగ్యాల్సింగ్ పట్టణం 27°17′N 88°16′E / 27.28°N 88.27°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 823 మీటర్ల (2700 అడుగుల) ఎత్తులో ఉంది.
చరిత్ర
మార్చు1642లో నిర్మించిన సిక్కిం రాజ్య పురాతన రాజధాని యుక్సోమ్ పట్టణం ఈ పట్టణ సమీపంలోనే ఉంది. 1640లో నిర్మించిన పెమియాంగ్ట్సే మొనాస్టరీ, సిక్కిం పురాతన ఖేచిపాల్రి సరస్సు ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులు హిమాలయాల పర్వతాల ట్రెక్కింగ్ కు, కాంచన్‌జంగా పర్వత యాత్రలకు ఈ పట్టణం నుండి వెళుతారు.[3]
జనాభా
మార్చు2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] గ్యాల్‌సింగ్ పట్టణంలో 828 జనాభా ఉంది. ఈ జనాభాలో 59% మంది పురుషులు, 41% మంది స్త్రీలు ఉన్నారు. ఈ పట్టణ సగటు అక్షరాస్యత రేటు 72% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 75% కాగా, స్త్రీల అక్షరాస్యత 68% గా ఉంది. మొత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
పరిపాలన
మార్చుఇక్కడి స్థానిక సంస్థ గ్యాల్‌సింగ్ నగర పంచాయితీ ఆధ్వర్యంలో జరుగుతోంది.[5]
మూలాలు
మార్చు- ↑ "West Sikkim/District Court in India | Official Website of District Court of India". districts.ecourts.gov.in. Retrieved 2020-12-25.
- ↑ Falling Rain Genomics, Inc - Gyalshing
- ↑ "Official Web Portal of Sikkim Tourism Development Corporation". www.sikkimstdc.com. Retrieved 2020-12-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-12-25.
- ↑ "Gyalshing Municipal Council". Retrieved 2020-12-25.