గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి[1].

కడుపు ఆమ్లం స్రావం యొక్క క్రోడీకరించి నియంత్రణ రేఖాచిత్రం, శరీరం మధ్య ఉద్ఘాటించే పరస్పర, ఎముకలోని కుహరము
centerరేఖాచిత్రం జీర్ణకారి పుండు వ్యాధి, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి మందు లక్ష్యాలను చేర్చడంతో, గ్యాస్ట్రిక్ ఆమ్ల స్రావం ప్రధాన డిటర్మినంట్స్ వర్ణించటం (GERD).

నేపధ్యము

మార్చు

మనల్ని వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్‌ ట్రబుల్‌ ప్రధానమైనది. గ్యాస్‌ ట్రబుల్‌ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది. అనేక ఇబ్బందులకు గురిచేసే ఈ సమస్య గురించిన సరైన అవగాహన ఉంటే దీనిని ఎదుర్కొనడం కష్టమేమీ కాదు.

వ్యాధి కారణాలు

మార్చు
  • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
  • అధిక టీ/కాఫీ సేవనం
  • సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
  • ఒత్తిడి, అలసట
  • మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
  • మానసిక ఆందోళన, దిగులు, కుంగుబాటుకు లోనుకావడం వంటి మానసిక కారణాలు
  • ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం
  • జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి గ్యాస్‌ట్రబుల్‌ సోకడానికి కారణాలు.

వీటికి తోడు బీన్సు, చిక్కుళ్ళు, క్యాబేజి, కాలిఫ్లవర్‌, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, యాపిల్‌ వంటి పండ్లను అధికంగా సేవించడం వల్ల గ్యాస్‌ట్రబుల్‌ సమస్య జఠిలమవుతుంది. ద్రవ, ఘన ఆహార స్వీకరణ సమయంలో గాలిని మింగడం, మలబద్ధకం, వివిధ వ్యాధులకు వాడే మందులు, మధుమేహం, ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ (ఐబిఎస్‌) వంటి కొన్ని వ్యాధుల వల్ల ప్రేగుల కదలికల్లో మార్పులు జరగకపోవడం, హార్మోన్ల అస్తవ్యస్థత మొదలైన కారణాలు కూడా గ్యాస్‌ సమస్యను కలిగిస్తాయి. ప్రేవుల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌లలో కొన్ని, ముఖ్యంగా మిథేన్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి వాయువులు అంతిమంగా అపాన వాయువు రూపంలో వెలువడుతాయి.

లక్షణాలు

మార్చు
  • కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
  • ఆకలి లేకపోవడం
  • పెద్ద శబ్దంతో తేంపులు రావడం

కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, పొట్టలో గడబిడలు, ఆకలి లేకపోవడం, అన్నం హితవు లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక కడుపునొప్పి రావటం, మలబద్ధకం ఏర్పడటం, అపాన వాయువు ఎక్కువగా పోతుండడం, జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావటం, నోటిలో నీళ్ళు ఊరడం, వాంతులు అవడం వంటి లక్షణాలుంటాయి. వైద్యపరిభాషలో ఈ లక్షణాలను డిస్పెప్పియా

నివారణా చర్యలు

మార్చు
  • సరైన వేళకు ఆహారం తీసుకోవడం.
  • నీరు ఎక్కువగా త్రాగండి.
  • వ్యాయామం చెయ్యడం
  • వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడాలి.

మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్‌, టీ, కాఫీలు మానివేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్ళు తినడం మానేయాలి. కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే ఆహారపదార్థాలు తింటే కూడా కడుపులో గ్యాస్‌ పెరుగుతుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. జీవనశైలి, జీవనవిధానంలో మార్పు, ఆహార నియమాలు పాటించడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ లాంటి ఆటలు, క్రీడలలాంటి శారీరకశ్రమతో కూడిన వ్యాయామాలు, కడుపు నిండుగా ఒకేసారి ఆహారం తీసుకోకుండా ఉండటం చేయాలి. మనం రోజువారి తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచిది. తినేదాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించొచ్చు. కార్బొనేటెడ్‌ కూల్ డ్రింక్స్, చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల కూడా కడుపులో గ్యాస్‌ పెరుగుతుంది.

చికిత్స

మార్చు

హోమియో

మార్చు

గ్యాస్‌ ట్రబుల్‌ నివారణకు హోమియోలో కార్పొవెజ్‌, చైనా, నక్సవామిక, అర్జెంటు నైట్రికం లైకోపోడియా, పాస్పరస్‌, నైట్రమ్‌ఫాస్‌, ఎనాకార్డియం, సల్ఫర్‌, ఆర్సినికం ఆల్బం వంటి మందులను వ్యక్తి శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా డాక్టర్‌ సలహాతో వాడితే మంచి ఫలితముంటుంది[2].

ఆయుర్వేదం

మార్చు
  • కడుపు ఉబ్బరంతో గ్యాస్‌ట్రబుల్‌తో బాధపడేవారికి చిత్రకాదివటి అనే ఔషధం నివారించగలుగుతుంది. ఇది ఆయుర్వేద షాపుల్లో మాత్రల రూపంలో దొరుకుతుంది. మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని, చిత్రకాదివటి ఒక మాత్ర వేసుకుని మజ్జిగ త్రాగితే పుల్లటి త్రేన్పులు, పొట్ట ఉబ్బరం, పైత్యం నివారిస్తాయి.
  • ధనియాలు, జీలకర్రను విడివిడిగా నేతిలో వేయించి కొంచెం ఉప్పు కలిపి వీటిని పొడి చేసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని`చిత్రకాదివటి మాత్రను వేసుకుని మజ్జిగను త్రాగుతుంటే జిగట విరేచనాలు, ఉదర వ్యాధులు తగ్గిపోతాయి.
  • చిత్రకాదివటి మాత్రను పూటకు రెండు చొప్పున వేసుకుని కుటజారిష్ట అనే ఔషధాన్ని మూడు చెంచాలు తాగుతుంటే అమీబియాసి వ్యాధి నివారించబడుతుంది.
  • కొద్దిగా ధనియాలు, జీలకర్ర, శొంటి ఈ మూడిరటిని సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా గ్రైండ్‌ చేసి అన్నింటిని కలిపి తగినంత ఉప్పువేసి ఒక సీసాలో వేసుకొని భోజనం తర్వాత గ్లాస్‌ మజ్జిగలో ఒక చెంచా పొడి వేసుకొని రోజు తాగండి. భోజనం తర్వాత అలసట, అజీర్తి, గ్యాస్‌ వుండవు.
  • గ్లాసెడు నీళ్ళలో చిటికెడు చొప్పున సోంపు, జీలకర్ర, రాతి ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీళ్ళు తాగినా ఉపశమనం లభిస్తుంది.
  • రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను పరగడుపును మింగేసి మంచినీళ్ళు తాగితే క్రమంగా బాధ తగ్గుతుంది.
  • కాసిన్ని మెంతిగింజలు నీళ్ళలో నానబెట్టి పొద్దున లేవగానే ఆ నీళ్ళను తాగినా జీర్ణశక్తి మెరుగై గ్యాస్‌ ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.
  • వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.
  • నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతినిత్యం భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి.
  • పుదీనా ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గించడములో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నపుడు పుదీనా టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం, నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం తీసుకోవడం ఉబ్బరం తగ్గి పొట్ట తేలికగా అవుతుంది.

వైద్య విషయాలు

మార్చు
  • గ్యాస్, పొత్తి కడుపు నొప్పులను నివారించేందుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే వైద్య విధానం ప్రసిద్దం

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు