ప్రధాన మెనూను తెరువు

గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్

గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్, (సాధారణంగా అందరూ దీనిని జి.టి లేదా జి.టి. ఎక్స్ ప్రెస్ అని పిలుస్తుంటారు.) రైలు నెంబర్లు 12615/12616. ఇది భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్ మరియు చెన్నై సెంట్రల్ మధ్య ఇది ప్రతి రోజు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు . అతి పురాతన, చారిత్రక రైళ్లలో జి.టి. ఎక్స్ ప్రెస్ కూడా ఒకటి.

Grand Trunk Express
G.T Express Trainboard 1.jpg
సారాంశం
రైలు వర్గంSuperfast Express
తొలి సేవ01 జనవరి 1929
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్
ఆగే స్టేషనులు37 (T.No.12615) / 36 (T.No. 12616)
గమ్యంన్యూఢిల్లీ
ప్రయాణ దూరం2,181 km (1,355 mi)
సగటు ప్రయాణ సమయం35 hours 5 minutes
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)12615 / 12616
సదుపాయాలు
శ్రేణులుAC First, AC Two Tier, AC Three Tier, Sleeper Class, Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
చూడదగ్గ సదుపాయాలుLarge and Small windows
బ్యాగేజీ సదుపాయాలుLuggage-cum-Brake Van
సాంకేతికత
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం)
వేగం61.78 km/h (38.39 mph) average with halts
మార్గపటం
Grand Trunk Express and Tamil Nadu Express (NDLS-MAS) Route map.jpg

చరిత్రసవరించు

ఈ రైలును మద్రాసు మరియు దక్షిణ మరాఠ రైల్వే ప్రవేశపెట్టెను. తొలిసారిగా 1929లో ఈ రైలు ప్రస్తుత కర్నాటక రాష్ట్రములోని మంగళూరు నుండి ప్రస్తుత పాకిస్థానులోని పెషావర్ వరకు నడిచింది. మద్రాసు దీని ప్రధాన కేంద్రం.[1] ప్రస్తుతం భారత రాజధాని కొత్త ఢిల్లీ మరియు తమిళనాడు రాజధాని చెన్నై మధ్య ప్రయాణించే ఈ రైలు. ఒకప్పటి బ్రిటీష్ ఇండియాలో భాగాంగా ఉన్న లాహోర్ మరియు తమిళనాడులోని కోయంబత్తురు, ఊటి (ఉదకమండలము), కున్నూరు లకు సమీపంలో ఉన్న మేట్టుపాళయం నడుమ ప్రయాణించేది. దేశంలోని పలు ప్రాంతాల మీదుగా నడిచే ఈ జి.టి.ఎక్స్ ప్రెస్ రైలు అప్పట్లో సుదీర్ఘ దూరం ప్రయాణించే రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.[2] ఈ రైలు మొత్తం 2,186 కి.మీ (1,358 మైళ్లు) ప్రయాణ దూరాన్ని 35 గంటల 35 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఈ మార్గంలో చెన్నై, కొత్త ఢిల్లీలతో కలుపుకుని మొత్తం 38 స్టేషన్లలో ఈరైలు ఆగుతుంది. ఇప్పటికీ భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ఇదీ ఒకటిగా ఉంది. ప్రఖ్యాత గ్రాండ్ ట్రంక్ రోడ్ పేరు మీద ఈ రైలుకు, మార్గానికి ఈ పేరు పెట్టారు.

జోను మరియు డివిజనుసవరించు

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

షెడ్యూలు మరియు సేవలుసవరించు

ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. భారతీయ రైల్వే ఈ రైలుకు 12615/12616 నెంబర్లను కేటాయించారు. 12615 నెంబరు గల రైలు చెన్నై – కొత్త ఢిల్లీ మార్గంలో ప్రయాణిస్తుంది.[3] అదేవిధంగా 12616 నెంబరు గల రైలు తిరుగు ప్రయాణంలో కొత్త ఢిల్లీ – చెన్నై మధ్య ప్రయాణిస్తుంటుంది.

రేక్ మరియు బోగీలుసవరించు

సాధారణంగా జి.టి. ఎక్స్ ప్రెస్ లో 24 బోగీలు (కార్లు) ఉంటాయి. అవి ఈ క్రింది తరగతులుగా విభజించారు:

  • 1 x ఏసీ I వ తరగతి మరియు ఏసీ II టైర్
  • 2 x ఏసీ II టైర్
  • 3 x ఏసీ III టైర్
  • 13 x III టైర్ స్లీపర్
  • 4 x సాధారణ/రిజర్వరేషన్ లేనివి
  • 1 x ప్యాంట్రీ

కొన్నిసార్లు అదనంగా III టైర్ స్లీపర్ బోగీని చేర్చుతారు. జి.టి. తన మొత్తం ప్రయాణ మార్గంలోరాయపురం షెడ్ కు చెందిన సింగిల్ డబ్ల్యుఏపీ-7 ఏసీ ఎలక్ట్రిక్ లోకమొటివ్ ఇంజిన్ తో లాగబడుతుంది.

ఇతర రైళ్లతో పోలికసవరించు

గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రస్తుతం కొత్త ఢిల్లీ మరియు చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తోంది. ఈ రెండు స్టేషన్లు కాకుండా మధ్యలో మరో 34 చోట్ల ఈ రైలు ఆగుతుంది. ఇదే మార్గంలో నడిచే తమిళనాడు ఎక్స్ ప్రెస్ కేవలం 9 మధ్యంతర స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. సాంకేతికంగా చెప్పాలంటే తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలు హజ్రత్ నిజాముద్దీన్ మరియు చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తూ ఈ మార్గంలో నడిచే వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు మొత్తం ప్రయాణాన్ని28 గంటల 10 నిమిషాల్లో తన గమ్యాన్ని చేరుతుంది. చెన్నై గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ 9 మధ్యంతర స్టేషన్లలో ఆగుతూ న్యూఢిల్లీ మరియు చెన్నై మధ్య సుమారు ఇంతే కాలంలో ప్రయాణిస్తుంది. తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు హజ్రత్ నిజాముద్దీన్ మరియు మధురై జంక్షన్ మధ్య ప్రయాణిస్తూ హజ్రత్ నిజాముద్దీన్, మరియు చెన్నై ఎగ్ మోర్ మధ్య దూరాన్ని 34 గంటల 50 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఈ మధ్య కేవలం 4 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. (ఇది ఆగే 5వ స్టేషన్ గా చెన్నై బీచ్ స్టేషన్ కూడా తర్వాత చేర్చారు.)

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "VIII". Report by the Railway board on Indian Railways for 1929-30:Volume I (PDF)|format= requires |url= (help). Calcutta: Central Publication Branch, Government of India. 1930. p. 71. |access-date= requires |url= (help)
  2. S. Shankar. "Classic Trains of India". Indian Railways Fan Club Association. Retrieved 5 November 2013.
  3. "Grand Trunk Express". cleartrip.com. Cite web requires |website= (help)