ఘనపూర్ మండలం (జయశంకర్ జిల్లా)

తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం
(ఘణపూర్ నుండి దారిమార్పు చెందింది)

ఘనపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]

ఘనపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, ఘనపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, ఘనపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, ఘనపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°21′12″N 79°57′00″E / 18.353222°N 79.950027°E / 18.353222; 79.950027
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం ఘనపూర్ (జయశంకర్ జిల్లా)
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 137 km² (52.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 35,952
 - పురుషులు 17,837
 - స్త్రీలు 18,115
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.93%
 - పురుషులు 62.79%
 - స్త్రీలు 37.02%
పిన్‌కోడ్ 506345

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 57 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం ఘనపూర్

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 35,952 - పురుషులు 17,837 - స్త్రీలు 18,115.[3]పిన్ కోడ్: 506345.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 137 చ.కి.మీ. కాగా, జనాభా 35,952. జనాభాలో పురుషులు 17,837 కాగా, స్త్రీల సంఖ్య 18,115. మండలంలో 9,914 గృహాలున్నాయి.[4]

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు.

మార్చు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఘనపూర్ (ములుగు) మండలాన్ని (1+8) తొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. చెల్పూర్
  2. ధర్మారావుపేట్
  3. కర్కపల్లి
  4. బుర్రకాయలగూడెం
  5. మైలారం
  6. బుద్ధారం
  7. ఘనపూర్
  8. కొండాపూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-25.

బయటి లింకులు

మార్చు