ఘన వాయిద్యాలు
(ఘన వాద్యాలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఘన వాయిద్యాలు అంటే లోపల ఖాళీ స్థలం లేకుండా గట్టిగా ఉండే వాయిద్యాలు. మానవ శరీరాన్ని కూడా ఒక ఘన వాయిద్యంగా చెప్పుకోవచ్చు. దానితో మనం పాడేటపుడు గొంతు నూ, నోటినీ, చేతులనూ ఉపయోగిస్తున్నాం. వీటిలో అతి సామాన్యమైన వాయిద్యాలు కర్రలు, గుండ్రటి రింగులు, గజ్జెలు, మువ్వలు మొదలైనవి. గట్టి వెదురుకు రంగు వేసి కానీ, వెయ్యకుండా కానీ కోలాటంలో ఉపయోగిస్తారు. ఈ కర్రలకు ఓ వైపు చిన్న మువ్వలు కూడా కడతారు. దీన్నే దండ అని, కోలు అని కూడా అంటారు.
కొట్టి వాయిస్తే చిత్రమైన ధ్వనులిచ్చే స్తంభాలు, విగ్రహాలు కలిగిన దేవాలయాలు దక్షిణ భారతదేశం లోని చాలా క్షేత్రాల్లో కనిపిస్తాయి. కర్ణాటకలోని హంపి లోనూ, ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి, తాడిపత్రి లోనూ, తమిళనాడు లోని తిరునల్వేలి, మధుర, అళగర్ కోయిల్ మొదలైన ప్రాంతాలు కొన్ని ఉదాహరణలు.
మూలాలు
మార్చుబాహ్య లంకెలు
మార్చుLook up idiophone in Wiktionary, the free dictionary.
వికీమీడియా కామన్స్‌లో Idiophonesకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.