తాడిపత్రి

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, తాడిపత్రి మండల పట్టణం

తాడిపత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఇది పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం.

పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 14°54′35″N 78°00′30″E / 14.9097°N 78.0083°E / 14.9097; 78.0083Coordinates: 14°54′35″N 78°00′30″E / 14.9097°N 78.0083°E / 14.9097; 78.0083
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండలంతాడిపత్రి మండలం
విస్తీర్ణం
 • మొత్తం7.45 km2 (2.88 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం1,08,171
 • సాంద్రత15,000/km2 (38,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1003
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8558 Edit this on Wikidata )
పిన్(PIN)515411 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

చరిత్రసవరించు

విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతం,విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగం. మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతం తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది. దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రం అనే పేరు కూడావుంది. పూర్వం ఈ ప్రాంతంలో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని, తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు. సా.శ. 1350 ప్రాంతంలోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు అను బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశంతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఈప్రాంతంను అభివ్ళద్ది చేసాడని చెపుతారు. తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయం, శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయాలు సా.శ. 1460-1525 మధ్యలో నిర్మించబడ్డాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని అతని కుమారుడైన తిమ్మానాయనిచే నిర్మాణమైనట్లు తాడిపత్రి కైఫీయత్ ద్వారా తెలుస్తుంది. ఈ రెండు దేవాలయాలు అద్భుత శిల్ప సంపదతోఅలరారుతున్నాయి. ఇక్కడికి సమీపంలో ఆలూరుకోనలో పురాతన ప్రాశస్తి కలిగిన రంగనాధఆలయం, ఓబుళేసు కోనఆలయాలు గలవు.

భౌగోళికంసవరించు

అనంతపురం నుంచి ఈశాన్య దిశలో 55 కి.మీ వుంది.

జనగణన వివరాలుసవరించు

2011 జనగణన ప్రకారం పట్టణ మొత్తం జనాభా 1,08,171.

పరిపాలనసవరించు

తాడిపత్రి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలుసవరించు

ఇది జాతీయ రహదారి 544D పై వుంది. ఇది చెన్నై - ముంబై రైలు మార్గంలో కడప, గుంతకల్ జంక్షన్ ల మధ్యన ఉంది.

పరిశ్రమలుసవరించు

పట్టణం పరిసర ప్రాంతాలలో సుమారు 600 గ్రానైట్ ప్రోసెసింగ్ పరిశ్రమలు, నల్ల రాతి పొలిష్ పరిశ్రమలు 1000 దాకా ఉన్నాయి. ఇక్కడ పెన్నా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు గలవు.

పర్యాటక ఆకర్షణలుసవరించు

ఇక్కడికి దాదాపు 25 కిలోమీటర్ల దూరములో ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు ఉన్నాయి. 10 కి.మీ. దూరంలో, హాజీవలీ దర్గా,15కి.మీ.దూరంలో పప్పూరు గ్రామంలో శ్రీ అశ్వర్ద నారాయణ స్వామి, భీమలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందాయి.

ప్రముఖులుసవరించు

 
తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది బళ్ళారి రాఘవ చిత్రం
  • బళ్ళారి రాఘవ:బళ్ళారి రాఘవ తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది.ఇతను 1880 ఆగస్టు 2న తాడిపత్రిలో జన్మించాడు.[2] అతని పూర్తిపేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ.
  • కే వి రెడ్డి:కె.వి.రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగాడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. జానమద్ది, హనుమచ్ఛాస్త్రి (1994). "  బళ్ళారి రాఘవ" (in తెలుగు).   సుప్రసిద్ధుల జీవిత విశేషాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. వికీసోర్స్. pp. 1-4. ISBN 81-7098-108-5. 

వెలుపలి లంకెలుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.