చంగనస్సేరి పరమేశ్వరన్ పిళ్ళై

సామాజిక సంస్కర్త, న్యాయవాది మరియు న్యాయమూర్తి

చంగనస్సేరి పరమేశ్వరన్ పిళ్లై (1877 - 1940 జూన్ 30) సామాజిక సంస్కర్త, న్యాయవాది, న్యాయమూర్తి, అటార్నీ జనరల్, నాయర్ సర్వీస్ సొసైటీ మాజీ అధ్యక్షుడు. అతను శ్రీ మూలం పాపులర్ అసెంబ్లీకి నాలుగు సార్లు ఎన్నికయ్యాడు. [1]

చంగనస్సేరి పరమేశ్వరన్ పిళ్ళై
జననం1877 (1877)
చంగనస్సేరి, ట్రావన్కూర్ సంస్థానం
మరణం1940 జూన్ 30(1940-06-30) (వయసు 62–63)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుచంగనస్సేరి
విద్యఎల్.ఎల్.బి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాయర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు
ట్రావన్కూర్ హై కోర్టు న్యాయమూర్తి
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం
వైకోం సత్యాగ్రహం
తల్లిదండ్రులువాజపల్లి నారాయణ పిళ్ళై
నారాయణి అమ్మ

జీవితం తొలి దశలో

మార్చు

పిళ్లై ట్రావెన్‌కోర్ రాజ్యంలో చంగనస్సేరిలో జన్మించారు. అతని తండ్రి వడక్కెర పుతుకుట్టి వంశానికి చెందిన వాజపిల్లి నారాయణ పిళ్లై. తల్లి మనక్కాట్ వంశానికి చెందిన నారాయణి అమ్మ.

అతని ప్రాథమిక విద్య వాజపల్లి, చంగనస్సేరి లలో జరిగింది. బిఎ పూర్తి చేసి ఆ తర్వాత ఎల్‌ఎల్‌బి ఉత్తీర్ణుడై న్యాయవాదిగా వృత్తి బాధ్యతలు చేపట్టాడు. కొల్లం బార్ అసోసియేషన్ వ్యవస్థాపకులలో చంగనస్సేరి ఒకడు. [2]

జీవిత చరిత్ర

మార్చు

పౌర స్వేచ్ఛ కోసమూ, ట్రావెన్‌కోర్ శాసనసభ, ప్రభుత్వాల్లో జవాబుదారీతనం కావాలనీ కోరుతూ పిళ్లై తన స్వరాన్ని వినిపించాడు. మహాత్మా గాంధీతో సన్నిహితంగా పనిచేసే అవకాశం అతనికి లభించింది. అతను హరిజన సేవా సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు. దాని కేరళ శాఖకు చైర్మనుగా పనిచేసాడు. అతని ప్రయత్నాల ఫలితంగా కేరళలో 82 హరిజన కార్యాలయాలు మొదలయ్యాయి.

అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చంగనస్సేరి ప్రముఖ పాత్ర పోషించాడు. వైకం సత్యాగ్రహంలో భాగంగా ఆయనతో పాటు మన్నతు పద్మనాభ పిళ్లై కూడా సవర్ణ జాదాలో పాల్గొన్నాడు.

నాయర్ సర్వీస్ సొసైటీ

మార్చు

నాయర్ సర్వీస్ సొసైటీకి పిళ్ళై రెండవ అధ్యక్షుడు. దాని వ్యవస్థాపకులలో అతనొకడు. కేరళ వ్యవసాయ రైతుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

ట్రావెన్‌కోర్ శాసన సభ నాయర్ రెగ్యులేషన్ యాక్టును ఆమోదించడంలో అతను ప్రముఖ పాత్ర పోషించాడు. ఇది అతని అత్యుత్తమ విజయాలలో ఒకటి. అతను కేరళ కర్షక సంఘ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

హైకోర్టు న్యాయమూర్తి

మార్చు

1926 లో ట్రావెన్‌కోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆరేళ్ల తర్వాత అతను హైకోర్టుకు రాజీనామా చేసి, మళ్లీ ప్రజాజీవితం లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో శాసనసభకు నాలుగోసారి ఎన్నికలు జరగాయి. ప్రభుత్వం రాజకీయ కారణాలతో అతని పెన్షన్‌ను రద్దు చేసింది.

జాతీయ కాంగ్రెసు ట్రావెన్‌కూర్ బ్రాంచ్ కమిటీ అధ్యక్షుడు

మార్చు

1938 లో తిరువనంతపురంలో భారత జాతీయ కాంగ్రెస్ శాఖను ఏర్పాటు చేసారు. మొదటి అధ్యక్షుడిగా పిళ్లై, మొదటి కార్యదర్శిగా జి. రామచంద్రన్ ఎంపికయ్యారు. 1938 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ముందు, ట్రావెన్‌కోర్ నియోజకవర్గంలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశం ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. కొచ్చిన్, ట్రావెన్‌కోర్‌ లలో తక్షణం బాధ్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యాలని ఆ సమావేశం డిమాండ్ చేసింది. మలబార్, కొచ్చిన్, ట్రావెన్‌కోర్ అనే మూడు రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని సబ్ ఫెడరేషన్‌గా నిర్వహించడానికి అంగీకరించాయి.

ఫిబ్రవరి 1938 లో, భారత జాతీయ కాంగ్రెసు ఉద్యమం హరిపుర కాన్ఫరెన్సులో దేశంలోని వివిధ భారతీయ జాతీయ కాంగ్రెస్ కమిటీలు రాజకీయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొనరాదనీ, రాజకీయ ఆందోళనలు చేసేందుకు స్వతంత్ర రాజకీయ సంస్థలను ప్రోత్సహించాలనీ నిర్ణయించింది. ఎనిమిది బ్రిటిష్ భారతీయ రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వాన్ని భారత జాతీయ కాంగ్రెసు చేపట్టినప్పటి నుండి, సంస్థానాలలో బాధ్యతాయుతమైన పాలన కోసం పోరాటాన్ని నిర్వహించాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకత్వానికి లేకుండా పోయింది.

హరిపురా ఎఐసిసి నిర్ణయం సందర్భంలో, 1938 ఫిబ్రవరిలో, CV నారాయణ పిళ్ళై, వి. కుంహిరామన్ లు కలిసి ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్ పేరుతో ఒక స్వతంత్ర రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి అధ్యక్షుడుగా పట్టం తాను పిళ్ళై, కార్యదర్శిగా పి.నటరాజ్ పిళ్లై ఉన్నారు. ట్రావెన్‌కోర్‌లో ఆందోళనను ప్రారంభించే నిర్ణయంతో ఈ పార్టీ ఒక తాత్కాలిక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

వారసత్వం

మార్చు

అతని స్మారకంగా అతని స్వస్థలం కొల్లం జిల్లాలోని చంగనస్సేరి స్మారక గ్రంథశాల అనే పేరుతో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు.

మూలాలు

మార్చు
  1. K.R. Ushakumari (2009). Changanassery Parameswaran Pillai and the Socio Political Evolution of Modern Travancore.
  2. K. John, Binoo (8 March 2016). "The caste chequerboard". Daily News and Analysis. Retrieved 29 November 2017.