చందే (సంగీత వాయిద్యం)

యక్షగానంలో ఎక్కువగా వాడే సంగీత వాయిద్యం
(చందే(వాద్యపరికరం) నుండి దారిమార్పు చెందింది)

చందే అనేది దక్షిణ భారతదేశంలోని సంప్రదాయ, శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే డప్పు వంటి వాద్య పరికరం. ఎక్కువగా కర్ణాటక ప్రాంతంలో చేసే యక్షగానంలో ఈ డప్పును వాడతారు. ఈ పరికరానికి ముఖ్యంగా జానపద, శాస్త్రీయ, కర్ణాటక సంగీత పద్ధతులకు చెందిన లయ ఉంటుంది. హిందుస్థానీ సంగీతానికి చెందిన లయ ఉండటం అరుదే. [1] 

చందే డప్పు (ఎడమ చేయి వైపు వాయించడానికి అనువుగా పెట్టినది).
చందేను వాయిస్తున్నకళాకారులు

చందే డప్పులో రెండు రకాలున్నాయి. ఉత్తర సంప్రదాయానికి చెందిన బడగు తిట్టు చందే, దక్షిణాది సంప్రదాయానికి చెందిన తెంకు తిట్టు చందే. కర్ణాటక, కేరళల్లోని కోస్తా ప్రాంతాల్లో ఈ రకమైన డప్పునుఎక్కువగా ఉపయోగిస్తారు. కర్ణాటక ప్రాంతంలో ఆడే యక్షగానంలో బడగు తిట్టు చందే రకమైన డప్పును వాడతారు. ఈ రకమైన డప్పు, కేరళలోవాడే చందే డప్పుకు నిర్మాణ విషయంలోనే కాక, ధ్వని విషయంలో  కూడా చాలా తేడాలుంటాయి.

చరిత్ర

మార్చు

ప్రాచీన హిందూ శిల్పాల్లో, చిత్రాల్లో, పురాణాల్లో చందే గురించిన ప్రస్తావన ఉంది. ఎక్కువగా యుద్ధ సమయంలో ఈ వాద్య పరికరాన్ని వాడినట్టు ఆయా కళారూపాల్లో ఆధారాలు ఉన్నాయి. 3 కిలోమీటర్ల దూరం వరకు ఈ డప్పు శబ్దం వినిపిస్తుంది. అంతటి ధృడమైన లయ ఈ డప్పుకు ఉంది. గత 150 ఏళ్ళ నుంచీ మాత్రం ఈ డప్పును యక్షగానంలో వాడుతున్నారని కొంతమంది చరిత్రకారుల నమ్మకం.

పనస చెట్టు చెక్కతో ఈ డప్పును తయారు చేస్తారు. కన్నడ భాషలో దీని శరీరాన్ని గూడు అని పిలుస్తారు. ఈ డప్పును వాయించేవారు యక్షగానంలో వాడే తాళాలను అనుసరిస్తారు. ఈ తాళాలకు కర్ణాటక సంగీత తాళాలకు మధ్య సారూప్యతలు ఉంటాయి. దీని లయకు శాస్త్రీయ సంగీతంలో మూలాలు ఉండటమే కారణం.

భాగాలు

మార్చు
 
చందే డప్పు

డప్పు పైభాగంలోని వృత్తాకారాన్ని ఆవు చర్మంతో తయారు చేస్తారు. డప్పు తలనూ, కింద భాగాన్నీ కలుపుతూ 12 కర్రలు ఉంటాయి. సాధారణంగా డప్పు తలభాగం 32 సెంటీ మీటర్ల నుంచీ, 23 సెంటీ మీటర్లు ఉంటుంది. తలలోని వాయించే భాగం కొలత 20 సెంటీమీటర్లు. శృతి చేసుకునేందుకు వీలుగా డప్పు తల భాగంలో తాళ్ళు కడతారు. డప్పు తలభాగం మొత్తానికీ ఒక తాడు కడతారు. ఇది డప్పును పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. సాధారణంగా చందేను గాయకుల యొక్క పై షడ్జమంలో శృతి చేసుకుంటారు.

వాయించే భంగిమ

మార్చు

చందేను రెండు కర్రలు ఉపయోగించి వాయిస్తారు. నిలువుగా, కొంచెం ఏటవాలుగా పట్టుకుని వాయిస్తారు. కింది భాగం నేలకు తగలకుండా జాగ్రత్తపడతారు.

చందే కర్రలు

మార్చు

చందే డప్పును కొట్టే కర్రలను కన్నడలో చందే కొలు అని పిలుస్తారు. ఈ కర్రల పొడవును బట్టీ ఆకారం, మందం ఆధారపడి ఉంటాయి. నిజానికి రెండు కర్రలూ ఒకలా ఉండవు. ఎడమ చేతి వైపు కర్ర, కుడి చేతి వైపు కర్ర ఆకారం, పొడవూ వేరుగా ఉంటాయి. ఈ చందే డప్పు కర్రలు సాధారణంగా 28 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.

మూలాలు

మార్చు
  1. Prof.