చంద్రకాంత
(చంద్రకాంతలు నుండి దారిమార్పు చెందింది)
చంద్రకాంతలు పెసర పప్పుతో చేసే ఒక రకమైన పిండి వంట.[1]
కావలసిన పదార్ధాలు
మార్చు- పెసర పప్పు - పావు కిలో
- చక్కెర - పావు కిలో
- కొబ్బరికోరు - ఒక కాయ నుండి
- నెయ్యి - పావు కిలో
- జీడి పప్పు, ఏలకలు, కుంకుమ పువ్వు - తగినన్ని.
తయారుచేయు విధానము
మార్చు- పెసర పప్పును నీటిలో ఒక గంటసేపు నానబెట్టండి.
- బాగా కడిగి పొట్టు ఉంటే శుభ్రంగా తీసివేయాలి.
- పప్పును మెత్తగా రుబ్బాలి. నీళ్ళు మరీ ఎక్కువగా గాని, మరీ తక్కువ గాని వెయ్యకూడదు.
- పచ్చి కొబ్బరి కోరు, చక్కెర లను ఈ పెసర ముద్దలో కలిపి పొయ్యి మీద పెట్టి హల్వాకు తిప్పిన విధంగా గరిటెతో తిప్పాలి.
- పావుగంట - ఇరవై నిమిషాలు పోయేసరికి చక్కెర పాకం అయి, పెసరముద్దలోని నీరు యింకిపోయి గట్టిపడుతుంది. చెయ్యిపెట్టి చూస్తే చేతికి అంటుకోకుండా ముద్దలాగా అవుతుంది.
- అప్పుడు సుగంధ ద్రవ్యాలు వేసి గరిటెతో మరోసారి కలిపి కిందకి దించాలి.
- తెల్లని మందంగల గుడ్డ తీసుకుని, దానిని నీటితో తడిపి, నీరు పిండేసి ఆ తడిబట్టను ఒక పీటమీద మడతలు లేకుండా పరచాలి.
- ఆ తడిబట్టమీద ఉడికిన పెసర ముద్దని పోసి, చేత్తో అరచేతి మందంలో ఉండేటట్లు వత్తాలి.
- ఆ పరిచిన పెసర ముద్ద ఆరటం వల్ల త్వరగా చల్లారుతుంది. అప్పుడు కత్తితో మనకు కావలసిన ఆకారాల్లో, పరిమాణంలో కోసుకోవారి. కోసిన ముక్కలను విడివిడిగా తీసి పెట్టుకోవాలి.
- బూరెల మూకుడులో పావుకిలో నెయ్యి పోసి బాగా మరిగాక, ఈ కోసిన ముక్కలు వేస్తే అవి పొంగి గుల్లగా విచ్చుకుంటాయి. వీటిని మరీ ఎర్రగా కాకుండా, గోధుమ రంగు వచ్చేదాక వేగనిచ్చి తీసివేయాలి.
మూలాలు
మార్చు- ↑ "Chandra Kaantalu". Indian food recipes - Food and cooking blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2007-01-13. Retrieved 2021-07-16.