చంద్రయాన్ కార్యక్రమం
భారతదేశం చేపట్టిన చంద్రుడి పరిశోధన కార్యక్రమాన్ని చంద్రయాన్ కార్యక్రమం అంటారు. ఇది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన బాహ్య అంతరిక్షాన్ని శోధించే కార్యకలాపం. ఈ కార్యక్రమం ఆర్బిటరు, ఇంపాక్టరు, ల్యాండరు, రోవరులను కలిగి ఉంటుంది.
కార్యక్రమ ఆకృతి
మార్చుచంద్రయాన్ బహుళ యాత్రలతో కూడుకున్న కార్యక్రమం. పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా చంద్రయాన్-1 ను ప్రయోగించారు. చంద్రయాన్-1 ద్వారా ఇంపాక్టర్ ప్రోబ్‌తో ఒక ఆర్బిటరును చంద్రుడి కక్ష్య లోకి పంపించారు. ఆర్బిటరు, సాఫ్ట్ ల్యాండరు, రోవరులతో కూడిన రెండవ చంద్రయాన్‌ను 2019 జూలై 22 న GSLV Mk III రాకెట్ ద్వారా ప్రయోగించారు.
తొలి దశ: ఆర్బిటరు / ఇంపాక్టరు
మార్చు2003 ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చంద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించాడు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఒక ఊపు నిచ్చింది. 1999 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సమావేశంలో తొలిసారిగా చంద్రుని పైకి భారతదేశం శాస్త్రీయ యాత్ర చేపట్టే ఆలోచన చేసారు. 2000 లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళింది. ఆ తర్వాత త్వరలోనే, ఇస్రో ఒక జాతీయ చంద్ర యాత్ర టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. చంద్రుడిపైకి ఒక యాత్రను నిర్వహించ గల సాంకేతిక నైపుణ్యం ఇస్రోకు ఉందని ఈ టాస్క్ ఫోర్సు తేల్చింది. 2003 ఏప్రిల్‌లో గ్రహ, అంతరిక్ష, ఎర్త్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఖగోళ, ఖగోళ భౌతిక, ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ శాస్త్రాల రంగాలలోని 100 మంది ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తలు చంద్రుడికి భారతీయ పరిశోధన ప్రారంభించాలన్న టాస్క్ ఫోర్స్ సిఫారసును ఆమోదించారు. ఆరు నెలల తరువాత, నవంబర్లో, భారత ప్రభుత్వం మిషన్ కోసం అనుమతి ఇచ్చింది.
మొదటి దశలో ఆర్బిటరు ప్రయోగం ఉంటుంది.
- చంద్రయాన్ -1 ను 2008 అక్టోబర్ 22 న పిఎస్ఎల్వి-XL రాకెట్టు ద్వారా ప్రయోగించారు. ఈ యాత్రలో పంపిన చంద్ర ఇంపాక్టరు చండ్రుడిపై నీరు ఉందని కనుక్కుని పెద్ద విజయాన్ని నమోదు చేసింది. దీనితో పాటు, చంద్రుని మ్యాపింగ్, వాతావరణ ప్రొఫైలింగ్ వంటి ఇతర పనులను కూడా చంద్రయాన్ -1 చేసింది.
రెండవ దశ: సాఫ్ట్ ల్యాండర్ / రోవర్
మార్చు2008 సెప్టెంబర్ 18 న, మన్మోహన్ సింగ్ క్యాబినెట్ రెండవ చంద్ర యాత్రను ఆమోదించింది. [1] ఈ యాత్రలో రష్యా భాగస్వామ్యం కూడా ఉంటుంది. 2009 ఆగస్టులో నౌక రూపకల్పన పూర్తయింది. ఇరు దేశాల శాస్త్రవేత్తలు సంయుక్త సమీక్ష నిర్వహించారు. [2] [3]
చంద్రయాన్-2 షెడ్యూల్ ప్రకారమే, ఇస్రో పేలోడ్‌ను ఖరారు చేసినప్పటికీ 2013 జనవరిలో యాత్రను వాయిదా వేశారు.[4] రష్యా ల్యాండరును అభివృద్ధి చేయలేకపోవడం వలన యాత్రను 2016 కు వాయిదా వెయ్యాల్సి వచ్చింది [5] [6] ఫోబోస్-గ్రంట్ మిషన్ విఫలమైన నేపథ్యంలో రోస్కోస్మోస్ చంద్రయాన్-2 నుండి వైదొలగింది. 2015 నాటికి కూడా ల్యాండర్‌ను అందించలేమని రష్యా చెప్పినప్పుడు, చంద్రయాన్-2 ను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలని భారత్ నిర్ణయించింది. [7] రెండవ దశలో కక్ష్యలో తిరిగే ఒక ఆర్బిటరుతో పాటు చంద్రునిపై మృదువైన ల్యాండింగ్ చేయగల ఒక ల్యాండరు, ఒక రోబోటిక్ రోవరు కూడా ఉన్నాయి.
చంద్రయాన్ -2 ను జూలై 14, 2019 న ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపివేసారు. తిరిగి 2019 జూలై 22 న [8] GSLV Mk III రాకెట్ ద్వారా ప్రయోగించారు.
మూడవ దశ: స్థలంలోనే నమూనాల విశ్లేషణ/నమూనాలను భూమికి తెచ్చే సంభావ్యత
మార్చుతదుపరి మిషన్ చంద్రయాన్ -3. దీనిని 2023 లో ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నారు. [9] [10] [11] ఈ మిషన్‌లో భారత్ జపాన్‌లు కలిసి పనిచేస్తాయి. అయితే యాత్రకు ఇంకా రూపకల్పన చెయ్యలేదు. సేకరించిన చంద్ర నమూనాల స్థాలిక విశ్లేషణ [12] [13] చంద్రుడిపై రాత్రివేళ మనగలిగే సాంకేతికత ప్రదర్శన ఇందులో భాగాలు. [14] ఈ యాత్రలో చంద్రుడి నమూనాలను భూమికి తెచ్చే అంశం కూడా ఉంటుంది అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.[15]
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sunderarajan, P. (19 September 2008). "Cabinet clears Chandrayaan-2". The Hindu. Retrieved 23 October 2008.
- ↑ "ISRO completes Chandrayaan-2 design". 17 August 2009. Retrieved 20 August 2009.
- ↑ "India and Russia complete design of new lunar probe". Sputnik News. RIA Novosti. 17 August 2009. Archived from the original on 15 ఏప్రిల్ 2016. Retrieved 20 August 2009.
- ↑ Ramachandran, R. (22 January 2013). "Chandrayaan-2: India to go it alone". The Hindu.
- ↑ Laxman, Srinivas (6 February 2012). "India's Chandrayaan-2 Moon Mission Likely Delayed After Russian Probe Failure". Asian Scientist. Retrieved 5 April 2012.
- ↑ "India's next moon mission depends on Russia: ISRO chief". NDTV. Indo-Asian News Service. 9 September 2012.
- ↑ "Chandrayaan-2 would be a lone mission by India without Russian tie-up". 14 August 2013.
- ↑ ISRO set for April launch of Chandrayaan-2 after missed deadline. Vikram Gopal, Hindustan Times. 11 January 2019.
- ↑ Shimbun, The Yomiuri (2019-07-30). "Japan, India to team up in race to discover water on moon" (in ఇంగ్లీష్). Archived from the original on 2019-12-28. Retrieved 2019-08-24.
- ↑ After Mars, ISRO to Set a Date with Venus. Archived 2019-07-16 at the Wayback Machine Trak. Malvika Gurung. 20 May 2019.
- ↑ After Reaching Mars, India's Date With Venus In 2023 Confirmed, Says ISRO. U. Tejonmayam, India Times. 18 May 2019.
- ↑ https://www.thehindu.com/sci-tech/science/india-japan-working-on-lunar-sample-return-mission/article20533828.ece "The Hindu". 17 November 2017.
- ↑ "Episode 82: Jaxa and International Collaboration with Professor Fujimoto Masaki" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-01-04.
- ↑ Sasaki, Hiroshi (17 June 2019). "JAXA's Lunar Exploration Activities" (PDF).
- ↑ "After Chandrayaan-2, is India planning a third moon trip with Japan?". 22 July 2019.