చంద్రశేఖర్ ఆజాద్ రావణ్
చంద్రశేఖర్ ఆజాద్ (జననం 1986 డిసెంబరు 3) భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త, అంబేద్కరైట్ కార్యకర్త & న్యాయవాది. ఆయన భీమ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు & ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) జాతీయ అధ్యక్షుడు. చంద్రశేఖర్ ఆజాద్ 2021 ఫిబ్రవరిలో టైమ్ మ్యాగజైన్ యొక్క వార్షిక జాబితాలో 100 మంది "భవిష్యత్తును రూపొందించే వర్ధమాన నాయకుల" జాబితాలో చోటు కల్పించింది.[1]
భీమ్ ఆర్మీ
మార్చుచంద్రశేఖర్ ఆజాద్ 2014లో వినయ్ రతన్ సింగ్‌తో కలిసి దళితులు & ఇతర అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పోరాడేందుకు భీమ్ ఆర్మీ \ భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ సంస్థను స్థాపించాడు. ఆయన 2015లో తన ఊరి ముఖ్యద్వారం దగ్గర 'ద గ్రేట్ చామర్స్ ఆఫ్ ధడ్‌కౌలీ వెల్‌కమ్ యు' బోర్డును ఏర్పాటు చేసి వార్తలోకికెక్కాడు. భీమ్ ఆర్మీలో 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న దళితులు ఎవరైనా చేరడానికి అర్హత కలిగి ఉన్నారు.
మే 2017 తిరుగుబాటు
మార్చుసహారన్పూర్ లో 2017 మేలో రాజ్‌పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్‌ను గౌరవించే ఊరేగింపులో అగ్రవర్ణాల ఠాకూర్లు సంగీతాన్ని ప్లే చేయడాన్ని దళితులు వ్యతిరేకించారు. దీంతో నిరసనలు, ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో 24 దళితుల ఇళ్లకు నిప్పంటించగా ఠాకూర్‌లలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సహారన్‌పూర్ జిల్లాలో దళిత సంఘాల సభ్యుల నిరసనను ప్రోత్సహించడంలో చంద్రశేఖర్ పాత్ర పోషించినందుకు పోలీసులు ఆయనపై మొత్తం 24 ఎఫ్‌ఐఆర్‌లలో నిందితుడిగా కేసులు పెట్టారు.
2017 మే చివరలో భీమ్ ఆర్మీ లుటియన్స్ ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించింది, దాని మద్దతుదారులు బిఆర్ అంబేద్కర్ ఫోటోతో పాటు నీలి జెండాలతో కూడిన ప్లకార్డులను ఊపుతూ, “జై భీమ్” నినాదాలు చేస్తూ, 'ఆజాద్' ఫోటో కలిగిన ముసుగులు ధరించి జంతర్ మంతర్ వద్ద దాదాపు 10,000 మందితో నిరసనలు తెలిపారు. చంద్రశేఖర్ మద్దతుదారులతో మాట్లాడేందుకు వేదికపైకి వచ్చి తాను లొంగిపోతున్నట్లు చెప్పారు.[2]
ఎంపీగా పోటీ
మార్చుచంద్రశేఖర్ ఆజాద్ 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని నగీనా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఆజాద్ సమాజ్ పార్టీ (ఎఎస్‌పీ) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఓం కుమార్ పై 1,51,473 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Hindu (18 February 2021). "Bhim Army chief Chandra Shekhar Aazad, 5 Indian-origin persons, feature in TIME magazine's list of 100 emerging leaders" (in Indian English). Archived from the original on 17 August 2023. Retrieved 17 August 2023.
- ↑ "Who is Chandrashekhar Azad?". 27 December 2019. Archived from the original on 19 August 2023. Retrieved 19 August 2023.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nagina". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.