సహారన్‌పూర్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం

సహారన్‌పూర్, ఉత్తరప్రదేశ్ లోని నగరం. ఇది సహారన్‌పూర్ జిల్లా ముఖ్యపట్టణం. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

సహారన్‌పూర్
నగరం
పైన: శాకంబరీ దేవి
కింద: సహారన్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషను
సహారన్‌పూర్ is located in Uttar Pradesh
సహారన్‌పూర్
సహారన్‌పూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 29°57′50″N 77°32′46″E / 29.964°N 77.546°E / 29.964; 77.546
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాసహారన్‌పూర్
జనాభా
 (2011)
 • Total7,05,478
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
247001/02
టెలిఫోన్ కోడ్0132
Vehicle registrationUP-11
లింగనిష్పత్తి1000/898 /

సహారన్‌పూర్ నగరానికి ఈ పేరు "షా హరూన్ చిష్టి" పేరు మీదుగా వచ్చింది. సహారన్‌పూర్ లో "శాకంబరీ దేవి" ఆలయం ప్రసిద్ధి చెందినది. నవరాత్రి సమయంలో లక్షలాది మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు . ఈ నగరాన్ని జైనుడైన సా రణబీర్సింగ్ స్థాపించాడని కొందరు భావిస్తారు.[1] ఒక సైనికదళ స్థావరంవద్ద అతడు ఈ నగరానికి శంకుస్థాపన చేసాడు.

స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా సహారన్‌పూర్‌ కూడా ఎంపికైంది.

చరిత్ర

మార్చు

మరాఠా పాలన (సా.శ. 1757–1803)

మార్చు

1757 లో, మరాఠా సైన్యం సహారన్‌పూర్ ప్రాంతంపై దండెత్తింది. మరాఠా పాలకులు రఘునాథ్ రావు, మల్హారావ్ హోల్కర్లు నజీబ్-ఉద్-దౌలా నుండి సహారన్‌పూర్‌ను వశపరచుకున్నారు. రోహిల్లాలు, మరాఠాలకూ మధ్య పోరు 1788 డిసెంబరు 18 న మరాఠా జనరల్ మహాదాజీ సింధియా చేతిలో ఓడిపోయిన నజీబ్-ఉద్-దౌలా మనవడు గులాం ఖాదిర్ బందీ కావడంతో ముగిసింది. సహారన్‌పూర్ నగరానికి నవాబ్ గులాం ఖాదిర్ చేకూర్చినది నవాబ్ గంజ్ ప్రాంతం, అహ్మదాబాదీ కోట. ఈ కోట ఇప్పటికీ ఉంది. గులాం ఖాదిర్ మరణం సహారన్‌పూర్‌లోని రోహిల్లా పరిపాలనకు ముగింపు పలికింది. సహారన్‌పూర్ మరాఠా సామ్రాజ్యానికి ఉత్తరాన ఉన్న జిల్లాగా మారింది. ఘనీ బహదూర్ బందా మొదటి మరాఠా గవర్నర్‌గా నియమితుడయ్యాడు. మరాఠా పాలనలో సహారన్‌పూర్ నగరంలోభూతేశ్వర ఆలయం, బాగేశ్వర్ ఆలయాలను నిర్మించారు. 1803 లో, రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠా సామ్రాజ్యాన్ని ఓడించినప్పుడు, సహారన్‌పూర్ బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళింది.

బ్రిటిష్ వలసపాలన కాలం (సా.శ. 1803-1947)

మార్చు

1857 లో మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధం జరిగినపుడు, సహారన్‌పూర్, ముజఫ్ఫర్ నగర్ జిల్లాలు ఆ తిరుగుబాటులో పాలుపంచుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల కార్యకలాపాల కేంద్రం ముజఫర్ నగర్ ప్రాంతంలోని షామ్లీ అనే చిన్న పట్టణం. తిరుగుబాటుదార్లు దీన్ని విముక్తి చేసారు. తిరుగుబాటు విఫలమైన తరువాత, బ్రిటిష్ వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంత ముస్లింలపై దాడులు జరిపారు. బ్రిటిష్ వారు వీళ్ళను తిరుగుబాటుకు ప్రధాన ప్రేరేపకులుగా భావించారు. బ్రిటిషు వారి దాడిలో ముస్లిం సమాజం సర్వనాశనమైంది. సామాజిక పునర్నిర్మాణం ప్రారంభమైనప్పుడు, ముస్లింల సాంస్కృతిక రాజకీయ చరిత్ర దేవబండ్, అలీగఢ్ ల చుట్టూ అల్లుకోవడం మొదలైంది. సాంఘిక, రాజకీయ పునరుజ్జీవనం కోసం సంస్కర్త షా వలీల్లా ప్రవచించిన భావజాలాన్ని సమర్ధించే మౌలానా ముహమ్మద్ ఖాసిమ్ నానోట్వి, మౌలానా రషీద్ అహ్మద్ గంగోహిలు 1867 లో దేవబండ్‌లో ఒక పాఠశాలను స్థాపించారు. ఇది దారుల్ ఉలూమ్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దాని వ్యవస్థాపకుల లక్ష్యం రెండు విధాలు: శాంతియుత పద్ధతుల ద్వారా ముస్లింలలో మత, సామాజిక చైతన్యాన్ని మేల్కొల్పగల పండితుల బృందాన్ని ఏర్పరచి వారి ద్వారా ముస్లింలకు వారి మతం పట్ల, సంస్కృతి పట్లా అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేయడం; హిందూ-ముస్లిం ఐక్యత, ఐక్య భారతదేశం అనే భావనను ప్రోత్సహించడం ద్వారా జాతీయత, జాతీయ ఐక్యత భావనలను తీసుకురావడం. సహారన్‌పూర్ నగరంలోని ముస్లిం పండితులు ఈ భావజాలానికి సమర్ధకులు. ఆరు నెలల లోనే వాళ్ళు మజాహిరుల్ ఉలూమ్ సహారన్‌పూర్ అనే మత సంస్థను స్థాపించారు.

భౌగోళికం

మార్చు

సహారన్‌పూర్ 29°58′N 77°33′E / 29.97°N 77.55°E / 29.97; 77.55 వద్ద, సముద్ర మట్టానికి 269 మీటర్ల ఎతున ఉంది. ఇది చండీగఢ్ నుండి ఆగ్నేయంగా140 కి.మీ., ఢిల్లీకి ఈశాన్యంగా 170 కి.మీ.0, షామ్లీకి ఈశాన్యంగా 65 కి.మీ. డెహ్రాడూన్ నుండి నైరుతిలో 61 కి.మీ. దూరంలో ఉంది. సహారన్‌పూర్ భౌగోళిక దోఅబ్ ప్రాంతంలో ఒక భాగం. సహారన్‌పూర్ జిల్లాకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయి

జనాభా

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం సహారన్‌పూర్ జనాభా 7,05,478, అందులో పురుషులు 3,71,740, మహిళలు 3,33,738. అక్షరాస్యత రేటు 76.32%.[2]

సహారన్‌పూర్‌లో మతం[3]
మతం శాతం
హిందూ మతం
  
50.92%
ఇస్లాం
  
45.89%
సిక్కుమతం
  
1.23%
జైన మతం
  
1.03%
ఇతరాలు
  
0.45%

నగరానికి చెందిన వ్యక్తులు

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. Desk, India TV News (2012-11-16). "India's Agrawal community: Its history and prominent personalities". Indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 28 October 2019.
  2. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
  3. "Saharanpur Religion Census 2011". Office of the Registrar General and Census Commissioner, India.