చంద్రశేఖర్ సింగ్

చంద్రశేఖర్ సింగ్ (1927 ఆగస్టు 17 - 1986 జూలై 9) బీహారుకు చెందిన రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. 1983 ఆగష్టు నుండి 1985 మార్చి వరకు బీహారుకు 16 వ ముఖ్యమంత్రిగా పనిచేసాడు.[2] మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ల మంత్రివర్గాల్లో మంత్రి పదవులను నిర్వహించారు. అతను బీహార్ విధానసభకు నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు.

చంద్రశేఖర్ సింగ్

బీహారు 20 వ ముఖ్యమంత్రి

కేంద్ర పెట్రోలియమ్ శాఖ సహాయ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మనోరమా సింగ్[1]
సంతానం కంచన్ సింగ్, వి.ఎస్.సింగ్, శశాంక్ శేఖర్

అతను ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. [3]

అతను చివరిసారిగా కేంద్ర పెట్రోలియం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు, ఈ సమయంలో అతను క్యాన్సర్ కారణంగా మరణించాడు.

అతను 1952, 1957, 1969 లో ఝాజా (విధాన సభ నియోజకవర్గం) నుండి బీహార్ విధానసభకు ఎన్నికయ్యాడు. అతను 1962 లో ఝాజా నుండి ఓడిపోయాడు. [4] అతను 1972 లో చకాయ్ నుండి విధానసభకు ఎన్నికయ్యాడు. అతనికీ రాజపుత్ర నేత సత్యేంద్ర నారాయణ్ సిన్హాకూ చుట్టరికం ఉంది.1980 పార్లమెంటు ఎన్నికలలో అతను బంకా (లోక్ సభ నియోజకవర్గం) నుండి అత్యధిక మెజారిటీతో గెలిచాడు, 1983 లో, ఇందిరా గాంధీ అతన్ని బిహార్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. 1985 ఎన్నికల తరువాత, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ పెట్రోలియం శాఖ కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రివర్గం లోకి తీసుకున్నాడు. 1985 లో బంకా లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచాడు. 1986 లో అతని మరణం తరువాత అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అతని భార్య మనోరమ సింగ్ గెలిచింది. అతను మొత్తం 5 సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. [5]

అతని పేరు మీద బీహార్‌లోని జమూయిలో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసారు. [6] ఇది పరిసర ప్రాంతాల లోని పురాతన వస్తువులను పరిరక్షించడానికి 1983 లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్థాపించింది.

రాజకీయ జీవితం మార్చు

సింగ్ అట్టడుగు స్థాయి నుండి కాంగ్రెసు పార్టీలో సభ్యుడుగా ఉంటూ వచ్చాడు. గ్రామ స్థాయిలో కార్యకర్తలతో మమేకమయ్యాడు. [3] గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిలలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు. కేవలం 25 సంవత్సరాల వయసులో 1952 లో మొదటిసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. [3] 1957 లో మళ్లీ ఎన్నికయ్యాడు. కొన్నాళ్లు విరామం తీసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి 1969 లో మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టాడు. 1977 వరకు సభ్యుడిగా కొనసాగాడు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యుడిగా పోటీ చేసి, జనతా ప్రభంజనంలో ఓడిపోయాడు. మళ్ళీ 1980 లో బంకా స్థానంలో మధు లిమాయేను ఓడించి ఎన్నికయ్యాడు. అతను పరిపాలనలో సమర్థుడిగా పేరుపొందాడు. పార్లమెంటు కార్యదర్శి అయ్యాడు. రెవెన్యూ, పరిశ్రమలు, మైనర్ ఇరిగేషన్, లామ్ పబ్లిక్ వర్క్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖలకు మంత్రిగా చేసాడు. 1983 లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయన ఇంధన శాఖ సహాయ మంత్రి అయ్యాడు.

స్వాతంత్ర్య ఉద్యమం మార్చు

బిందేశ్వరి దూబే, భగవత్ ఝా ఆజాద్, అబ్దుల్ గఫూర్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, కేదార్ పాండే, సీతారాం కేసరి వంటి ప్రసిద్ధ యంగ్ టర్క్‌లతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

అతను ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా కలిగి ఉన్నాడు. [3]

మూలాలు మార్చు

  1. "Bihar's biwi brigade". The Times of India. 6 October 2013. Retrieved 22 November 2017.
  2. "Chief Minister, Bihar". Chief Minister's Secretariat. Archived from the original on 19 March 2011. Retrieved 2011-02-07.
  3. 3.0 3.1 3.2 3.3 Farzand, Ahmed (15 September 1983). "I mean business: Bihar CM Chandrashekhar Singh" (in ఇంగ్లీష్). India Today. Retrieved 23 February 2021.
  4. "Bihar Assembly Election Results in 1962".
  5. http://www.parliamentofindia.nic.in/ls/comb/combexpr.htm
  6. "Archived copy". Archived from the original on 17 March 2016. Retrieved 18 June 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)