చంద్రుడి వద్దకు చైనా పరిశోధక యాత్రలు

చంద్రుడిపై పరిశోధన కోసం చైనా చేపడుతున్న యాత్రల పరంపరే చైనీస్ చంద్ర అన్వేషణ కార్యక్రమం. చైనీయుల చంద్ర దేవత పేరిట దీన్ని చాంగి ప్రాజెక్టు అని పిలుస్తారు. 2007 లో చైనా మొదటి యాత్ర చేపట్టి 2019 ఆగస్టు నాటికి నాలుగు యాత్రలు చేసింది. 2019 డిసెంబరులో ఐదవ యాత్ర చేసేందుకు సన్నాహలు చేస్తోంది. ఈ ఐదూ మానవ రహిత, రోబోటిక్ యాత్రలే. లాంగ్ మార్చ్ రాకెట్లను ఉపయోగించి చేస్తున్న ఈ పరిశోధక యాత్రల్లో ఆర్బిటర్లు, ల్యాండర్లు, రోవర్లు, భూమికి తిరిగి వచ్చే నమూనా అంతరిక్ష నౌకలూ ఉన్నాయి. ప్రయోగాలు, ప్రయాణాలను టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ (టిటి అండ్ సి) వ్యవస్థ పర్యవేక్షిస్తూంటుంది. బీజింగ్‌ లోని 50 మీ. రేడియో యాంటెనాలు, కున్మింగ్, షాంఘై, ఉరుమ్‌కి లోని 40 మీ. యాంటెనాలనూ వాడి, 3000 కి.మీ. ల VLBI యాంటెన్నా వ్యవస్థను ఏర్పరచి, పర్యవేక్షణకు వాడుతున్నారు. [1] స్వంత గ్రౌండ్ అప్లికేషన్ సిస్టమ్ ద్వారా డౌన్‌లింక్ డేటాను అందుకుంటుంది.

Chinese Lunar Exploration Program
దేశంChina
సంస్థChina National Space Administration (CNSA)
స్థితిcurrent
ప్రోగ్రాము చరిత్ర
ప్రోగ్రాము వ్యవధి2003 - present
తొలి ఫ్లైటుChang'e 1, 24 October 2007, 10:05:04.602 (2007-10-24UTC10:05:04Z) UTC
ప్రయోగ స్థలాలు
వాహన సమాచారం
వాహన రకంlunar orbiters, landers, rovers and sample return spacecraft
ప్రయోగ వాహనాలు

ఈ కార్యక్రమం లోని మొట్టమొదటి అంతరిక్ష నౌక, చాంగి 1 ఆర్బిటరు. జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి 2007 అక్టోబరు 24 న ప్రయోగించారు. రెండవ ఆర్బిటరు చాంగి 2 ను 2010 అక్టోబరు 1 న పంపించారు. [2] ల్యాండరు, రోవరూ కలిగిన చాంగి 3 ని 2013 డిసెంబరు 1 న పంపించారు. ఇది 2013 డిసెంబరు 14 న విజయవంతంగా చంద్రునిపై దిగింది. ల్యాండరు, రోవరు కలిగిన చాంగి 4 ను 2018 డిసెంబరు 7 న పంపించారు. ఇది 2019 జనవరి 3 న దక్షిణ ధ్రువం-ఐట్కెన్ బేసిన్లో, చంద్రునికి ఆవలి వైపున (భుమికి కనబడని వైపున) దిగింది. భూమికి తిరిగి రాగలిగే నౌక చాంగి 5 ను 2019 డిసెంబరులో పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. [3]

కార్యక్రమ నిర్మాణం

మార్చు

చైనా చంద్ర పరిశోధన కార్యక్రమాన్ని నాలుగు ప్రధాన కార్యాచరణ దశలుగా విభజించారు. ప్రతి యాత్ర, భవిష్యత్తు యాత్రల కోసం సాంకేతికత ప్రదర్శన లాగా పనిచేస్తుంది. ఈ యాత్రల్లో వాడే వివిధ పేలోడ్ల కోసం, రోబోటిక్ స్టేషన్ రూపకల్పన కోసం అంతర్జాతీయ సహకారాన్ని చైనా ఆహ్వానించింది. [4]

మొదటి దశ: కక్ష్యా యాత్రలు

మార్చు

రెండు చంద్ర కక్ష్యా వాహనాలను ప్రయోగించిన తొలి దశ పూర్తయినట్లే.

  • లాంగ్ మార్చి 3A రాకెట్‌లో 2007 అక్టోబరు 24 న ప్రయోగించిన చాంగి 1, మొత్తం చంద్రుడిని అపూర్వమైన వివరాలతో స్కాన్ చేసి, హై సాఫ్ట్ డెఫినిషన్ 3 డి మ్యాప్‌ను రూపొందించింది. ఇది భవిష్యత్తులో సాఫ్ట్ ల్యాండింగుల కోసం సూచనను అందిస్తుంది. ఉపయోగపడే వనరుల మూల్యాంకనంలో భాగంగా చంద్ర ఉపరితలంపై వివిధ రసాయన మూలకాల అందుబాటు, సమృద్ధి, విస్తృతి లను కూడా ఈ పరిశోధన మ్యాప్ చేసింది.
  • 2010 మార్చి 1 న లాంగ్ మార్చి 3 సి రాకెట్‌లో ప్రయోగించిన చాంగి 2, 5 రోజులలోపే చంద్రుడిని చేరుకుంది. (చాంగి 1 ఇందుకు 12 రోజులు తీసుకుంది.) ఇది చంద్రుడిని మరింత వివరంగా మ్యాప్ చేసింది. తరువాత ఇది చంద్ర కక్ష్యను వదిలి భూమి-సూర్యుల ఎల్2 లాగ్రాంజియన్ బిందువు వైపు వెళ్ళింది. TT&C నెట్‌వర్కు సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇలా చేసారు. 2012 డిసెంబరు 13 న ఇది 4179 టౌటాటిస్ అనే గ్రహశకలానికి దగ్గరగా వెళ్ళి, ఆ తరువాత టిటి అండ్ సి నెట్‌వర్క్‌ను మరింత పరీక్షించడానికి ఇంకా దూరంగా అంతరిక్షంలోకి వెళ్ళింది.

దశ II: సాఫ్ట్ ల్యాండర్లు / రోవర్లు

మార్చు

చంద్రునిపై మృదువుగా దిగి, అక్కడ రోవరును నడపగలిగే నౌకలను రెండవ దశలో పంపిస్తారు. ఈ దశ కొనసాగుతోంది.

  • లాంగ్ మార్చి 3 బి రాకెట్‌లో 2013 డిసెంబరు 2 న ప్రయోగించిన చాంగి 3, 2013 డిసెంబరు 14 న చంద్రునిపై దిగింది. దానితో 140 కిలోల రోవరు యుటు ను పంపించారు. 3 నెలల పాటు పనిచేసి, 3 చ.కి.మీ. ప్రదేశాన్ని పరిశోధించేలా దీన్ని రూపొందించారు. ఇది గెలాక్సీలు, క్రియాశీల గెలాక్సీ న్యూక్లియైలు, వేరియబుల్ స్టార్స్, బైనరీస్, నోవా, క్వాసార్స్, బ్లేజర్‌ల అల్ట్రా వయొలెట్ పరిశీలనలు జరపడానికి, అలాగే భూమి యొక్క ప్లాస్మాస్పియరు నిర్మాణము, డైనమిక్స్‌ల పరిశోలన కూడ్ చేస్తుంది.
  • చాంగి 4 ను 2018 డిసెంబరు 7 న పంపించారు. వాస్తవానికి 2015 లోనే ఈ యాత్రను చాంగి 3 కోసం బ్యాకప్‌గా తలపెట్టారు. అయితే, ఆ యాత్ర విజయవంతం కావడంతో, చాంగి 4 నిర్మాణాన్ని తదుపరి యాత్రకు తగినట్లుగా మార్చారు. ఇది 2019 జనవరి 3 న చంద్రుని దక్షిణ ధ్రువం-ఐట్కెన్ బేసిన్లో, చంద్రుడికి ఆవలి వైపున దిగి, యుటు -2 రోవరును మోహరించింది.

దశ III: నమూనాలను భూమికి తెచ్చే యాత్ర

మార్చు

మూడవ దశలో చంద్ర నమూనాలను భూమికి తెచ్చే యాత్ర ఉంటుంది .

  • చాంగి 5-టి1 ను 2014 అక్టోబరు 23 న పంపించారు. ఇది చంద్రుడి నుండి వెనక్కి వచ్చే అంతరిక్ష నౌకను పరీక్షించడానికి రూపొందించారు.
  • లాంగ్ మార్చి 5 రాకెట్‌లో చాంగి 5 ను 2019 డిసెంబరులో పంపించాలని తలపెట్టారు. [5] 2 కిలోల చంద్ర నమూనాలను వెనక్కి తేగల సామర్థ్యమున్న ల్యాండరును ఈ నౌక కలిగి ఉంటుంది.

దశ IV: చంద్ర పరిశోధనా కేంద్రం

మార్చు

చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోబోటిక్ పరిశోధనా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. [4] [6] [7]

  • చాంగి 6, 2023 లేదా 2024 లో పంపిస్తారు. [8] ల్యాండింగ్ సైట్ యొక్క స్థలాకృతి, కూర్పు, ఉప ఉపరితల నిర్మాణాన్ని పరిశీలిస్తుంది. ఇది దక్షిణ ధ్రువ నమూనాలను భూమికి తెస్తుంది.
  • చాంగి 7, 2023 లో పంపిస్తారు. వనరుల కోసం దక్షిణ ధ్రువాన్ని అన్వేషించే ల్యాండరు ఇందులో ఉంటుంది. [9] [10] [11] మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండరు, రోవరు ఉండవచ్చు. [6]
  • 2027 లో పంపించే చాంగి 8, సహజ వనరుల వినియోగం, అభివృద్ధిని ధృవీకరిస్తుంది. ఇందులో ల్యాండరు, రోవరు, ఫ్లయింగ్ డిటెక్టరు ఉండవచ్చు. అలాగే చంద్రుడిపైననే లభించే వనరులను ఉపయోగించి 3 డి-ప్రింటింగు ద్వారా ఒక నిర్మాణాన్ని చేసే ప్రయోగం ఉండవచ్చు [4] ఒక చిన్న సీలు చేసిన పర్యావరణ వ్యవస్థ ప్రయోగాన్ని కూడా ఇది రవాణా చేస్తుంది.

మానవ సహిత యాత్ర

మార్చు

2019 నాటికి, 2030 లలో మనుషులను చంద్రుడిపైకి పంపడం కోసం అవసరమైన ప్రాథమిక అధ్యయనాలను చేస్తోంది. [12][13][14] అంతర్జాతీయ సహకారంతో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర ఒక అవుట్‌పోస్ట్‌ను నిర్మించవచ్చు కూడా. [4]

రష్యాతో సహకారం

మార్చు

పరస్పర సహకారంతో చంద్రుడిపైన, సుదూర అంతరిక్షంలోనూ పరిశోధనలు చేసేందుకు ఒక ఒప్పందంపై 2017 నవంబరులో చైనా, రష్యాలు సంతకం చేసాయి.[15] ఈ ఒప్పందంలో ఆరు రంగాలు ఉన్నాయి. వీటిలో చంద్రుడు, సుదూర అంతరిక్షం, ఉమ్మడి అంతరిక్ష నౌక అభివృద్ధి, అంతరిక్ష ఎలక్ట్రానిక్స్, ఎర్త్ రిమోట్ సెన్సింగ్ డేటా, అంతరిక్ష శిధిలాల పర్యవేక్షణ ఉన్నాయి. [16][17] మానవ అంతరిక్ష యాత్రల కోసం చైనాతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి రష్యా ఆసక్తి చూపవచ్చు. దాని మానవ అంతరిక్ష ప్రయాణ సహకారాన్ని అమెరికా నుండి చైనాకు మార్చవచ్చు కూడా. చైనా సహకారంతో మానవ సహిత చంద్ర ల్యాండరును నిర్మించచ్చు కూడా. [18]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "巨型望远镜送"嫦娥"飞月-望远镜,嫦娥-北方网-科技无限". Archived from the original on 2017-10-24. Retrieved 2019-08-27.
  2. Stephen Clark (1 October 2010). "China's second moon probe dispatched from Earth". Spaceflight Now. Retrieved 1 October 2010.
  3. Nowakowski, Tomasz (9 August 2017). "Chine Eyes Manned Lunar Landing by 2036". Archived from the original on 12 నవంబరు 2020. Retrieved 17 August 2017.
  4. 4.0 4.1 4.2 4.3 Chang'e 4 press conference. CNSA, broadcast on 14 January 2019.
  5. Nowakowski, Tomasz (9 August 2017). "Chine Eyes Manned Lunar Landing by 2036". Archived from the original on 12 నవంబరు 2020. Retrieved 17 August 2017.
  6. 6.0 6.1 China's Planning for Deep Space Exploration and Lunar Exploration before 2030. (PDF) XU Lin, ZOU Yongliao, JIA Yingzhuo. Space Sci., 2018, 38(5): 591-592. doi:10.11728/cjss2018.05.591
  7. A Tentative Plan of China to Establish a Lunar Research Station in the Next Ten Years. Zou, Yongliao; Xu, Lin; Jia, Yingzhuo. 42nd COSPAR Scientific Assembly. Held 14–22 July 2018, in Pasadena, California, USA, Abstract id. B3.1-34-18.
  8. https://m.guancha.cn/internation/2019_03_26_495099.shtml
  9. "Lunar plans for phase IV". Archived from the original on 2019-04-15. Retrieved 2019-08-27.
  10. Lunar program next plan
  11. Chang’e-4 landing to be a step along a road of lunar exploration for China. Andrew Jones, Space News. December 28, 2018.
  12. China lays out its ambitions to colonize the moon and build a "lunar palace". Echo Huang, Quartz. 26 April 2018.
  13. China is making preparations for manned lunar landing Archived 2019-04-15 at the Wayback Machine. Global Times, Source: Xinhua. 7 June 2017.
  14. China prepares first manned mission to the Moon. Ben Blanchard, Independent. 7 June 2017.
  15. China, Russia agree cooperation on lunar and deep space exploration, other sectors. Archived 2019-08-27 at the Wayback Machine GB Times. 2 November 2017.
  16. Russia, China to add lunar projects to joint space cooperation program. TASS, Russia. 11 July 2018.
  17. China, Russia agree cooperation on lunar and deep space. Janet R. Aguilar, Tunisie Soir. 3 March 2018.
  18. Russia's Space Agency Might Break Up With the U.S. To Get With China. Anatoly Zak, Popular Mechanics. 7 March 2018.

బయటి లింకులు

మార్చు