చతుర పత్రిక (1978-2021) ఈనాడు గ్రూపుచే నిర్వహించబడిన మాస పత్రిక. ఇందులో ప్రతి నెలా ఒక నవల ప్రచురించబడింది. దీనికి రూపకల్పన చేసినది తొలి నుంచి నేటి దాకా సంపాదకుడిగా ఉన్నది చలసాని ప్రసాదరావు. ఇందులో ప్రచురించిన మొదటి నవల కమలమ్మ కమతం దీని రచయిత సి.ఎస్.రావు. ప్రారంభించినప్పుడు దీని ధర ₹1.25 [2].

చతుర
చతుర తుది సంచిక
చతుర తుది సంచిక
ముద్రణకర్తరామోజీ ఫౌండేషన్
మొదటి సంచికఫిబ్రవరి 1, 1978 (1978-02-01)
ఆఖరి సంచికమార్చి 1, 2021; 3 సంవత్సరాల క్రితం (2021-03-01)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

సకుటుంబంగా చదువుకోగల ఉత్తమ ప్రమాణాలతో ఉన్నత భావాలు రచనలను ప్రచురించటం చతుర మాస పత్రిక లక్ష్యం

చతుర పత్రిక నూరు సంచికలు పూర్తి అయిన సందర్భముగా నిర్వహించిన మొట్టమొదటి నవలల పోటీలో ఓల్గా నవల స్వేచ్ఛ కు పదివేల రూపాయలు ప్రథమ బహుమతి గెలుచుకుంది. వసంతరావు పాండే రచనఅడవి నవల రెండవ బహుమతి, తిరుపతయ్య రచన బతుకు మూడో బహుమతి పొందారు.

కరోనా నిరోధంలో భాగంగా ఇంటి పట్టునే ఉంటున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల పత్రికలను అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్టు ‘రామోజీ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.[3]

2021 మార్చి సంచికతో ఈ పత్రిక మూతపడింది.[1]

శీర్షికలు

మార్చు
  • మనసున ఉన్నదీ : ప్రేక్షకుల అభిప్రాయాలను ప్రచురించే శీర్షిక
  • చతుర నవలిక
  • చతుర కథలు
  • నవలావలోకనం : నవలల పరిచయం
  • చతుర సమ్ గతులు : ప్రపంచ విశేషాల సమాహారం


మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు". రామోజీ ఫౌండేషన్. 2021-03-01. Retrieved 2021-03-08.[permanent dead link]
  2. https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/109809/12/12_anubhandhalu.pdf
  3. "Wayback Machine". web.archive.org. Retrieved 2020-08-31.

బయటి లింకులు

మార్చు