ఓల్గా (రచయిత్రి)

భారతీయ తెలుగు రచయిత
(పోపూరి లలిత కుమారి నుండి దారిమార్పు చెందింది)

ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి.[1] ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు[2] స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది.[3]

ఓల్గా
జననంపోపూరి లలిత
నవంబర్ 27, 1950
Indiaగుంటూరు,ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా
వృత్తిఅధ్యాపకురాలు
రచయిత
సంఘసేవిక
మతంహిందూ

నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసిన తర్వాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఓల్గా కథలు, నవలలు, పద్యాలు మహిళా సాహిత్యములో ఎన్నదగినవి. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై స్త్రీ చైతన్యము అంశముగా రచనలు చేసి తనకై ఒక ప్రత్యేక స్థానము సంపాదించింది. పత్రికలలో, సాహిత్యములో, అనువాదములలో మహిళా హక్కులపై వివాదాస్పద చర్చలు గావించింది. చలన చిత్ర రంగములో 'ఉషా కిరణ్' సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది. ఈమె రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసారు. 1991 నుండి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు. ఆమె ప్రస్తుతం అస్మితలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు ఓల్గా వ్రాసిన 12 రచనలను, ఆమె కథల ఆంగ్లానువాదములను తమ సంగ్రహములో చేర్చారు. వీరి విముక్త కథలను అజయ్ వర్మా అల్లూరి కన్నడలోకి అనువదించారు. ఆ కథలు ఇతర భారతీయ భాషలకు కూడా అనువాదమయ్యాయి.

రచనలు

మార్చు
  • రాజకీయ కథలు -1993
  • స్వేచ్ఛ - 1994
  • సహజ - 1995
  • ప్రయోగం - 1995
  • మానవి - 1998
  • కన్నీటి కెరటాల వెన్నెల - 1999
  • గులాబీలు - 2000
  • అకాశంలో సగం (ఉత్తమ నవల పురస్కారం)
  • పలికించకు మౌనమృదంగాలు
  • అలజడి మాజీవితం
  • జీవితం
  • కన్నీటి కెరటాల వెన్నెల
  • అక్షర యుద్ధాలు - 2009
  • అతడు-ఆమె మనం - 2005
  • నవలామాలతీయం - 2006
  • సరిహద్దులు లేని సంధ్యలు (వసంత కన్నాభిరన్, కల్పన కన్నభిరన్‌లతో కలిసి) - 1995

నవలలు

మార్చు

1. సహజ (1986) : ఇది ఒక నలుగురు స్నేహితుల కథ. వీరు పెళ్ళి, కుటుంబం వారి జీవితాన్ని, సృజనాత్మకతను నాశనం చేసిందని, ఆ అణిచివేత నుండి బయటపడటానికి చేసే ప్రయత్నమే ఈ నవల. 2. స్వేచ్ఛ (1987) - తెలుగులో స్త్రీ స్వేచ్ఛ పై అత్యంత వివాదాస్పదమయిన, అత్యంత ప్రజాదరణ పొందిన నవల. చాల మందికి ఈ నవల నచ్చలేదు ఎందుకంటే ఈ నవల స్త్రీ స్వేచ్ఛను చర్చకు తెచ్చింది. ఈ నవలను తొలి తెలుగు స్త్రీవాద నవలగ కూడా పరిగణిస్తున్నారు. ఈ నవలలోని ప్రధాన పాత్ర అరుణ తన జీవితంలో స్వేచ్ఛ అంటే అర్థం కోసం వెతుకుతుంది. ఈ క్రమమంలో తన తల్లి తండ్రులు, భర్థ, కూతురు, కుటుంబం, తను పనిచేసే సంస్థను కూడా వదిలివేస్తుంది.

ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదాలు

మార్చు

1. ఆగ్నెస్ స్మెడ్లీ కథలు (1984) 2. ఆలెక్షన్ద్ర కొల్లంటాయి మూడు తరాలు (Three Generations1989) 3. ఓరిఅన ఫాలసి పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం (Letter to a Child Never Born 1990) 4. ఎరియల్ దర్ఫ్మాన్ విడోస్ (Widows 1994)

ఎడిటెడ్ రచనలు

మార్చు

1. మాకు గోడలు లేవు (1989) - స్త్రీవాద వ్యాసాలు 2. నీలిమేగాలు (1993) - తెలుగులో స్త్రీవాద కవిత్వం పై సంకలనము. స్త్రీవాద విమర్శకులు స్త్రీవాద రచనలపై చేసిన దాడికి స్పందిస్తూ, స్త్రీవాద రచనలను సమర్థిస్తూ రాయబడింది. 3. నూరేళ్ళ చలం (1994) - చలం రచనలపై విమర్శనాత్మక వ్యాసాలు. 4. సహిత - సాహిత్య వ్యాసాలు (2010) సాహిత్య వ్యాసాల సంకలనం. ఇందులో కుటుంబవ్యవస్థ, బాల్యవివాహాలు, తెలుగు నలలలో స్త్రీలు, చలం, మెక్సికన్ స్త్రీవాద రచయితలు, స్త్రీవాద పోయెట్రీ గురించి చర్చించారు.

కో ఎడిటెడ్ రచనలు

మార్చు

1. సారంశం (1994) - ఆంధ్రప్రదేశ్లో స్త్రీల సార వ్యతిరేక ఉద్యమంపై రిపోర్టు. 2. సరిహద్దులు లేని సంద్యలు (1995) - స్త్రీవాద రాజకీయాలపై వ్యాసాలు.

అవార్డులు

మార్చు
  1. 1987 - ఉషోదయ పబ్లికేషన్స్ వారు ఉత్తమ నవల రచయిత అవార్డు "స్వేచ్చ" నవలకు.
  2. 1990 - ఉదయం మాగజిన్ వారు ఉత్తమ నవల రచయిత అవార్డు
  3. 1998 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నంది అవార్డు ఉత్తమ కథ రచయిత "తోడు' అనే కథకు.
  4. 1999 - తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ స్త్రీ రచయిత అవార్డు.
  5. 2014 - లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు.
  6. 2015 - ఆమె వ్రాసిన విముక్త కథల సంపుటి ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైనది.

మూలాలు

మార్చు
  1. ఓల్గా, 20వ శతాబ్దంలో తెలుగు రచయిత్రుల రచనలు, అబ్బూరి ఛాయాదేవి, 2002.
  2. "Women Unlimited వెబ్‌సైట్లో ఓల్గా ప్రొఫైల్". Archived from the original on 2015-05-15. Retrieved 2013-05-17.
  3. ‘Writing is a critical form of activism’ - The Hindu January 20, 2013

బయటి లింకులు

మార్చు