చమేరా ఆనకట్ట రావి నదిపై నిర్మించారు. ఇక్కడి జలవిద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన నీటి సరఫరా చేస్తుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబా జిల్లాలో డల్హౌసీ పట్టణానికి సమీపంలో ఉంది. ఆనకట్ట వెనుక ఏర్పడ్డ జలాశయం పేరు చమేరా సరస్సు. ఈ జలాశయంలో ఎక్కువ భాగం చంబాలోని సలూని సబ్-డివిజన్‌లో ఉంది.

1994 లో మొదటి దశ పూర్తయిన తర్వాత, చమేరా-I 540 MW (3x180 MW) విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. రెండవ దశ అంటే చమేరా-II 300 MW (3X100 MW) విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2012 సంవత్సరం నుండి, 3వ దశ అంటే చమేరా III 231 MW (3x77) విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.

ఈ ప్రాంతపు ప్రత్యేక లక్షణం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు. ఆనకట్ట దగ్గర పగటిపూట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. రాత్రిపూట కనిష్టంగా 18 నుండి 20°C కి పడిపోతుంది.

చమేరా సరస్సులో నీటిమట్టం గరిష్టంగా 763 మీటర్లు కాగా, కనిష్ట నీటిమట్టం 747 మీటర్లు

సరస్సులో జలచరాలు లేకపోవడంతో నీటి క్రీడలకు అనువైన ప్రదేశంగా మారింది. పర్యాటక శాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం, ఈ సరస్సులో రోయింగ్, మోటారు పడవ, తెడ్డు పడవ, తెరచాప పడవ, కానోయింగ్, యాంగ్లింగ్, కయాకింగ్ వంటి క్రీడలు జరపవచ్చు. హౌస్ బోట్లు, షికారాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

విశేషాలు

మార్చు

ఆనకట్ట పరీవాహక ప్రాంతం 472.5 కిమీ2. జలాశయం లైవ్ నిల్వ సామర్థ్యం 110 MCM. సగటు వార్షిక ఇన్ ఫ్లో 1,273 BCM. దీని పూర్తి జలాశయ మట్టం (FRL) 760 మీ. కాగా నీటిని విడుదల చేయగలిగే కనీస మట్టం (MDDL) 747 మీ.

విద్యుత్కేంద్రంలో ఒక్కొక్కటి 180 మెగావాట్ల సామర్థ్యం గల 3 యూనిట్లు ఉన్నాయి.

2003 లో చమేరా పవర్ స్టేషన్ రెండవ దశ (3X100 మెగావాట్లు) పూర్తయిన తర్వాత, చమెరా ఆనకట్టకు చమేరా పవర్ స్టేషన్ స్టేజ్ - I అని పేరు మార్చారు. రావి బేసిన్ ప్రాజెక్టుల మూడవ దశ, చమేరా స్టేజ్ - III (77X3 మెగావాట్లు) కూడా పూర్తయి, పనిచేస్తున్నాయి. చమేరా మూడు దశలు NHPC లిమిటెడ్ కంపెనీకి చెందినవి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు