రావి నది
రావి నది ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటి. ఇది సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. పంజాబులో ప్రవహించే ఐదు నదుల్లో ఇది అతి చిన్నది. ఈ నది మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.
రావి నది | |
---|---|
స్థానం | |
దేశం | భారత పాకిస్తాన్లు |
భౌతిక లక్షణాలు | |
మూలం | బారా బంగల్ |
• స్థానం | హిమాచల్ ప్రదేశ్ |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | చీనాబ్ నది |
పొడవు | 720 కి.మీ. (450 మై.) |
పరీవాహక ప్రాంతం | భారత దేశం, పాకిస్తాన్ |
ప్రవాహం | |
• సగటు | 267.5 m3/s (9,450 cu ft/s) (near Mukesar[1]) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
River system | సింధు నదీ వ్యవస్థ |
ఉపనదులు | |
• కుడి | సియుల్ |
చరిత్ర
మార్చువేదకాలంలో రావి నదిని ఇరావతి అని పరుషిణి అనీ ప్రస్తావించారు. [2] [3][4] ప్రాచీన గ్రీకులు దీన్నీ హైడ్రయోటెస్ అని పిలిచారు[5][6] వేదాల్లో ఉదహరించిన దాశరాజ యుద్ధం ఇరావతి నదిపైన జరిగింది.
భౌగోళికం
మార్చుహిమాచల్ ప్రదేశ్, కాంగ్రా జిల్లా లోని బారా భంగల్ వద్ద రావి నది ఉద్భవిస్తుంది.[7] భారతదేశంలో ఇది 720 కి.మీ. ప్రవహిస్తుంది, ఇక్కడ దీని పరీవాహక ప్రాంతం 14,442 చ.కి.మీ. దీనికి ఇరు పైపుల పీర్ పంజాల్ శ్రేణి, ధవళధార్ శ్రేణి ఉన్నాయి.[8]
రావి నది ఉపనదుల్లో రెండు - బుధిల్, నాయి నదులు అది పుట్టిన చోటి నుండి 64కి.మీ. దూరంలో దానిలో కలుస్తాయి. బుధిల్ నది లాహుల్ కొండ శ్రేణిలో ఉద్భవించి 72 కి.మీ. ప్రయాణించి రావిలో సంగమిస్తుంది. ఇందు లోకి, మణిమహేష్ కైలాస గిరి నుండి, మణిమహేష్ సరస్సు నుండి నీరు ప్రవహిస్తుంది. నాయికాళీదేవి కనుమ వద్ద ఉద్భవించి 48 కి.మీ. ప్రవహించి రావిలో కలుస్తుంది.
రావి ఉపనదుల్లో సియుల్, సియావా, బైరా నాలా, తంత్ గడీలు కూడా ఉన్నాయి.
రావి బేసిన్ నుండి నీటి బదిలీ
మార్చురావి నది బేసిన్ నుండి బియాస్ నది బేసిన్‌కు రావి బియాస్ లింకు కాలువ ద్వారా నీటిని బదిలీ చేసారు. అలాగే బియాస్ సట్లెజ్ లింకు కాలువ ద్వారా ఆ రెండు బేసిన్లనూ కలిపి భాక్రా జలాశయం సామర్థ్యాన్ని పెంచారు.[9]
మూలాలు
మార్చు- ↑ "Gauging Station - Data Summary". ORNL. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 1 అక్టోబరు 2013.
- ↑ Hastings, James (2003). Encyclopedia of Religion and Ethics, Part 18. Kessinger Publishing. p. 605. ISBN 0-7661-3695-7. Retrieved 14 April 2010.
- ↑ Medieval Indian Literature: Surveys and selections (in ఇంగ్లీష్). Sahitya Akademi. p. 71. ISBN 9788126003655. Retrieved 27 March 2017.
- ↑ Modi, Sir Jivanji Jamshedji (1954). The influence of Iran on other countries (in ఇంగ్లీష్). K.R. Cama Oriental Institute. Retrieved 27 March 2017.
- ↑ Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland Volume 6 (in ఇంగ్లీష్). Cambridge University Press for the Royal Asiatic Society. 1841. p. 369. Retrieved 27 March 2017.
Hydraotes.
- ↑ Ahsan, Aitzaz (2005). The Indus Saga (in ఇంగ్లీష్). Roli Books Private Limited. ISBN 9789351940739.
- ↑ "Executive Summary of Environmental Impact Assessment Report Bajoli Holi H. E. Project (180 MW)Chamba, Himachal Pradesh" (PDF). R. S. Envirolink Technologies Pvt. Ltd. 2010. p. 18. Retrieved 1 September 2014.
- ↑ Jain, Sharad.K.; Pushpendra K. Agarwal; Vijay P. Singh (2007). Hydrology and Water Resources of India. Springer. pp. 481–484. ISBN 1-4020-5179-4. Retrieved 14 April 2010.
- ↑ Garg, p.98