చర్చ:అజితకేశ కంబళుడు
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
పూర్ణ కాశ్యపుడు బౌద్ద్దమత సన్యాసి కాదు. బుద్దుని సమకాలికుడైనప్పటికి, బౌద్ద గ్రంధాలలో పేర్కొనబడ్డ ప్రసిద్ధ తీర్ధంకరులలో ఒకడైనప్పటికి బౌద్ద మతానికి చెందినవాడు మాత్రం కాదు. బుద్దుని కాలంలోనే జీవించినటువంటి పూర్ణ కాశ్యపుడు బుద్దుని వలె ఒక అవైదిక తత్వవేత్త. ఒక విధంగా చెప్పాలంటే క్రీ.పూ.6 వ శతాబ్దంలో పుట్టిన ప్రసిద్ద తత్వవేత్తలలో బుద్దుని వలె ఇతనూ ఒకడు. అయితే బుద్దుడు మధ్యే మార్గంలో సమన్వయ ధోరణిలో అవైదిక బోదనలు చేస్తే (అంటే వేదాలను తిరస్కరించడం, యజ్న యాగాదులను నిరసించడం వంటివి), పూర్ణ కాశ్యపుడు లాంటి ఇతర అవైదిక తత్వవేత్తలు కాటిన్య ధోరణిలో అవైదిక బోదనలు చేసారు. ఆనాడు వేదప్రామాణ్యాన్ని తిరస్కరించడం అంటే మామూలు విషయం కాదు. పాలక వర్గాల నేపద్యం నుంచి వచ్చిన బుద్దుడు పాలక వర్గాలతో రాజీ పడటం వలన తోలి దశలో బౌద్ధం నిలదొక్కుకోగలిగింది. బానిస జీవితం లాంటి నేపద్యం నుండి వచ్చిన పూర్ణ కాశాపుడు లాంటి వారు తిరుగుబారుదారులై బ్రాహ్మణాధిక్యతపై ఆక్రోశంతో పాలక వర్గాలతో రాజీలేని దోరణిలో ఘర్షణ పడుతూ బోదనలు చేయడంతో నిలదోక్కుకోలేకపోయారు. బుద్దునికి పూర్ణ కాశాపునికి బోధనలలో కొద్ది సామీప్యాలున్నా అదే సమయంలో వైరుధ్యాలూ తీవ్రంగానూ వున్నాయి. అందుకే వీరిని బొద్ద, జైన మతాలు హేళన చేస్తూ వీరి బోధనలను వక్రీకరిస్తూ తమ తమ గ్రంధాలలో పేర్కొంటాయి. కాబట్టి పూర్ణ కాశ్యపుని బౌద్దమత సన్యాసి వర్గంలో చేర్చడం అహేతుకంగాను అసమంజసంగా ఉంటుందని భావించడం చేత బౌద్దమత సన్యాసులు వర్గం నుండి తొలగించి అవైదిక దర్శనకారులు భౌతికవాదులు భారతీయ తత్వవేత్తలు లోనికి చేర్చడమైనది. ఇదే రీతి అజితకేశ కంబళుడు వ్యాసానికి వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మార్పు చేయబడింది.
--Vmakumar (చర్చ) 22:54, 26 ఆగష్టు 2015 (UTC)
అజితకేశ కంబళుడు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అజితకేశ కంబళుడు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.