చర్చ:అమరావతి కథా సంగ్రహం 1-25

వ్యాస లక్ష్యం మార్చు

నూరు కథల గురంచి అమరావతి కథలు వ్యాసంలోనె వ్రాస్తే నిడివి పెరెగి పోయి కథా సంపుటి గురించిన వ్యాసం చదవటానికి ఇబ్బందికరంగా ఉంటుందని భావించి, కథాసంగ్రహానికి ప్రత్యేక పుట ఏర్పరచటం జరిగింది. ఈ పుటలో అన్ని కథలగురించి వ్రాయాలని ఉద్దేశ్యం.--SIVA 16:07, 6 నవంబర్ 2008 (UTC)

తెలియని పదాలు-వాడుకలు మార్చు

ఈ కథలు చదువుతుంటే, కొన్ని పదాలుగాని, వాడుకలుగాని గమనిస్తే వాటి అర్థం సరిగ్గ తెలియదు. అటువంటి పదాలు/వాడుకలు ఇక్కడ వ్రాసి ఉంచితే, తెలిసిన సభ్యులు వివరణ ఇవ్వటానికి అనువుగా ఉంటుంది--SIVA 05:24, 9 నవంబర్ 2008 (UTC):

  • దర్బీస్ మొకందానా-ఆరేసిన చీర కథలో-
  • మషాల్తీ - హరహరమహదేవ కథలో-
  • బిల్లబీటుగా - పచ్చగడ్డి భగ్గుమంది కథలో-
  • చంగనాలు- లేగదూడ చదువు కథలో- లేగదూడ వేసే గెంతులు. ఈ చంగనాలు ఆవు దూడలు మాత్రమే వేస్తాయి. గేదె దూడలు, మేక/గొర్రె పిల్లలు వెయ్యవు. ఆవు దూడలు వేసే ఈ చంగనాలు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఆవు దూడలు మొదటినెల వయస్సులో, మొదటిరోజులలోనే వేస్తాయి.
  • సిరిచుక్క - లేగదూడ చదువు కథలో- పశువుల నుదురుపై ఉండే పెద్ద రంగుమచ్చలాంటిది
  • చర్ పట్టి, కుందులు-ఆవతలొడ్డు పొంగింది కథలో పిల్లల ఆటల పేర్లు. ఈ ఆటలు ఎలా ఆడతారు, వాటి నియమాలు ఏమిటి-



చిన్నప్పుడు వాడిన మాటలు గుర్తు తెచ్చుకొని వ్రాస్తున్నాను - "చంగనాలు" అంటే లేగదూడ వేసే గెంతులు. "సిరిచుక్క" అంటే పశువుల నుదురుపై ఉండే పెద్ద రంగుమచ్చలాంటిది. "బిల్లబీటుగా" అనే పదం వాడేవాళ్ళం గాని ఏ అర్ధంలోనో గుర్తుకు రావడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:00, 22 నవంబర్ 2008 (UTC)


కథలకు ప్రత్యేక పుట మార్చు

చర్చ:అమరావతి కథలు నుండి ఇక్కడికి కాపీ చేయబడిన చర్చ

శివా! వ్యాసం పెద్దదవుతున్నది. మీరు ఇంకొంత వ్రాయాలనుకొంటే ఈ వ్యాసాన్ని విభజించడం మంచిదనుకొంటాను. ప్రధాన వ్యాసంలో కథల పట్టిక మాత్రం ఉంచవచ్చును. అమరావతి కథలు - టూకీగా అనే మరోవ్యాసం మొదలుపెట్టి అందులో కథల వివరాలు వ్రాయవచ్చును. మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:19, 3 నవంబర్ 2008 (UTC)

కాసుబాబు గారూ! అమరావతి కథలన్నీ కూడా టూకీగా వ్రాద్దామని ఉన్నది. కొంత సమయం పట్టవచ్చును. మనం గుడిపాటి వెంకటచలం గురించి వ్యాం వ్రాస్తున్నప్పుడు, కొంతమంది నటులగురించి వ్రాస్తున్నప్పుడు వారివారి చిత్రాల జాబితాలు ప్రత్యేకంగ ఉంచటం గురించి కొంత చర్చ జరిగింది. ఆ చర్చననుసరించి, కథలను టూకీగా వ్యాసంలోనే వ్రాస్తున్నాను. కాదు, ప్రత్యేక వ్యాసంగా పెడదామంటే, అలాగే. ఒక మంచి పేరు సూచించండి. ఏది ఏమయినా, అమరావతి కథలగురించి, ఆ కథలను చదవని వారికి సంపూర్ణ సమాచారం ఇవ్వటమే నా ఉద్దేశ్యం. ప్రస్తుతం నేను హైదరాబాదులో, బంధువుల ఇంటినుండి ఈ వాఖ్య వ్రాస్తున్నాను. 3-4 రోజులలో ముంబాయికి తిరిగి వెళ్ళి మిగిలిన కథలగురించి వ్రాస్తాను. దయచేసి మీ నిర్ణయం తెలియచేయగలరు.--SIVA 09:21, 4 నవంబర్ 2008 (UTC)
కాసుబాబుగారూ! మొదటినుండీ నా అభిప్రాయం ఒక రచయిత కథల గురించి గాని, ఒక నటుడి పాత్రల గురించి గాని, ప్రత్యేక పుట ఉంచటమే సరయిన పద్ధతి అని. కాని ఇంతకు ముందు (ఎస్వీ రంగారావు వ్యాసం గురించి అనుకుంటాను)జరిగిన వాదోపవాదాలలో, అదే పుటలో ఉంచటం భావ్యమని, వేరొక పుటలో కాదని, నొక్కి వక్కాణించటం జరిగింది. సరే! నలుగురితోబాటు అని, అదే వ్యాసంలో కథల గురించి వ్రాస్తుంటే, పత్యేక పుట అని సూచించారు. ఏది ఏమయినా, ఇటువంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు, ఏదో ఒక పంధాను అనుసరించి, ఆ పంధాను ఒక నియమంగా చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను. అలాగయితే, ఒక కోవకు చెందిన వ్యాసాలన్నీ ఒక పద్ధతిలో వస్తాయి.--SIVA 00:50, 7 నవంబర్ 2008 (UTC)
కథలను అమరావతి కథా సంగ్రహం అన్న కొత్త పుట ఏర్పరిచి అక్కడకు మార్చాను. ఇక్కడ, కథల జాబితా మాత్రం ఉంచాను. కథల జాబితా కూడా, ఒక టేబుల్ ఫార్మాట్ లో నాలుగు వరుసలుగా (4 columns, 25 rows)గా మారిస్తే చూడటానికి, రెఫరెన్సుకు బాగుంటుందని నా అభిప్రాయం. టేబుల్ ఫార్మాట్ నాకు సరిగా చేతగాదు, ఎవరయినా సహాయం చేయగలరు.--SIVA 01:00, 7 నవంబర్ 2008 (UTC)
వ్యాసం పెద్దదయిన కొద్దీ వ్యాసాన్ని విభజించాల్సిన అవుసరం పెరుగుతుంది. ఇందులో విధానం కంటే సౌకర్యమే ముఖ్యం అనుకొంటాను. (నా అభిప్రాయమే ఇది). అమరావతి కథలు పేర్లు మాత్రమే ఉన్నా లేక ఒకో కథకు ఒక వాక్యం మాత్రం వ్రాసినా వాటికి వేరే వ్యాసం అవుసరం లేదు. ఒకో కథ గురించి ఒకటి రెండు పేరాలు వ్రాస్తే మరొక పేజీ అవుసరమౌతుంది. ఇదంతా ఆ రచయిత ఆ వ్యాసాన్ని ఎంత విస్తరించడానికి ఆలోచిస్తున్నారో అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. ఉప పేజీల ఆలోచన మాత్రం నాకు సముచితం అనిపించడంలేదు. అవి ప్రాజెక్టు పేజీలకు, ఆర్చీవులకు పనికొస్తాయి. వ్యాసాలకు సబబుగా ఉండవు. అందుకు బదులు అమరావతి కథలు గురించి - 1-20, అమరావతి కథలు గురించి - 21-30 అలా విడి వ్యాసాలు వ్రాయవచ్చును. ప్రస్తుతానికి అమరావతి కథా సంగ్రహంలో కధల వివరాలు వ్రాయవచ్చును. అవి పెరిగిన కొద్దీ ఇంకా విభజించవచ్చును. ప్రయోగాత్మకంగా నేను ఫార్మాట్‌లో కొంత మార్చాను. పరిశీలించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:06, 9 నవంబర్ 2008 (UTC)
విధానమెప్పుడూ కూడ సౌకర్యం లేదా సౌలభ్యంకోసమే అని నేను నమ్ముతాను. ఈ రెంటినీ దృష్టిలో పెట్టుకోనిది విధానమే అవదు. ఇటువంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు,ఆ నటుడు కాని, రచయిత కాని నటించిన లేదా సృష్టించిన కథల జాబితాలను ప్రత్యేక పుటలో ఉంచితే ప్రధాన వ్యాసం చదవటానికి సౌకర్యంగా ఉంటుంది, ఆయా రచయిత/నటుడి గురించి మరింతగా తెలుకోవాలన్న అభిరుచి చదువరి ఆయా జాబితాల లింక్ పట్టుకుని ప్రత్యేక పుటకు వెళ్ళి చదువుకుంటాడు. ఆ కథ లేదా పాత్ర గురించి వ్రాద్దమనుకునె సభ్యులకు వీలుగా ఉంటుంది. అలా అని, ప్రతి సినిమా పాత్ర గురించి, ప్రతి కథ/నవల గురించి ఒక్కొక్క ప్రత్యేక పుటలో వ్యాసం వ్రాసి తీరాలని నా ఉద్దేశ్యం కాదు. అమరావతి కథలు ఒక కథాసంపుటి అవ్వటం మూలాన, ఒక్కొక్క కథగురించి స్థూలంగా వ్రాసి రచయిత చెప్పదలుచుకున్న మంచి విషయాలను వ్యాసంలో భాగంగా చేరిస్తే బాగుంటుందని నా అభిలాష. ఈ పనిలో మీరు చేసిన ఫార్మాట్ మార్పు చాలా బాగున్నది. ఈ మార్పు చేసిన ఫార్మాట్ లో వ్రాస్తూ ఉంటాను. వంద కథల గురించి వ్రాయటానికి కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి మీరన్నట్టుగా వ్యాసం పెరిగినప్పుడు విభజించుకొనవచ్చున. ఆ విభజనకు ఎటువంటి సాంకేతిక అవకాశమున్నదో నాకు తెలియదు. నాకు తెలిసిన ఉపపుటవిధానాన్ని సూచించాను. విభజన అవసరమైనప్పుడు మీ సహాయం అవసరం అవుతుంది. మంచి సూచనలిచ్చి మార్గదర్శనం చేసినందుకు ధన్యవాదములు కాసుబాబుగారు.--SIVA 18:38, 9 నవంబర్ 2008 (UTC)

వ్యాసం మళ్ళీ విభజిద్దామా? మార్చు

శివా? మీరు ఇంత దీక్షగా ఒకో కధ గురించీ వ్రాస్తారనుకోలేదు. ఇప్పటి వరకు ఉన్న నిడివిని బట్టి నాలుగు వ్యాసాలుగా చేస్తే సరిపోతుందనుకొటున్నాను.

ఏమంటారు? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:15, 22 నవంబర్ 2008 (UTC)

  • తప్పకుండా కాసుబాబుగారూ. కాక పోతే, ఒక్కొక్క విభాగంనుండి మిగిలిన విభాగాలకు లింక్ లు పెడితే బాగుంటుంది. మరొక అలోచన, అమరావతి కథలు వ్యాసంలోనే ఈ లింక్ లు ఉంచితే, ప్రత్యేక వ్యాసంగా కాకుండా, అమరావతి కథలు వ్యాసం సంపుర్ణంగా ఒకచోటే ఉండటానికి అవకాశం ఉన్నది. కథలగురించి తెలుసుకోవాలనుకున్న సభ్యులు ఆయా లింకుల ద్వారా వెళ్ళి తెలుసుకోవచ్చు, సంపుటిగురించిన సమాచారం ప్రధాన వ్యాసంలో ఉంటుంది.--SIVA 05:22, 23 నవంబర్ 2008 (UTC)
Return to "అమరావతి కథా సంగ్రహం 1-25" page.