చర్చ:ఆంధ్రప్రదేశ్ చరిత్ర

తాజా వ్యాఖ్య: పూర్తి వ్యాసము టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Kumarrao
ఆంధ్రప్రదేశ్ చరిత్ర వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 51 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


సమగ్ర వ్యాసం ప్రణాళిక

మార్చు

తెలుగు విశ్వవిద్యాలయము వారు ప్రచురించిన 'విజ్ఞాన సర్వస్వము' మొదటి సంపుటము ఆధారముగ ఈ వ్యాసమును విస్తారముగా తిరిగి వ్రాయుటకు సంకల్పించాను. చదువరి, కిరణ్, శాస్త్రి మున్నగువారు వ్రాసిన విషయాలను తగుచోట్ల మార్పుచేస్తాను. అర్ధము చేసుకోగలరు.Kumarrao 16:32, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply

కుమారరావు గారూ! మీరు చాలా మంచి పనికి పూనుకొన్నారు. ఇది చాలా పెద్ద పని గనుక అందరూ వెనుకాడుతున్నారు అనుకొంటాను. దీనిని సమగ్రమైన వ్యాస వేదికగా తీర్చి దిద్దుదాము. ఈ వ్యాసం వ్రాయడంలో నేను కూడా మీతో పాల్గొంటాను. నా దగ్గర కూడా కొన్ని రిఫరెన్సు పుస్తకాలున్నాయి. ఇతర సభ్యుల సహాయాన్ని కూడా కోరుదాము. మీరు ఏర్పరచిన విషయ సూచిక బాగానే ఉంది. దీనిని రివ్యూ చేయడానికి నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి. కొన్ని సూచనలు క్రింద వ్రాస్తున్నాను--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:20, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply

వ్యాసం విభజన, ప్రధాన వ్యాసాలు

మార్చు

ఈ ప్రణాళికపై అందరి వ్యాఖ్యలను, సూచనలను కోరుతున్నాను. మీ సూచనలను నేరుగా క్రింది ఐటమ్‌లలో వ్రాసేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:21, 16 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఈ పనిని వికీపీడియా:WikiProject/భారతదేశ చరిత్రలో భాగంగా నిర్వహించవచ్చును.

{{main|మౌర్యులు}}{{main|మౌర్యులు - ఆంధ్ర ప్రదేశ్}} అన్న రెండు లైనులు ఉండాలి. అవి ఇలా కనిపిస్తాయి.

  • ఇప్పటికే చెదురు మదురుగా చరిత్రపై అనేక వ్యాసాలున్నాయి. ఆ వ్యాసాలను శాస్త్రీయంగా వర్గీకరించి ఈ వ్యాసాలతో అనుసంధించాలి.
  • ప్రతి వ్యాసంలోను ఆయా యుగానికి సంబంధించిన సాహిత్యం, సంస్కృతుల వ్యాసాలకు దారులు ఉండవచ్చును. ఉదాహరణకు కాకతీయులు వ్యాసంలో కాకతీయులు - సాహిత్యం, కాకతీయులు - సంస్కృతి, కాకతీయులు - ఆర్ధిక స్థితి ...ఇలా. ఇవన్నీ ప్రస్తుతానికి ఎరుపు రంగు లింకులుగానే ఉండవచ్చును. తరువాత ఉత్సాహం ఉన్నవారు ఆయా విషయాలపై వ్యాసాలు సృష్టించవచ్చును.
  • ప్రతి వ్యాసంలోనూ "ఆ యుగం నేపధ్యం, ఆయుగంలో తక్కిన భారత దేశం, ఆ యుగం ప్రభావాలు, ఆ యుగం క్షీణత" అనే మూడు శీర్షికలుండాలి.
  • అన్ని వ్యాసాల చర్చాపేజీలలో {{వికిప్రాజెక్టు భారతదేశం|చరిత్ర=అవును|ఆంధ్రప్రదేశ్=అవును}} అన్న మూసను ఉంచాలి

వ్యాసం ప్రగతి

మార్చు

కాసుబాబు గారు,

మీ మెసేజి చూసి చాలా సంతోషించాను. కలిసి చేసిన పని త్వరగాను మేలుగాను పూర్తవుతుంది. ఈ వ్యాసము చక్కగా పూర్తిచేయడానికి శాయశక్తులా కృషి చేద్దాం.Kumarrao 15:18, 17 ఏప్రిల్ 2008 (UTC)Reply

కుమారరావు గారూ! వ్యాసం కొనసాగించండి. పూర్వ మధ్య యుగం, ఉత్తర మధ్య యగం గురించి మీరు ఇదివరకే అధికంగా అధ్యయనం చేశారనుకొంటున్నాను. అది ఓకే అయితే ఆ యుగాల భాగాలు మీరు వ్రాయడం మొదలు పెట్టండి. పూర్వ యుగం నేను వ్రాయడం మొదలు పెడతాను. ఎలా చూసినా ఈ వ్యాసం బాగా పెద్దదయ్యేలా ఉంది. కనుక సంక్షిప్తంగా వ్రాయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. విపులంగా సంబంధిత ప్రధాన వ్యాసాలలో వ్రాద్దాము. ఇతర సభ్యులను ఖూడా ఈ వ్యాసం ప్రగతిలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:37, 19 ఏప్రిల్ 2008 (UTC)Reply
మీ వేగాన్ని నేను అందుకోలేనని అనిపిస్తున్నది. Kumarrao 16:05, 20 ఏప్రిల్ 2008 (UTC)Reply
రిఫరెన్సులు చేర్చేటప్పుడు పుస్తకాలైతే ప్రచురించిన సంస్థ మరియు ప్రదేశం పేరు ఇవ్వడం మర్చిపోకండి.δευ దేవా 17:18, 21 ఏప్రిల్ 2008 (UTC)Reply

వ్యాసం విభజన

మార్చు

ఎంత కుదించినా వ్యాసం బాగా పెద్దదే అవుతున్నది. ఇంకా కుదిస్తే వ్యాసం చదవడానికి ఉపయోగకరంగా ఉండదనిపిస్తుంది. కనుక ఈ వ్యాసాన్ని క్రింది భాగాలుగా విభజిద్దామా?

  1. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ఇప్పుడున్న వ్యాసం. ఇందులో యుగ విభజన, ఇతర ప్రధాన వ్యాసాల లింకులు, మూసలు మాత్రం ఉంటాయి (వేదిక లాగా)
  2. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - పూర్వ యుగము క్రీ.పూ. నుండి క్రీ.శ. 650 వరకు (పల్లవుల దాకా)
  3. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - మధ్య యుగము 650 నుండి 1565 తళ్ళికోట యుద్ధం వరకు (చాళుక్యుల నుండి విజయనగర రాజుల వరకు) - పూర్వ మధ్యయుగం, ఉత్తర మధ్యయుగం కలిపి.
  4. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ఆధునిక యుగము - 1540 అరవీటి వంశం నుండి 1956 ఆంధ్ర ప్రదేశ్ అవతరణ వరకు
  5. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - 1956 తరువాత - 1956 తరువాత
  6. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ - ఇప్పుడున్నట్లే

ఇలా చేస్తే వ్యాసాల నిర్వహణ మరింత సులభంగా ఉంటుందనుకొంటున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:08, 28 ఏప్రిల్ 2008 (UTC)Reply

మీ ఆలోచన బాగానేఉంది. అలాగే కొనసాగిద్దాం.Kumarrao 16:42, 28 ఏప్రిల్ 2008 (UTC)Reply

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సమిష్టి కృషికి ఆహ్వానం

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో వివిధ ప్రధాన వ్యాసాలను సమిష్టి కృషిగా వృద్ధిచేయడంలో పాల్గొనమని సభ్యులను అందరినీ కోరుతున్నాను. అయితే ఇది చాలా కాలం పట్టే పెద్ద పని కనుక ఈ వారం సమైక్య కృషిగా ఉంచడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:44, 4 మే 2008 (UTC)Reply

రేనాటి చోళులు చూడండి.Kumarrao 17:14, 2 జూలై 2008 (UTC)Reply

తెలుగులు

మార్చు

తెలుగు, తెలుంగు, తెనుగు లతో "తెన్ కళింగులు" అనే పదము ఏవిధముగాను దగ్గరకాదు. వీరభద్ర రావు గారు ఏ అధారముతో వీటిని సమానాంతరము చేశారో తెలియదు. "తెన్" అనగా దక్షిణము. కాని ఆంధ్రులు, కళింగులు వేర్వేరు జాతులు. ఈ పదము తొలగించాను. Kumarrao 10:49, 11 జూలై 2008 (UTC)Reply

పూర్తి వ్యాసము

మార్చు

వ్యాసము అసమగ్రముగానున్నది. తెలుగు చరిత్ర శ్రద్ధాపరులు, చదువరులు కొంత సమయము వెచ్చించి పూర్తి చేయగలరు.Kumarrao 07:48, 18 జనవరి 2009 (UTC)Reply

గమనిక

మార్చు

నేడు కొద్ది మంది అంటున్నట్టుగా కాకతీయులతర్వాత నేటి ఆంధ్రప్రదేశ్ మొత్తం 1956 దాకా కలిసి లేదనుట అసత్యం... కుతుబ్ షాహీ ల కాలంలోనూ, తర్వాత వచ్చిన మొఘలుల ప్రతినిధులైన నిజామ్ ల కాలంలో కూడా కలిసే ఉంది... 1768 లొ ఉత్తర కోస్తాను, 1788 లో గుంటూరును తర్వాత 1800 లో రాయలసీమ,1802 లో నెల్లూరు, చిత్తూరు ల ను విడదీసినట్టుగా చరిత్ర చెప్తోంది...ఇది అందరూ గుర్తుంచుకోవాలి. దొంగలు దొంగలు కల్సి ఊళ్లు పంచుకున్నట్టుగా ఆనాడు నిజాంలు, బ్రిటీషువారు మనల్ని విడదీసారు.......2011-03-05T08:55:02‎ 117.195.235.188

Return to "ఆంధ్రప్రదేశ్ చరిత్ర" page.