చర్చ:ఆమిర్ ఖాన్
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
- రవిచంద్రగారూ, ఇతని పేరు అమీర్ ఖాన్ కాదు, "ఆమిర్ ఖాన్", అనుకుంటా, కొద్దిగా చూడగలరా! అహ్మద్ నిసార్ 11:05, 15 మే 2009 (UTC)
ఆంగ్లంలో స్పెల్లింగ్ ఎలా ఉన్నా, నాకు తెలిసినంతవరకు తెలుగు ఉచ్ఛారణ అమీర్ ఖాన్ అన్నదే సరైనదనుకుంటా. అదీ కాకుండా దాదాపు బాలీవుడ్ నటులంతా సంఖ్యా శాస్త్రాన్ని అనుసరించి తమ పేర్లకు స్పెల్లింగ్ మార్చుకుంటుంటారు. తెలుగు మాధ్యమాల్లో కూడా ఇలాగే ప్రచారంలో ఉంది కాబట్టి ఇదే పేరుతో ఉండటం సముచితమని భావిస్తున్నాను. — రవిచంద్ర(చర్చ) 11:20, 15 మే 2009 (UTC)
- ఉర్దూలో రెండు పదాలూ వున్నాయి, అమీర్=ధనికుడు, ఆమిర్=స్థాపకుడు. ఇతడి పేరు ఆమిర్ ఖాన్. ఇలాంటి పేర్లకు ఇతర ఉదాహరణలు; ఇండియన్ టెలివిజన్ నటుడు, ఆమిర్ అలి, 2008లో నిర్మించిన హిందీ చిత్రం ఆమిర్, ఇంగ్లాండుకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆమిర్ గఫార్, మొదలగునవి. ఇవికీలో ఇతడి పేరుగల వ్యాసం చూడండి, అందులో ఆంగ్లం, హిందీ, ఉర్దూ, మూడు భాషలలోనూ "ఆమిర్" అనే వున్నది. అహ్మద్ నిసార్ 11:32, 15 మే 2009 (UTC)
- ఆమిర్ ఖాన్ పేరుతో వ్యాసాన్ని మార్చడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అందరూ ( నాకు తెలిసిన ఉత్తరాది స్నేహితులు , ఆంగ్ల వార్తా చానళ్ళు కూడా ) అమీర్ ఖాన్ అనే పిలుస్తారు. అందుకనే అలా భావించాను. — రవిచంద్ర(చర్చ) 11:39, 15 మే 2009 (UTC)