చర్చ:ఏడు చేపల కథ
కథల పుస్తకాల గురించి విశ్లేషణ చేయవచ్చు కాని కథలు, కథనాలు కూడా తెవికీలో వ్రాయవచ్చా? ఇంకనూ అభివృద్ధి దశలోనే ఉన్న తెవికీలోఈ అవకాశం ఉంటే దిద్దుబాట్లు పెంచుకోవాలనే సభ్యులు ఒక్క కథల పుస్తకం సహాయంతో వేలాది దిద్దుబాట్లు సునాయాసంగా చేయవచ్చు, చేస్తారు కూడా. కథలు విజ్ఞానానికి సంబంధించినవి కావు కాబట్టి ఇప్పుడే ఈ అవకాశం ఉండరాదు, అసలు లేదు కూడా. కొత్త సభ్యులకు నియమాలు చెప్పాల్సిన నిర్వాహకులే ఈ మార్గం అనుసరిస్తే తెవికీలో విజ్ఞానదాయక విషయాలపై వ్యాసాలను వ్రాసేవారు ఎవరూ మిగలకపోవచ్చు. 106.66.47.57 17:14, 14 ఫిబ్రవరి 2013 (UTC)
- వ్యాసం పేరు కూడా తప్పే (ఏదు కాదు ఏడు అని ఉండాలి) తొలిగించే దానికి తరలింపు ఎందుకలే అని మార్చలేను. 106.66.47.57 17:21, 14 ఫిబ్రవరి 2013 (UTC)
అభివృద్ధికి నిరోధకారి
మార్చుఈ వ్యాసం ఒక కథ. ప్రతి కథను వ్యాసంగా వ్రాయవచ్చా? యిలా ప్రతి పుస్తకంలో అనేక కథలు ఉంటాయి అన్నింటిని వ్యాసాలుగా పరిగణించవచ్చా? ఇది విజ్ఞానాన్ని పెంచుకొనుటకు దోహదపడుతుందా. ఈ కథ చదివిన విధ్యార్థి తను చేయవలసిన పనిని తప్పించుకోవటానికి ఇతరులపై కారణాలను నెట్టడం అలవాటు చేసుకుంటాడు. ఈ కథను ఏ వ్యక్తి అయినా జీవితానికి అన్వయించుకుంటె ప్రపంచంలో అభివృద్ధి ఉండదు. ఈ కథ నీతిని ప్రభోధించే కథ కూడా కాదు. ఒక 5 వ తరగతి బోధించు ఉపాధ్యాయునికి అయ్యా ఈ విధ్యార్థికి ఎందుకు లెక్కలు రావటం లేదంటే తన తప్పును దిగువ తరగతి ఉపాధ్యాయునిపై ప్రతిక్షేపిస్తాడు. అతనికి విధ్యార్థిని అభివృద్ధి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ చేయడు. అలానె ప్రతి వ్యక్తి కూడా..... ఇటువంటి కథలను తెవికీ లో ప్రచురించి తెవికీ నాణ్యతను పోగొట్టవద్దని మనవి.( కె.వి.రమణ- చర్చ 17:43, 14 ఫిబ్రవరి 2013 (UTC))
- మంచి నీతిని బోధించే నీతి కథలు చాలా తరాల నుండి తెలుగు తల్లులు పిల్లను వినిపిస్తున్నారు. అందులో ఏడు చేపల కథ, నాన్నా పులి మొదలైనవి చాలా ఉన్నాయి. వీటిని వికీపీడియాలో తప్పకుండా రాయవచ్చును. అవి నీతికి కాకుండా ఏవైనా విమర్శలకు కూడా సాత్వికంగా చర్చించి వేరొక విభాగంలో ఉంచవచ్చును. ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు.Rajasekhar1961 (చర్చ) 06:24, 15 ఫిబ్రవరి 2013 (UTC)
- తొలగింపు మూస ఉంచాలా లేక తీసివేయాలా ? సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:47, 24 మార్చి 2013 (UTC)
- ఈ కథకు సరియైన నీతిని చేర్చగలిగితే ఉంచండిః కె. వి. రమణ . చర్చ 13:04, 24 మార్చి 2013 (UTC)
- మంచి నీతిని బోధించే నీతి కథలు చాలా తరాల నుండి తెలుగు తల్లులు పిల్లను వినిపిస్తున్నారు. అందులో ఏడు చేపల కథ, నాన్నా పులి మొదలైనవి చాలా ఉన్నాయి. వీటిని వికీపీడియాలో తప్పకుండా రాయవచ్చును. అవి నీతికి కాకుండా ఏవైనా విమర్శలకు కూడా సాత్వికంగా చర్చించి వేరొక విభాగంలో ఉంచవచ్చును. ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు.Rajasekhar1961 (చర్చ) 06:24, 15 ఫిబ్రవరి 2013 (UTC)
పునః స్థాపన
మార్చుఈ వ్యాసం ఒక కథ గురించి అయినప్పటికీ, దానిలో తాత్విక చింతన ఉన్నందున, అందరికీ అవసరమైనది, విజ్ఞానదాయకమైనది అయినందున దీనిని పునః స్థాపన చేయడం జరిగినది. 2005 లో గరికపాటి నరసింహారావు గారు అమెరికాలో శ్రీమద్రామాయణంలోని థర్మసూక్ష్మాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలో "అనగనగా ఒక రాజు" కథలోని తాత్త్విక కోణాన్ని తెలియజేసారు. దాని ఆడియో లింకును మూలంగా చేర్చడమైనది.-- కె.వెంకటరమణ⇒చర్చ 13:16, 7 జూన్ 2016 (UTC)