చర్చ:ఒక యోధుడు

తాజా వ్యాఖ్య: "ఆర్టికల్‌ 370 రద్దు" టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985

ఈ వ్యాస విషయానికి విషయ ప్రాముఖ్యత లేదు. దాన్ని నిరూపించేలా మూలాలను ఇవ్వాలి. ఒక వారం లోగా నిరూపించకుంటే వ్యాసాన్ని తొలగించాలి. ఇది నిరూపణ అయితే అప్పుడు.. వ్యాసపు శైలిని వికీ అనుగుణంగా సవరించాలి (ఈ అంశం తొలగింపుకు ప్రతిపాదనకు కారణం కాదు)-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:44, 12 జనవరి 2021 (UTC)Reply

నమస్కారములు ,నేను వేరు వేరు న్యూస్ పేపర్స్ లో వచ్చిన న్యూస్ సేకరించి ఆర్టికల్ రాసాను . నేను ఈ లింక్స్ ని త్వరలో ఇవ్వగలను .కొన్ని Telugu Cinema పత్రికలలో లింక్స్ ఇంటర్ నెట్ లో దొరకటం లేదు . .నేను సినిమా అభిమానిని .ఇప్పటికే కొన్ని సినిమా ఆర్టికల్స్ పూర్తి వివరణ సేకరించి రాసాను .

వికీలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు వాడుకరి:అరుణ గారు. వికీలో కొన్ని నియమాలు ఉన్నాయి. వికీ వ్యాసాలకు విషయ ప్రాముఖ్యత ఉండాలి. మీరు ఖాళీ విభాగాలు పెట్టి అందులో సమాచారం రాయకుండా వదిలేస్తున్నారు. అలా చేయకూడదు. సమాచారం ఉంటేనే విభాగాలు చేర్చాలి. వ్యాస శైలీ కూడా వికీ పద్దతిలో లేదు. మీరు ఏ అంశానికి సంబంధించిన వ్యాసాన్ని రాయాలనుకుంటున్నారో, ఆయా అంశంలోని వ్యాసాలను పరిశీలించండి. (సినిమా గురించి వ్యాసం రాయాలనుకుంటే వికీలో ఉన్న సినిమా వ్యాసాలను పరిశీలించాలి).-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:26, 12 జనవరి 2021 (UTC)Reply

Pranayraj1985 గారు ,మీరు చెప్పిన సలహాలు తప్పక పాటిస్తాను .నేను విభాగాలు పెట్టి అందులో రచన చెయ్యాలి అనుకున్నాను .కానీ సమయం దొరక్క పోవడము వలన రాయలేక పోయాను .నేను ఇప్పుడు కొత్త మూలాలు చేరుస్తున్నాను . నేను మూలలను , తెలుగు సినిమా పత్రికలు అనగా , ఆంధ్ర జ్యోతి ,saakshi ,Filmybuzz లో వచ్చిన న్యూస్ మాత్రమే ఈ వ్యాసము లో రాసాను .ఈ క్రింది లింక్స్ పరిశీలించండి .

        Andhra Jythi News paper
        https://epaper.andhrajyothy.com/c/57599563
        ("దుష్ట శిక్షణ ఇతి వృత్తముగా" అనే హెడ్డింగ్ తో వున్నది ) 
        Filmybuzz
        http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html
        Sakshi News paper
        https://epaper.sakshi.com/c/57073254
        ఇంకా కొన్ని లింక్స్ త్వరలో ఇవ్వగలను .


అరుణ

అరుణ గారు, మీ చర్చాపేజీలో కొన్ని వివరాలు రాశాను, పరిశీలించండి. ___ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 18:44, 12 జనవరి 2021 (UTC)Reply

అరుణ గారూ, ఒక వ్యాసం ప్రారంభించి దాన్ని పూర్తిచేసిన తరువాతనే వేరే వ్యాసం ప్రారంభించండి. పూర్తిచేయని, వికీ శైలిలో లేని వ్యాసాలు తొలగించబడుతాయి. మరో ముఖ్య విషయం, వికీలో విషయ ప్రాముఖ్యత అనేది చాలా అవసరం. విషయ ప్రాముఖ్యత లేని వ్యాసాలు కూడా తొలగించబడుతాయి. ముందుగా ఒకపని చేయండి, వికీలో మీకు నచ్చిన ఒక సినిమా వ్యాసాన్ని ఆధారం చేసుకుని ఈ ఒక యోధుడు వ్యాసాన్ని వికీ శైలీకి అనుగుణంగా రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు వ్యాస శైలీ అలవాటు అవుతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:35, 12 జనవరి 2021 (UTC)Reply

Pranayraj1985 గారు ,మీరు చెప్పే సూచనలు తో ముందుకు సాగుతాను .ఖచ్చితముగా మీరు ఛెప్పినట్లు గా ఈ ఒక యోధుడు సినిమా అభివృద్ధి చేస్తాను .నేను రాసిన మిడిల్ క్లాస్ మెలోడీస్, సీత (2019 సినిమా) ‎ ,కాంచన 3 (2019సినిమా) ‎,‎ గీత గోవిందం (సినిమా) ‎ ,ఇంకా చాల సినిమా వ్యాసాలూ మీరు చెప్పిన విధము గా అభివృద్ధి చేస్తాను . .ఇంత మంచి గా , నన్ను ప్రోత్స హిస్తున్నందుకు ధన్యురాలను అరుణ

అరుణ గారూ, మీరు ఈ వ్యాసంలోని సమాచారాన్ని ఈ సైట్ నుండి యధాతదంగా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేశారు. అలా చేయడం, కాపీ రైట్స్ కి విరుద్ధం. సమాచారాన్ని వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మనదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మన స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 20:03, 12 జనవరి 2021 (UTC)Reply

Pranayraj1985 గారు ,మీరు చెప్పినట్లుగా వ్యాసపు శైలి వికీ కి అనుగుణం గా మార్పు చేసాను .ఒక వికీ వ్యాసాన్ని ఫాలో అయ్యాను .ఇంత చక్కగా నాకు వివరించి నందుకు ధన్య వాదాలు . అరుణ

Pranayraj1985 గారు ఇంకా ఎమన్నా మార్పులు చెయ్యాలి అంటే చెప్పండి .నేను ఇంకా కృషి చేస్తాను . మీరు చెప్పిన సూచనలు చాల బాగున్నాయి.ఫోటో క్రింద టేబుల్ సమాచారం ఎలా క్రీయేట్ చెయ్యాలో వివరణ ఇమ్మని కోరుచున్నాను .చక్కగా నాకు వివరించి నందుకు ధన్య వాదాలు. (అరుణ (చర్చ) 13:02, 13 జనవరి 2021 (UTC))Reply

Contested deletion మార్చు

నేను ఈ ఆర్టికల్ లో విషయం ప్రాముఖ్యత నిరూపించే లా కొన్ని కొత్త మూలాలు జత చేసాను ,వ్యాసపు శైలి వికీ కి అనుగుణము గా సవరించాను .వ్యాసము సమాచారాన్ని,మూలాల ఆధారము గా తయారు చేసాను. ఆంధ్ర జ్యోతి ,సాక్షి మరియు ఇతర సినిమా పత్రికల లో వచ్చిన న్యూస్ ఆధారము గా ఈ ఆర్టికల్ తయారు చేసాను. .నేను రాసిన మిడిల్ క్లాస్ మెలోడీస్, సీత (2019 సినిమా) ‎ ,కాంచన 3 (2019సినిమా) ‎,‎ గీత గోవిందం (సినిమా) ‎ ,ఇంకా చాల సినిమా వ్యాసాలూ మీరు చెప్పిన విధము గా అభివృద్ధి చేస్తాను .
నేను సినిమా ఆర్టికల్ నే కాకుండా ఈ క్రింది ఆర్టికల్స్ కూడా రాసాను 
"ఆర్టికల్‌ 370 రద్దు" మొదట "Contested deletion" కి గురి అయ్యింది .కానీ తరువాత ఈ ఆర్టికల్ కి నేను మూలాలు జత చేసాను . ఈ ఆర్టికల్ పూర్తి గా అభి వృద్ధి పరిచిన ఆర్టికల్ అయ్యింది
"అభివృద్ధి చెందిన దేశాల జాబితా" ‎
 ఒక యోధుడు ఆర్టికల్ అభివృద్ధి పరచడము లో సహాయ పడినందుకు కృతఙ్ఞతలు 

(అరుణ (చర్చ) 19:35, 14 జనవరి 2021 (UTC))Reply

కొత్త మూలాలు మార్చు

నేను ఈ ఆర్టికల్ లో విషయం ప్రాముఖ్యత నిరూపించే లా కొన్ని కొత్త మూలాలు జత చేసాను. వ్యాసము సమాచారాన్ని,మూలాల ఆధారము గా తయారు చేసాను. ఆంధ్ర జ్యోతి ,సాక్షి మరియు ఇతర సినిమా పత్రికల లో వచ్చిన న్యూస్ ఆధారము గా ఈ ఆర్టికల్ తయారు చేసాను.ఒక యోధుడు సినిమా ట్రైలర్ లో చాల సమాచారం వుంది.

నేను రాసిన సీత (2019 సినిమా) ‎ ,కాంచన 3 (2019సినిమా) ‎,‎ గీత గోవిందం (సినిమా) ‎ ,మిడిల్ క్లాస్ మెలోడీస్ఇంకా చాల సినిమా వ్యాసాలూ మీరు చెప్పిన విధము గా అభివృద్ధి చేస్తాను .

 https://www.youtube.com/watch?v=8z0W9pgLJ_k
 https://www.youtube.com/watch?v=ChaekZehXBk
 https://www.youtube.com/watch?v=pV_W8ZgFtQU
 కృతఙ్ఞతలు 

అరుణ

అరుణ గారూ... వ్యాసానికి యూట్యూబ్ లింకులను వాటితోపాటు ఆంధ్రజ్యోతి, సాక్షి ఈపేపర్ లింకులు కింద విభాగంలో ఇచ్చారు. వాటిని మూలాలుగా పరిగణించలేము. మీరు రాసిన విషయం లేదా సమాచారానికి సంబంధించిన మూలాల్ని కింద విభాగంలో కాకుండా, ఆయా సమాచారం స్థానంలోనే జతపరచవలసివుంటుంది. గమనించగలరు. పైగా ఒక యోధుడు సినిమాకి సంబంధించి అంతర్జాలంలో ఎక్కడా కూడా సమాచారం లభించడంలేదు. ఇది అంత ముఖ్యమైన వ్యాసం కాదోమో కూడా గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:37, 1 మే 2022 (UTC)Reply

Pranayraj1985 గారు మీరు చెప్పినది అర్ధం అయ్యింది . నేను న్యూస్ పేపర్ లో చదివినడాన్ని బట్టి "ఒక యోధుడు " సినిమా 2022 డిసెంబర్ లో రిలీజ్ అవుతోంది . ఇంకా సమయం ఉండటం వలన ఈ సినిమా కి సంబంధించిన వార్త లు మీడియా లోనికి రావడానికి టైం పట్ట వచ్చు . నేను కొంచెం క్షుణ్ణం గా పరిశీలించి కొద్దీ రోజుల్లో అదనపు లింక్ లు జత చేస్తాను . ధన్య వాదాలు .

అరుణ


కొత్త మూలాలు మార్చు

https://epaper.sakshi.com/3480330/Visakhapatnam-City/20-05-2022#page/10/2
https://epaper.eenadu.net/Home/Index?date=20/05/2022&eid=457&pid=1791223
https://www.publicvibe.com/video/visakhapatnam-south/vishaakha-sout-oka-yodhudu-sinima-sarvahakkulu-maave/165294851334814233


"ఆర్టికల్‌ 370 రద్దు" మార్చు

"ఆర్టికల్‌ 370 రద్దు" మొదట "Contested deletion" కి గురి అయ్యింది .కానీ తరువాత ఈ ఆర్టికల్ కి నేను మూలాలు జత చేసాను . ఈ ఆర్టికల్ పూర్తి గా అభి వృద్ధి పరిచిన ఆర్టికల్ అయ్యింది


అరుణ

Pranayraj1985 గారు , నమస్తే . ఈ దినము TV 9 లో ఈ "ఒక యోధుడు" సినిమా గురించి న్యూస్ చూసాను .

ఈ సినిమా ఇంగ్లీష్ ,తెలుగు ,తమిళ్ , కన్నడ భాషల్లో  ( పాన్ ఇండియా సినిమా ) ఒకే సారి విడుదల చేస్తున్నట్టు చిత్ర దర్శకుడు ,హీరో డాక్టర్  శ్రీహరి మీడియా సమావేశము లో తెలియ పరిచారు . తన తల్లి ప్రాణాలు కాపాడ్డం కోసం  కొన్ని వేల మంది సైనికులు ,యుద్ధ విమానాలతో ఒక దేశము మీదకి యుద్ధానికి వెళ్లడం కధాంశము అని వెల్లడించారు .రేవతి ,ధార్య కిష ,వసుది ప్రధాన పాత్రల లో నటించినట్లు చిత్ర దర్శకుడు ,హీరో డాక్టర్ శ్రీహరి తెలిపారు సినిమా విడుదల తేదీని త్వరలో ఖరారు చేస్తాను అని వెల్లడించారు

నిన్న "బిచ్చగాడు -2" చిత్రం గురించి వ్యాసం రాయడం ప్రారంభించాను .ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి సమాచారాన్ని త్వరలో పూర్తి చేస్తాను . మీరు ఇస్తున్న ప్రోత్సహానికి కృతజ్ఞురాలను .నాకు సినిమా వ్యాసాలు రాయడం చాల ఆసక్తి


https://epaper.sakshi.com/3583371/Visakhapatnam-City/18-09-2022#page/16/2


అరుణ

==

Pranayraj1985 గారు,నమస్తే

బిచ్చగాడు -2 వ్యాసము రాయడము ప్రారంభించాను . ఇంకో తెలుగు సినిమా కూడా నాకు నచ్చింది . బిచ్చగాడు-2 పూర్తి అయ్యాకనే తరువాతి సినిమా రాయాలా ? రెండు వ్యాసాలు ఒకే సారి రాసి అభివృద్ధి పరచ వచ్చునా ? తెలియ పరచగలరు.నాకు సినిమా వ్యాసాలు రాయడం చాల ఆసక్తి . నేను మూలలను పూర్తిగా చదివి , అందులో విషయాన్నీ గ్రహించి , వాక్యాలను సొంతం గా రాసుకుని వికీ వ్యాసాలను రాస్తున్నాను

నమస్కారము ల తో

అరుణ

అరుణ గారూ, మీరు అడిగిన విషయాల గురించి మీ వాడుకరి చర్చాపేజీలో రాశాను. గమనించగలరు.--Pranayraj1985 (చర్చ) 18:25, 18 సెప్టెంబరు 2022 (UTC)Reply
Return to "ఒక యోధుడు" page.