చర్చ:ఒలిక్ ఆమ్లం

ఒలిక్ ఆమ్లం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఈ వ్యాసం శీర్షిక పేరు రసాయన శాస్త్ర పరంగా "ఓలియిక్ ఆమ్లం" అని ఉండాలి. అన్ని శాస్త్ర విజ్ఞాన పుస్తకములలో కూడా యిదే ఉన్నది. రసాయన శాస్త్ర నిఘంటువు పరంగా తీసుకున్నా యిలానే ఉన్నది. ఆంగ్ల నిఘంటువు లో ఈ పదం యొక్క phonetics ప్రకారం చూసినా "ఓలియిక్ ఆమ్లం" అని ఉన్నది. మెడికల్ నిఘంటువు లో చూసినా ఇదే విధంగా ఉన్నది. కనుక ఈ పేరును వ్యాస విషయకర్త యొక్క అనుమతి లేకుండా సభ్యునితో చర్చించకుండా ఈ వ్యాస శీర్షికను దారిమార్పుతో తరలించితిని. అనేక ఆధారాలు ఉన్నందువల్ల యిలా చేయవలసి వచ్చింది. కొన్ని నిఘంటువులలో ఉచ్చారణ కూడా స్పష్టంగా వినవచ్చు. వ్యాసాన్ని తరలించినంత మాత్రాన అది నా పేరుతో నమోదు కాదని సభ్యులు గ్రహించాలి. ఈ వ్యాసం సదరు సభ్యుని పేరుతోనే ప్రారంభకులుగా ఉంటుంది. కానీ నా స్వార్థంతో సదరు వ్యాసాన్ని నేను తయారుచేసినట్లు నా ఖాతా లోనికి వ్యాసాన్ని తరలించలేదని గమనించాలి. ఇచట వ్యక్తులపై విమర్శలు తగదు. విషయంపై మాత్రమే చర్చించాలని నా మనవి.----K.Venkataramana (talk) 17:21, 8 నవంబర్ 2013 (UTC)


ఈ వ్యాసం పై చర్చ ఈ వ్యాసం యొక్క చర్చా పేజీలో ఉంటే బాగుండునని నా చర్చా పేజీ నుండి తరలించితిని.


తొందర పాటు తగ్గించుకొని తోటి సభ్యులతో సమన్వమయంతో మెలగడం నేర్చు కోండి.

మార్చు

రమణ గారు,మీ ఇష్టానికి వచ్చినట్లు వ్యాసాల శీర్షికలను,అందులోని పేర్లను మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటూ పొతే మేమెందుకండి? వెదవల్లా చూస్తుకుర్చోవాలా? అడ్డదిడ్దమైన రచనలను చేసె వారినిబ నిర్వహాకులు ఏమి అనరు,ఏమి చెయ్యరు. ఏమి చెయ్యలేరు. ఓక 20కిలో బైట్ల వ్యాసం వ్యాయాలంటే ఎంత సమయంపడుతుందో మీకు తెలుసా? గంటల తరబడి మేము నిద్రలేకుండా రచనలు చేస్తే ఒక స్ట్రోకు తో మార్చెస్తే ఎలా? .పనికి మాలిన వ్యాసాలను తొలగించటానికి టాగ్ పెట్టి,కొన్నిరోజులు వెదురు చూస్తారు.అలాంటప్పుడు నాలాంటి రచనలో మార్పులు చేసేటప్పుడు రచయితను సంప్రదిందటమో చర్చ పేజిలో చర్చిండం చెయ్యవచ్చునుకదా.నిర్వహకులకు రచనమీద సర్వహక్కులున్ంట్లు మీరు మార్చుకుంటూ పోతే మేము రచనలు చెయ్యలేము. కొందరు నిర్వహకులు 20-25 కిలో బైట్లు వున్న వ్యాసాలను రచయితలకు చెప్పకుంద కొత్తశీర్షికకు తరలించి తమ పేరు మీద నమోదు అయ్యాలా చేస్తారు,కొందరేమో ఇలా ఇష్టారాజ్యం చెస్తూ పోతే కొత్తగా ఎవ్వరు రచయితలు రారు.రచనల్లో ఏమైన చెయ్యాలనుకున్నప్పుడు మమ్మలి సంప్రదిస్రడం కనీస మర్యాద.మేముకూడా మీలానేస్వచ్చందంగా పనిచేస్తున్నావారమే.నిర్వహాకులక్రింద బానిసలం కాదు.మీకే వికీ నియమాలు తెలియకపోటే సభ్యులకు ఏమి తెలుస్తుంది.రచయితలను నిరుత్సహా పరచకండి. ఇదిగో ఇలాంటి వాటికే మనస్సు విరిగి తెవికీ లో రచనలు తగ్గించాను. 30 ఏండ్లగా నూనెపరిశ్రమలో వున్నాం మేము ఒలిక్ ఆసిడ్ గానే పిలుస్తున్నాం దేశం మొత్తంమీద.పాలగిరి (చర్చ) 04:25, 7 నవంబర్ 2013 (UTC) దయచేసి ఈ లింకులను చూడండి

  1. [1]

నాకు తొందరపాటు లేదండీ పాలగిరిగారూ

మార్చు
 
పదవ తరగతి SCERT భౌతికరసాయన శాస్త్రాల పాఠ్య పుస్తకం లోని ఒక పేజీ

పాలగిరి గారికి, నేను అసంతృప్త ఫాటీ ఆమ్లాల పాఠ్యాంశములు బోధించునపుడు సంబంధిత పాఠ్య పుస్తకములలో "ఓయిలిక్" ఆమ్లం అని ఉన్నందువల్ల రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడైనందున ఆ పదం సరైన పదమని మార్పు చేసితిని. మీరు వాడిన పదం కూడా సరైనదని భావించి దారిమార్పు కూడా చేసితిని. శీర్షిక మార్పును తమతో చర్చించనందుకు అన్యదా భావించకండి. మీ రచనలు ఎందరికో ఉపయోగపడేవి. శాస్త్రవిజ్ఞాన సంబంధమైనవి. మీలాంటి రచనలు తెవికీకి కావాలి. పనికి మాలిన రచనలు మీరు టాగ్ పెట్టిన ప్రతిసారి తొలగించాను. నేను నిర్వాహత్వాన్ని దుర్వినియోగ పరుచుట లెదని భావించండి. సభ్యునిగా ఉన్నప్పుడే నాకు బాగుండేది. అనేక రచనలు చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడ్డాను. మీలాంటి వారిని నిరుత్సాహ పరచవలసిన అవసరం నాకు లేదని భావించండి. నేను నిర్వాహకత్వం పొందిన తర్వాత సభ్యులు కొద్ది సమాచారంతో చేసిన పేజీలను అనేకం విస్తరంచాను కానీ తొలగించుటకు ప్రయత్నించలేదండి. మీ రచనలు గల పేజీలకు (ఫాటీ ఆమ్లాలు) సహకరింపదలచి దానికి సంబంధించిన మూసను కూడా రాజశేఖర్ గారు చెప్పిన మీదట అనేక గంటలు శ్రమపడి తయారుచేశానండీ. నేను ఆ వ్యాసం శీర్షిక మార్చుటకు కారణమైన పేజీ యొక్క చిత్రాన్ని పరిశీలించండి.----K.Venkataramana (talk) 06:00, 7 నవంబర్ 2013 (UTC)

మీరు నేను ఇచ్చిన పైలింకును చదవండి,అందులో ఓలొయిక్ ఆమ్లముందా ఒలిక్ అమ్లమనివుందా,అవసరమైతే నేను పోటోతీట్టాఋఅను చూడండి.పాలగిరి (చర్చ) 06:03, 7 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారూ, మీరు ఎందుకు రమణ గారి మీద విరుచుకుపడుతున్నారో అర్ధం కాలేదు. వివరించగలరు. ఈయన తరలించినప్పుడు అది 20 కేబీల వ్యాసం కాదు. పొరపాటున తరలించినా మీరు తిరిగి తరలించుకొని హేతువు వివరించవలసినది. వ్యాసాలు ఎవరి పేరు మీదా నమోదవవండి కేవలం ఆయా దిద్దుబాట్లు మాత్రమే పేరు మీద నమోదవుతాయి. పేజీ చరిత్రను చాలా భద్రంగా కాపడటం వికీ పద్ధతిలో ఉన్నది. కాబట్టి మీరు చేసిన రచనలకు ఇంకొకరు క్రెడిట్ కొట్టేసే వీలు అస్సలు లేదు. నిశ్చింతగా వ్యాసాలు వ్రాయండి. మీరు వ్రాసిన వాటిని ఎవరూ దిద్దకూడదు అనుకుంటే వికీ మీకు అనువైన ప్రదేశం కాదు. ప్రతి చిన్నదానికి మరొకరి అనుమతి తీసుకొని మాత్రమే దిద్దుబాట్లు చెయ్యాలని ఎక్కడా లేదు. దారిమార్పులు చెయ్యటానికి నిర్వాహకుడే కానక్కరలేదు. రమణ గారూ సుదుద్దేశంతోనే వ్యవహరించారని మీరు మరచిపోకూడదు. ఆయన వళ్ళ ఏదైనా దిద్దుబాటులో తప్పు జరిగితే సామరస్యంగా అలా ఎందుకు చేశారని చర్చించాలి కానీ ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం అంత మంచి పరిణామం కాదు. ఇది ప్రత్యక్ష మాధ్యమం కాదు కదా, అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో అంచనా వెయ్యటం కష్టం కాబట్టి వీలైనంత హుందాగా వ్యవహరించాలి. దయచేసి విషయంపై చర్చించండి వ్యక్తులపై కాదు. అందరం తెలుగు కేతనాన్ని ఎగురవెయ్యటానికే కదా శ్రమిస్తున్నది. --వైజాసత్య (చర్చ) 06:14, 7 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారూ, మీరు సూచించిన లింకులో "Oleic Acid" అని ఉన్నది. దాని ఉచ్ఛారణ ఆంగ్ల నిఘంటువులో "ఓలియిక్" ని స్పష్టంగా వినవచ్చు. ఆ పదం యొక్క ఆంగ్ల phonetics "\ō-ˈlē-ik-, -ˈlā-\" అనే ఉన్నది. మీరు తెలిపిన పదం కూడా సరైనదే కావచ్చు. అందువలననే దారిమార్పు చేశాను.----K.Venkataramana (talk) 06:38, 7 నవంబర్ 2013 (UTC)
రమణగారు, నేను ఇచ్చిన పైలింకును చదివినట్లు లేరు. చదవండి,అందులో ఓలొయిక్ ఆమ్లముందా ఒలిక్ అమ్లమనివుందా, పోటోతీసాను చూడండి.పాలగిరి (చర్చ) 07:04, 7 నవంబర్ 2013 (UTC)
 
పైలింకుకు సంబంధించనపోటో
ఇదిగో మరోలింకు[2] ఆపేజీ పోటోతీసాను చూడండి
 
ఒలిక్ ఆమ్లం
మీరు కావల్సి చేశారని కాదు,శీర్షికలు వంటివి మార్చెటప్పుడు,అలాగే వ్యాసం లోని కొంత భాగాన్ని వేరే శీర్షిక తో కత్తరింఛి తరలించటం వలన ,వ్యాసచరిత్ర వ్రాసిన వారిమీద కాకుండ తరలించిన వారి పేరు మీద నమోదు ఆవుతున్నది.గంటల కొద్ది కష్టపడి వ్రాసిన 15-20కిలో బైట్లు మనది కాకుండ పోయిన ఎంతబాధకుంటుంది.అలాగే గంటలకొద్ది మేము వ్యాసి వ్యాసంలో పెద్ద మార్పులు లాంటివి చేసేటప్పుడు సంప్రదించిన మంచిది.రచయిత కూడా అంత అజ్ఞానంతో వ్రాయడు కదా( ఇప్పటికే 150 వ్యాసాలు అనుభవమున్న రచయిత.పరాయి భాష కన్నడంలో రబ్బరు గింజల నూనె పై వ్రాసిన మొదటి వ్యాసాన్నివెంటనే కొత్త వ్యాసాల శీర్షికలో ఎక్కించారు,నెలలు గడిచిన వ్యాసం అలానే వుంచారు.వ్యాసంలోని అక్షరదోషాలు, టైపింగ్ తప్పులు,వ్యాకదోషాలనేవి సాధారణం అటువంటి వాటిని సరిదిద్దెటప్పుడు సంప్రదించ అవసరం లేదు.అలాకాకుండా వ్యాసం సంపూర్ణ స్వరూపాన్ని మార్చే విషయంలో రచయితకు తెలిసే అవకాశం వుండాలి.తెవికీ లో వ్యాసాలు ఎక్కువ సంఖ్యలో పెరిగేది రచయితలవలనే,వ్రాసిన వెంటనే కరివేపాకులా తీసెయ్యవద్దని మనవి.ఇది మీ ఒక్కరిని ఉద్దేశించి అనటంలేదు.నా దృష్టిలో తెవికీ లోపాలు, చెప్పాలని వున్నా అవకాశం రాలేదు.కావున ఇదిమిమ్మలి ఒక్కరిని చేసిన కామెంట్ కాదు.ప్రస్తుతం తెవికీ లో వున్న పలు లోపాలలో ఇది ఒక్కటి,విజయవాడ సభలో అందుకనే క్వఛ్ఛన్ అవరుండాలని అడిగాను.ఇలాంటి పరిస్థితిలో అక్కడికి రావడం కుదనందున ఈ విధంగా నామనస్సులో బయటకు చెప్పేఅవకాశం రావడంతో వెళ్ళడించాను.ఇది ఏక్కరినో లక్ష్యం చేసుకోని చెప్పడంలేదు.తెవికీ నిర్వహణ్ అపై నాకున్న అభిప్రాయాన్ని వెళ్ళడింఛాను,పాజిటివ్ గాతీసుకుంటారా? నెగటివ్ తీసుకుంటారో మీ ఇష్టం? నాకు తెలుసు నా ఒక్కడి వలననే తెవికీ అభివేద్ధికుంటుపడుతుందనుకునేటంత మూర్ఖుడనుకాను. ఇది ఎంతో మంది కృషి ఈ నాటి ఈ అభివృద్ధి. మీవుద్దేశ్యంలో వైజాగారి వుద్దేశ్యంలో రచయిత అంటే ఎమిటో తెలిసింది.

.పాలగిరి (చర్చ) 07:04, 7 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారూ మీరు సూచించిన లింకునూ పరిశీలించాను. ఆ లింకు] ఒక ప్రొడక్ట్ యొక్క సమాచారంలా ఉంది. ఆ వ్యాసం గూగుల్ అనువాద వ్యాసంలా అనేక దోషాలతో కూడి ఉన్నది. అటువంటి వ్యాసాలను ఎలా ప్రామాణికంగా తీసుకుంటాము? ఒక శాస్త్ర గ్రంథమైనా, ఆంగ్ల ఫోనెటిక్స్ అయినా ప్రమాణంగా తీసుకోవాలని నా భావన. నేను ఆంగ్ల నిఘంటువు లో ఆ పదం యొక్క ఉచ్ఛారణ యొక్క లింకును పైన తెలిపాను. పరిశీలించండి. మీరు తెలియజేసిన పదం కూడా తప్పని నేననలేదు కదా! నేను శాస్త్రీయ కోణంలో ఉన్నత విద్యా పుస్తకాలలో కూడా పరిశీలించాను. "ఓలియిక్" అనే ఉన్నది.----K.Venkataramana (talk) 07:41, 7 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారు బాధతో తెలియజేసిన సమస్యను మనం పరిష్కరించాల్సి వుంది. పాలగిరి గారు తెవికీలో మీకున్న సమస్యలను తెలియజేస్తే వైజాసత్య గారు మనం కలిసి పనిచేయడానికి మీ ఇబ్బందుల్ని తొలగిస్తారు. రమణగారు చేసింది మీ వ్యాసాన్ని బాగుచేద్దామనే సదుద్దేశంతో చేసిందే గాని మీరు చేస్తున్న కృషిని దొంగిలించాలని మాత్రం కాదు. వారలాంటివారు కాదు. పెద్ద మనసుతో అర్ధం చేసుకోండి. మీ కున్న సమస్యల్ని చర్చలతో పరిష్కరించుకోవచ్చును.Rajasekhar1961 (చర్చ) 07:47, 7 నవంబర్ 2013 (UTC
బాబూ రమణ గారు,నేనేమి బ్లాగులో వున్న పేరు ఆధారంగా నూనెలవ్యాసం ఆధారంగా నేను ఒలిక్ ఆమ్లంనిర్నయించి వ్రాయలేదు.గత 35 ఏళ్ళగా నేను నూనె పరిశ్రమలో వున్నాను.1976 లో నేను ఆయిల్ టెక్నాలజీ చదివే రోజుల్లో ఒలిక్ ఆసిడ్(oleic acid)అని చెప్పారు.అనంతపురం రిజినల్ అయిల్ టెక్నాలజి కాళేజికి మామిడి పిక్కలనుండి తీయు నూనె వివరణ కై(1998) వెళ్ళినప్పుడు ఆ ప్రొపెసర్లు కూడా ఒలిక్ ఆసిడనేఅన్నారు.ఈమధ్య కాలంలో నూనెలకు సంబంధించిన పలు కాన్పరెన్సులలో అక్కడ ఉపన్యాసంచేసినవారు,నాతో సంభాషించిన టెక్నిసియన్లు ఒలిక్ ఆసిడ్ అనే అన్నారు. అందుకే అలాస్పందిచాను.అంతకు ముందురోజే నా వ్యాస శీర్షిక ప్రొపెన్(propene) ను ప్రోపెను గా మార్చి వ్యాసంలో కూడా మొత్తం ప్రోపెన్ చేశారు.ప్రొపెన్ నేను అంతగా తెలుగు లో వాడింది లేదు కాబట్టి ఆపేరుమీద నాకు తెలియదు కాబట్టి మిన్నకున్నాను( అయితే మేము ల్యాబ్ లో ప్రొపెన్ వాడేదం,సప్లై చేశెవారుకూడా ప్రొపెన్ అని వుచ్చరించేవారు).కాని 35 ఏళ్ళకు పైగా వాడుచున్న పదాన్ని ఒక్క వేటుతో మీరు ఒలియిక్ గామార్చడంతో నాతెలివి తక్కువ తనంతో అలా స్పందింఛాను. ఒక క్లిపింగు చూపి అదేరైటంటున్నారు.నేను చూపిన లింకులలలో అక్షరదోషాలున్నాయికనుక ఒలిక్ అమ్లం తప్పు అంటున్నారు.అంటే మీవుద్దేశ్యం రెండు బ్లాగులు కూడా పల్కుని ఒకే తప్పు చేశారంటారు.శభాష్!పాఠ్యపుస్తాకాలు ఎన్నెన్ని తప్పులతో ముద్రితమైన విషయం ఎన్నో సార్లు పత్రికల్లో వచ్చిన వాస్తవాన్ని మరిస్తే ఎలా మాస్టరు.!పోని లేండి మంఛె జరిగింది.ఒక నిజాన్ని తెలుసుకున్నాను. భగవద్గితలో పనిచెయ్యడం వరకే నీ పని ఫలితం కోసం చూడకు,అన్నట్లుగా రచనలు చెయ్యడమే నీవంతు,అతరువాత మేం చేసిన గమ్మున నోరు మూసికొనిచూడని తెవికీ నేటి వాదన.అరే రచయితకు తన మనోభావాన్ని తెలుపుకొనే అవకాశం ఇవ్వరా? వెంటవెంటనేరెండు వ్యాసాల పేర్లు ,వ్యాసంలో పేరు ను కొన్ని నిమిషాల్లో మార్చిన విషయం ప్రశ్నిస్తే సహా సభ్యులకు నేను రమణ గారి మీద విరచుకుపడ్డానంటూ ఆరోపిస్తు, వ్యాసాన్ని ఎవ్వరైన దిద్దవచ్చంటూ కామెంటు చేసారు.వ్యాసంను ఇతరులు దిద్దటానికి ,అదనపు సమాచారాన్నిచేర్చుటకు నేను వ్యతిరేకం కాదండి.చర్చపేజిలో చర్చించే అవకాశమున్న చర్చించకుండా చేసిన విధానాన్ని ప్రశ్నించాను. తెలియక అడుగు చున్నాను క్షమింఛడి మీరు వ్యాసంలో ఎంత అదనపు సమాచారం చేర్చారండి?!పాలగిరి (చర్చ) 08:43, 7 నవంబర్ 2013 (UTC)

నా అభిప్రాయం

మార్చు

పాలగిరి గారి అనుభవాల ఆధారంగా తెలియజేసిన వివరాల ఆధారంగా ఆయన వాదనను అంగికరిస్తాను. పాఠ్య పుస్తకాలు మరియు నిఘంటువు ఆధారంగా ఆ వ్యాస చర్చా పేజీలో చర్చించకుండా ఆ పేజీని తరలించి నందుకు సభ్యులు క్షమించాలి. ఇకపై యిటువంటి విషయాలు చర్చా పేజీలో చర్చించిన మీదట నిర్ణయం తీసుకొంటానని తెలియజేసుకుంటున్నాను. ఈ చర్చ మన మధ్య వైరుధ్యాలకు కారణం కారాదని నేను కోరుకుంటున్నాను. --K.Venkataramana (talk) 12:08, 7 నవంబర్ 2013 (UTC)

Return to "ఒలిక్ ఆమ్లం" page.