వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


భారత ముస్లింలలో 85% మంది క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూ దళితులే మార్చు

మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని కుల వివక్ష భరించలేకే మత మార్చుకున్నారని భారతదేశ మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్‌ నివేదిక ఇచ్చారు.వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారన్నారు.హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని,హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

దళితునితో మలం తినిపించారు మార్చు

తమిళనాడులో అగ్రవర్ణాల సమక్షంలో చెప్పులు వేసుకుని తిరిగాడనే అక్కసుతో ఓ దళితునికి మానవ మలం తినిపించారు.ఆ గ్రామంలో దళితకులం వారు సైకిల్‌ ఎక్కినా కూడా కిందపడేస్తారట, బెదిరిస్తారట.ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు స్పందించింది.(ఆంధ్రజ్యోతి3.2.2010) http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2010/feb/2main55

  • Nrahamthulla గారు, తెవికీ ని తెలుగు అభివృధ్ధికి ఉపయోగిద్దాం. తెవికీ లోకి మతం , కులం మీద చర్చ తీసుకురాకండి. జరిగిన సంగటన కచ్చితంగా తప్పే , కానీ ఇలాంటి విషయాలను మీరు పదే పదే చర్చకు తీసుకురావడంలోని ఆంతర్యం అర్ధం చేసుకోలేనంత వెర్రి వాళ్ళం కాదు. మత మార్పిడులకు ఇది వేదిక కాదు. నాకు కూడా మిగతా మతాల్లోని లోపాలు తెలుసు. కానీ వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించేంత కుసంస్కారం నాకు లేదు. అటువంటి అవసరం అంతకన్నా లేదు. దళిత హిందువులు ముస్లిములుగా, క్రిస్టియన్లుగా మారుతున్నారని అన్నారు, కానీ ఆ విషయం మీరు చర్చకు తేవాల్సిన అవసరం కేవలం ఒక్కటే, అది మీకు కూడా తెలుసు. మీకు తెలుసో లేదో, ఎంతో మంది ముస్లిములు క్రిస్టియన్లుగా మరియు క్రిస్టియన్లు ముస్లిములుగా మారిన సంఘటణలు లక్షల్లో ఉన్నాయి. తెవికీ ని తెలుగు అభివృధ్ధికి ఉపయోగిద్దాం. మీ మీద మంచి అభిప్రాయం ఉండేది, ఒక ముస్లిము తెలుగు భాషాభివృధ్ధికి తోడ్పటం ఆనందించ్చదగ్గ విషయమే అయినా మీరు ఇలాంటి పనులు చేయడం సబబు కాదు. మీ మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించండి. వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ మీ వివరణ కూడా విన్నాక మాట్లాడుతా. మీ మనస్సు నొప్పించుంటే క్షమించండి.

--శశికాంత్ 12:22, 12 మార్చి 2010 (UTC)Reply

  • శశికాంత్ గారూ

పేరుకు మాత్రం ముస్లిమునే గానీ సగం హిందూ సగం ముస్లిము ఆచారాలతో నేను ఏ మతమో నాకే తెలియని పరిస్థితి ఉంది. ఇంకా మత మార్పిడి కూడానా?వద్దు బాబోయ్.మానవత్వమే నా మతం.తెలుగు నా మాతృభాష కాబట్టే దాని అభివృద్ధికి కృషి చేస్తాను.కులం పేరుతో మతం పేరుతో మానవత్వాన్ని ఏమతస్తులు మంటకలిపినా అయ్యో అనుకోవటం మానవసహజం కదా అని స్పందించాను.నావైఖరిని మీరు విమర్శించినా ఆణిముత్యం లాంటి మాట ఒకటి సెలవిచ్చారు:" మీ మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించండి.వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు" అసలు నాకోరిక కూడా ఇదే.--Nrahamthulla 13:14, 12 మార్చి 2010 (UTC)Reply

రహంతుల్లా గారూ, శశికాంత్ గారూ,

వ్యాసాల చర్చా పేజీల్లో అసలు వ్యాసంలో ఎటూవంటి సమాచారం చేర్చాలి అనే విషయాల మీద చర్చ జరగాలి గానీ ఇలా పత్రికల్లో వచ్చిన వార్తల మీద కాదు. రహంతుల్లా గారూ, దయచేసి ఇకనుంచి చర్చా పేజీల్లో వార్తలను యదాతథంగా రాయకండి. ఒకవేళ వార్తల్లోని విషయాల్లో నుంచి వ్యాసం లో చేర్చదగ్గవి మీకనిపిస్తే ఏ పాయింటు చేర్చాలనుకుంటూన్నారో సూటిగా రాయండి. దాని మీద చర్చిద్దాం. —రవిచంద్ర (చర్చ) 13:20, 12 మార్చి 2010 (UTC)Reply

కులవివక్ష-కులం విషయాలు వేర్వేరు వ్యాసాలకు అర్హమైనవే మార్చు

కులవివక్ష గురించి వేరే వ్యాసం, కులం గురించి వేరే వ్యాసం ఉండవచ్చు. తెలుగుతో సహా భారతీయ భాషలు, భారతీయేతర భాషల్లో ఎన్నెన్నో పరిశోధనలు, విమర్శలు, ఖండనలు, మండనలు జరిగిన భారతీయాంశాలు కులం-కులవివక్ష. వీటిపై ప్రామాణికమైన సోర్సులు ఉన్నాయి. ఇప్పటికే కులం గురించి ఇంగ్లీష్ వికీపీడియాలో చాలా మంచి వ్యాసం ఉంది. తెవికీలో ఉన్న వ్యాసం మాత్రం చాలావరకూ మౌలిక పరిశోధనలతో, తక్కువ మూలాలతో, వేరే వ్యాసాంశానికి సంబంధించిన వివరాలతో కలగలిసి ఉంది. కనుక ఇది రెండు వ్యాసాలుగా ముందు విడదీయాలని నా ప్రతిపాదన. ఆపైన మౌలిక పరిశోధనలను తొలగించి, ఆంగ్లం నుంచి ఉన్న వివరాలను అనువదించి, లేదూ తెలుగులో మనకు అందుబాటులో ఉన్న సోర్సులతో ప్రామాణికంగా అభివృద్ధి చేయాల్సివుందని నా అభిప్రాయం.--పవన్ సంతోష్ (చర్చ) 13:34, 29 డిసెంబరు 2014 (UTC)Reply

ఇప్పుడు చూస్తే వర్ణం నుంచి కూడా ఇక్కడికే దారిమార్పు ఉంది. వర్ణం, కులం వేర్వేరు. వాడుకలో సంగతి ఎలా ఉన్నా సైద్ధాంతికంగా, చాలా శతాబ్దాల పాటు వ్యావహారికంగా కూడా వర్ణం, కులం వేర్వేరుగా ఉన్నాయి. వీటిని గురించి చాలా మంచి సోర్సులు మనకున్నా రెండిటినీ ఒకటేగా అభివృద్ధి చేయరాదు. వర్ణం పేజీని నేను అభివృద్ధి చేయగలను కానీ, కుల వివక్ష గురించిన వివరాలు చరిత్రతో సహా వేరే వ్యాసంలోకి ఎలా తరలించాలో నాకైతే అర్థం కావడంలేదు. దీనికి మరిన్ని అనుమతులు, వీళ్ళు ఉన్న నిర్వాహకులు, అధికారులు ఎవరైనా సాయపడగలరని ఆశిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 13:34, 29 డిసెంబరు 2014 (UTC)Reply
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కులం&oldid=3100789" నుండి వెలికితీశారు
Return to "కులం" page.