చర్చ:కైలాశ్ సత్యార్థి
పేరు సరికాదు
మార్చుकैलाश सत्यार्थी అన్న పేరును కైలాశ్ సత్యార్థి అని గానీ, కైలాష్ సత్యార్థి అని కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే-కైలాసం అని తెలుగులో మనవాళ్ళు పలుకుతున్నారు కనుక కైలాస్ అని వ్రాసుకున్నా హిందీ లిపిలో కైలాశ్ అనే ఉంది. ఎవరి పేరును ఎలా పలకాలన్నది ఆ వ్యక్తి ఐచ్ఛికం, ఆ వ్యక్తి మాతృభాష ఐచ్ఛికం అని అర్థం చేసుకోవాలి. ఇంగ్లీషులో కూడా ఆయన kailash అనే వ్రాసుకోవడం ఆయన రాసిన వ్యాసాల్లో గమనించవచ్చు. ఈనాడు వంటి తెలుగు దినపత్రికలు కైలాస్ అని ఉపయోగిస్తున్నాయి-ఐతే వారికి దేన్నైనా తెలుగువారి పదజాలంలోంచే చూడాలి వంటి కొన్ని పాలసీలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా వారు స్వేచ్ఛ తీసుకుంటారు. తెవికీ వారిని అనుసరించనక్కరలేదని, మన నిబంధనలు మన స్వేచ్ఛ వినియోగించి మనమే తీసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం. పరిశీలించి, నా వాదన సరి అనిపిస్తే కైలాష్/కైలాశ్ సత్యార్థి అనే పేరుకు పేజీని తరలించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 09:16, 11 అక్టోబరు 2014 (UTC)
- ఓ, ఈనాడు వారికి అలాంటి పాలసీ ఉందా. మరేంటి ఈ మధ్య మోడీ నుండి మోదీకి దిగారు :-) --వైజాసత్య (చర్చ) 10:16, 24 అక్టోబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, నాకీ పేరు దారిమార్పులో అభ్యంతరం లేదు కానీ, తెలుగు వారికి అంతగా పరిచయం లేని భాషల్లోని వ్యక్తులకు, స్థలాలకు తెలుగు వాడుకలోని పేర్లే పెడితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఇది వరకు ఈఫిల్ టవర్ గురించి కొంత చర్చ జరిగింది. అలాగే Uruguay, Paraguay లను స్థానిక స్పానిష్ భాషలో ఉరువాయ్, పరువాయ్ అంటారు. అదే తెలుగులో ఉరుగ్వే, పరుగ్వే అంటాం. ఉరువాయ్, పరువాయ్ అంటే చాలామంది తెలుగు పాఠకులకు అర్ధం కాదేమో? దీని గురించి మరింతగా చర్చ జరగాలి --వైజాసత్య (చర్చ) 10:27, 24 అక్టోబరు 2014 (UTC)
- వైజాసత్య ఈనాడు వాళ్ళకి ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్ పాలసీలు ఉంటాయి. మోడీ అనేది ఆంగ్ల పదంగా అలవాటు కావడం వల్ల వచ్చిన ఉచ్ఛారణ కావచ్చు. అందుకే వాళ్ళు దాన్ని భారతీయం చేసుంటారు. :-) ఇప్పుడు కైలాష్/కైలాశ్ అనే ఆయన పేరును తెలుగువాళ్ళ ఉచ్ఛారణకు అనువుగా కైలాస్ అని వాడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఫాలో అవుతుంటారు.
- మీ వివరణ గమనించాకా నాకు సమస్య విస్తృతి అర్థమయింది. ఆంగ్లేయులైతే ఎలాంటి ఉచ్ఛారణనైనా హాయిగా ఇంగ్లిషైజ్ చేసుుకని వాడుకున్నారు. ఐతే వారు పరిపాలకులు కాబట్టి నడచిపోయింది. పైగా ఠాకూరు టాగోర్ అయిపోయాడు. మనం కూడా ఏదోకటి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాకుంటే అదంత తేలికలాగా లేదు.--పవన్ సంతోష్ (చర్చ) 11:12, 24 అక్టోబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, వ్యాసాన్ని మొదట కైలాశ్ సత్యార్థి గానే సృష్టించడం జరిగింది. కానీ వార్తాపత్రికలలో కైలాస్ అని గమనించిన తర్వాత వ్యాసమును కైలాస్ సత్యార్థి కి తరలించాను. ఇప్పుడు మీరంతా కైలాశ్ సత్యార్థి సరైన పేరుగా భావిస్తే వ్యాసాన్ని తిరిగి మొదటి పేరుకే తరలిద్దాం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:48, 24 అక్టోబరు 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారూ స్పందించినందుకు థాంక్స్. ఇప్పటికే తరలించినట్టున్నారు. ఐతే వార్తాపత్రికల విషయంలో కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. వాళ్ళకు తాము రాసినదే జనం అనుసరిస్తారన్న ధైర్యంతో కొన్ని స్వంత పాలసీలు అమలుచేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:12, 24 అక్టోబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మీరన్నది నిజమే. ఈ విషయంలో ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే సరైన శీర్షికలను వాడుతున్నది. ఉదాహరణకు కశ్మీర్, ఆడ్వాణి లాంటివి. వ్యాసాన్ని సరైన పేరుకు తరలించిన వైజాసత్య గారికి ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:15, 24 అక్టోబరు 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అలాగే చేస్తాను. కానీ నిర్వాహకులే తీసెయ్యాలని ఎందుకు పెట్టారో నాకర్ధం కాలేదు. కొత్తవారిని ఉద్దేశించి అలా వ్రాసినట్టున్నారు --వైజాసత్య (చర్చ) 11:58, 26 అక్టోబరు 2014 (UTC)