చర్చ:క్రికెట్ పదకోశం

తాజా వ్యాఖ్య: ఒకే పేజీయా, పలు పేజీలా? టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: Chaduvari

మూలాల్లో దోషాలు మార్చు

మూలాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న దోషాలను పట్టించుకోనక్కర్లేదు. అన్ని మూలాలనూ చేర్చినపుడు ఆ దోషాలు వాటంతటవే తొలగిపోతాయి. __ చదువరి (చర్చరచనలు) 15:39, 4 అక్టోబరు 2023 (UTC)Reply

అవునండి. అందుకే మన దృష్టి వీటి మీద ఎక్కువ ఉంటుందని 'ఆంగ్ల వికీపీడియా నుంచి తీసుకున్నాము' అని సరళంగా రాసేసాను. ఇవి పొరపాటున ఉండిపోయినట్లున్నాయి. మిగిలిన పేజీలు చేస్తున్నాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 16:04, 4 అక్టోబరు 2023 (UTC)Reply

ఒకే పేజీయా, పలు పేజీలా? మార్చు

@Vjsuseela గారూ, ప్రధానబరిలో ఉపపేజీలు చెయ్యరాదనే నియమం ఒకటి వికీపీడియాలో ఉంది. అందుకే క్రికెట్ పదకోశం/2, క్రికెట్ పదకోశం/3 పేజీలను అది ఉపపేజీలుగా పరిగణించలేదు. "/" అంటే ఉపపేజీ అని అర్థం. కానీ పై పేజీల్లో ఉన్న "/" ను ఆ అర్థంలో తీసుకోలేదు. అది కూడా పేరులోనే భాగమని భావించింది. అందుకే -

  1. పై రెండు పేజీల్లో అన్నిటికంటే పైన "<క్రికెట్ పదకోశం" అనే లింకు లేదు. వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 పేజీ చూడండి. ఆ పేజీలో పైన "< వికీపీడియా:వికీప్రాజెక్టు" అనే లింకు ఉంది చూడండి. ఉపపేజీ నుండి మాతృపేజీకి వెళ్ళేందుకు అన్ని ఉపపేజీల్లోనూ ఉండే లింకు అది. క్రికెట్ పదకోశం/2,3 లను అది ఉపపేజీలుగా పరిగణించలేదు కాబట్టి ఆ లింకు లేదు.
  2. "క్రికెట్ పదకోశం" పేజీ లోని "పేజీ సమాచారం" అనే లింకును నొక్కి ఆ పేజీ లోకి వెళ్ళి చూస్తే మిగతా పేరుబరుల్లోని పేజీలకు ఉన్నట్లు "ఈ పేజీకి ఉన్న ఉపపేజీల సంఖ్య" అనే అంశం దీనికి లేదు.

మరొక సంగతి ఏంటంటే, ట్యాబ్ బార్ పెడదామని నేను ఈమెయిల్లో రాసాను గదా.. కానీ ఈ పద్ధతి కూడా ప్రధానబరిలో లేదని తరువాత నేను గమనించాను. ఇదంతా చూస్తూంటే.. మౌలికంగా విజ్ఞానసర్వస్వ సమాచారాన్ని అంచెలంచెలుగా పెట్టడం మీడియావికీ సాఫ్టువేరుకు ఇష్టం లేనట్టుంది.

కింది ప్రత్యామ్నాయాలను పరిశీలించండి.

  1. "క్రికెట్ పదకోశం - త-న", "క్రికెట్ పదకోశం - ప-మ" ఇలా పేజీలు చెయ్యడం. కానీ వీటిలో ట్యాబు పెట్టరాదు. విషయ సూచిక పెట్టి వాటికి లింకులు ఇవ్వవచ్చు. లేదా ఒక ప్రత్యేక నేవిగేషను మూసను చెయ్యవచ్చు. (విషయ సూచిక కూడా ఒక ఏవిగేషను మూస లాంటిదే, ఆకారంలో మార్పు ఉంటుందంతే)
  2. క్రికెట్ పదకోశం అనే ఒక్క పేజీ లోనే మొత్తం సమాచారాన్నంతటినీ ఉంచడం. దీని వలన ఇంకో ప్రయోజనం ఉంది: ఒక పదం నుండి ఇంకో పదానికి లింకులు ఇచ్చినపుడు, ఆ లింకును నొక్కిన పాఠకులు ఠక్కున గమ్యానికి వెళ్తారు - అదే పేజీలో ఉంటుంది కాబట్టి. లేదంటే మరొక పేజీ లోడు చెయ్యాల్సి ఉంటుంది. ఎలాగూ విషయ సూచిక పెడతాం కాబట్టి అంతా ఒక్క పేజీలోనే ఉన్నా నష్టం లేదు. కాకపోతే పేజీ పొడుగై పోతుంది.

ఆలోచించండి. __ చదువరి (చర్చరచనలు) 14:07, 5 అక్టోబరు 2023 (UTC)Reply

చదువరిగారు. మీ సూచనలకు ధన్యవాదాలు.
ఆంగ్ల వికీపీడియాలో ఇది ప్రాజెక్ట్ పేజీ కాకుండా సాధారణపేజీలో నేఉంది. అందుకని అలాగే చేశాను. ఒకే పేజీలో మొత్తం పదాలు ఉంటే పేజీ పెద్దగా అవుతుంది.
కాబట్టి వేరుగా పేజీలు చేస్తే అంటే - విషయ సూచికలో లింక్ ఇవ్వవచ్చు. పదకోశం-క-ఙ పేజీకి పదకోశం/2లింక్ ఇవవచ్చుకదా.
కన్నడ, హిందీ నమూనాలు కింద ఇచ్చాను
https://w.wiki/7fix
https://w.wiki/7fj6
అందుకే ప్రధాన -పేజీ కాకుండా మిగిలినవి trial గా చేశాను. మార్చవచ్చు కదా? నాకు ఇంకొంచెం అర్ధం ఆవవలసిఉంది.

VJS (చర్చ) 18:04, 5 అక్టోబరు 2023 (UTC)Reply

@Vjsuseela గారూ,
ప్రాజెక్టు పేజీలుగా చేద్దామన్నది నా ఉద్దేశం కాదు. అలా చెయ్యకూడదు కూడా. ప్రధానబరిలో ఉపపేజీలు కుదరదు అని చెప్పానంతే.
నేను చాటభారతం అంతా రాసి వదిలెయ్యకుండా నా అభిప్రాయం కూడా స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. ఇంతకీ నా అభిప్రాయం ఏంటంటే ఒకే పేజీగా చేద్దామని. అందుకే విషయసూచికను కూడా ఆ పద్ధతి లోనే పెట్టాను.
మీరిచ్చిన లింకులు చూసాను. హిందీలో అయితే విభాగాలు తప్ప సమాచారం ఏమీ లేదు. కన్నడంలో కూడా వేరువేరుపేజీలు లేవు, అంతా ఒకే పేజీలోనే ఉంది. కాకపోతే దాన్ని విభజించాలని ఎవరో ప్రతిపాదించారు. (వాళ్ళూ మనలాగే చర్చలు జరపరు కాబోలు.. 2011 నుండీ ఆ ప్రతిపాదన అలానే పడి ఉంది.) ఇంగ్లీషు, బెంగాలీ, తమిళంతో సహా ఇతర భాషలు కూడా ఐదారు చూసాను. అన్నీ కూడా ఒకే పేజీలో ఉన్నాయి.
అయితే అక్కడ అలా ఉన్నాయని మనం కూడా అలానే చెయ్యాలనేమీ లేదు. మన పద్ధతిలో మనం చేసుకుపోదాం. మీ ఆలోచన ప్రకారమే కానివ్వండి. __ చదువరి (చర్చరచనలు) 00:39, 6 అక్టోబరు 2023 (UTC)Reply
Return to "క్రికెట్ పదకోశం" page.