వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023
ఈ వికీప్రాజెక్టు కాలం విజయవంతంగా ముగిసింది. ఈ ప్రాజెక్టు తలపెట్టిన లక్ష్యాన్ని దాటేసి, మొత్తం 227.2% సాధించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఇక ఇక్కడ చెయ్యడానికి పనేమీ లేదు. దీనికి మించి, మరిన్ని పనులు చెయ్యాలని మీరు భావిస్తే, అందుకు అనుగుణంగా ఇతర ప్రాజెక్టులేమైనా ఉన్నాయేమో పరిశీలించండి. లేదా సదరు లక్ష్యాలతో ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించండి. |
క్రికెట్ ఆటకు సంబంధించిన వివిధ పేజీల సృష్టి, విస్తరణల కోసం తయారు చేసిన ప్రాజెక్టు ఇది. 2023 క్రికెట్ ప్రపంచ కప్ (2023 అక్టోబరు 5 నుండి నవంబరు 19 వరకు) భారతదేశంలో జరగనున్న సందర్భంగా ఈ ప్రాజెక్టును రూపొందించాం.
తేదీ | సృష్టించిన/విస్తరించిన పేజీలు |
---|---|
ఆగస్టు 31 | 775
|
సెప్టెం 10 | 1,000
|
సెప్టెం 30 | 1,343
|
అక్టో 31 | 1,799
|
నవం 12 | 2,000
|
ముగింపు | 2,272
|
క్రికెట్ పేజీలకు సంబంధించిన ప్రస్తుత స్థితి
మార్చుఈ ప్రాజెక్టు మొదలయ్యేనాటికి క్రికెట్ వర్గంలో 378 వ్యాసాలున్నాయి. ఇతర భారతీయ భాషలను పరిశీలిస్తే 4 వికీపీడియాల్లో తెలుగు కంటే బాగా ఎక్కువగా క్రికెట్ పేజీలున్నాయి. ఇంగ్లీషులో సరే చెప్పే పనే లేదు.. ఎన్వికీలో 51,710 వ్యాసాలున్నాయి. వివిధ భారతీయ భాషల గణాంకాలను కింద చూడవచ్చు.
ప్రాజెక్టు మొదలైన నాడు తెవికీ 7 వ స్థానంలో ఉంది. మనం ఈ ప్రాజెక్టులో ఒక వెయ్యి వ్యాసాలను సృష్టించగలిగితే తోటి వికీలతో పోలిస్తే కొంత మెరుగైన స్థానానికి చేరగలం. ఈ లోగా ఇతర ప్రాజెక్టుల వాళ్ళు కూడా ఇలాంటి ప్రాజెక్టు పెట్టుకోకుండా ఉంటే, మనం 5 వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంది.
భాష | అక్టోబరు 1 నాటికి
ఉన్న వ్యాసాలు |
ఆగస్టు 1 నాటికి
ఉన్న వ్యాసాలు |
కొత్తగా చేరిన వ్యాసాలు | 2 కెబి కి పైబడిన | 4 కెబి కి పైబడిన | ||
---|---|---|---|---|---|---|---|
వ్యాసాల సంఖ్య | వ్యాసాల శాతం | వ్యాసాల సంఖ్య | వ్యాసాల శాతం | ||||
తెలుగు | 1692 | 378 | 1314 | 1686 | 99.65 | 1561 | 92.26 |
తమిళం | 7996 | 7571 | 425 | 4896 | 61.23 | 1798 | 22.49 |
మలయాళం | 590 | 591 | -1 | 567 | 96.10 | 478 | 81.02 |
కన్నడం | 269 | 269 | 0 | 258 | 95.91 | 221 | 82.16 |
హిందీ | 3838 | 3836 | 2 | 3253 | 84.76 | 2285 | 59.54 |
బెంగాలీ | 7626 | 7993 | -367 | 7458 | 97.80 | 6650 | 87.20 |
మరాఠీ | 7466 | 7414 | 52 | 2827 | 37.86 | 2133 | 28.57 |
గుజరాతీ | 141 | 141 | 0 | 68 | 48.23 | 37 | 26.24 |
పంజాబీ | 805 | 800 | 5 | 672 | 83.48 | 411 | 51.06 |
అస్సామీ | 45 | 45 | 0 | 45 | 100.00 | 42 | 93.33 |
5 వ స్థానానికి చేరాం. వ్యాసం పరిమాణం విషయంలో మనం మరింత మెరుగైన స్థానంలో ఉన్నామని పై పట్టిక చూస్తే తెలుస్తోంది.
ప్రాజెక్టు రూపురేఖలు
మార్చుఈ ప్రాజెక్టు ఆగస్టు 1 న మొదలై, నవంబరు 20 వరకు రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఆగస్టు 1 నుండి అక్టోబరు 4 వరకు, రెండవ దశ అక్టోబరు 5 నుండి నవంబరు 20 వరకూ జరుగుతుంది. మొత్తం లక్ష్యం - కొత్త పేజీలు, విస్తరణలనూ కలుపుకుని 1000 వ్యాసాలు.
మొదటిదశ
మార్చుమొదటిదశ ఆగస్టు 1 న మొదలై అక్టోబరు 4 న ముగుస్తుంది. ఈ దశలో క్రికెట్‌కు సంబంధించిన వివిధ పేజీలను తయారు చేస్తాం, విస్తరిస్తాం. ఈ దశ ముగిసేనాటికి ఇతర పేజీలతో పాటు, 2023 ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ళు, అంపైర్లు, కోచ్‌లు, మేనేజర్లు, స్టేడియంలు, గత ప్రపంచకప్పులలో జరిగిన పోటీలు, ముఖ్యమైన రికార్డులు మొదలైనవాటికి పేజీలుండాలనేది ఈ దశ సంకల్పం.
రెండవ దశ
మార్చురెండవదశ అక్టోబరు 5 న ప్రపంచకప్‌తో మొదలై, నవంబరు 20 న ప్రపంచకప్ ముగియగానే ముగుస్తుంది. ఈ దశలో ప్రపంచకప్ పోటీల వివరాలను, ఫలితాలనూ ఎప్పటికప్పుడు తాజాపరుస్తూ ఉంటాం. ఒక్కో మ్యాచికి ఒక్కో పేజీ తయారు చెయ్యాలా లేదా అనేది నిర్ణయించాలి. అది ఎలా చెయ్యాలనేది చర్చించుకుందాం. ఈ రెండవ దశలో, జరుగుతున్న పోటీల వివరాలు రాయడం మాత్రమే కాకుండా, మొదటి దశకు సంబంధించిన పేజీల సృష్టి/విస్తరణ కొనసాగుతూనే ఉంటుంది.
పేజీల జాబితాలు
మార్చుపెట్స్కాన్ పరికరం ద్వారా ఎన్వికీ లోని వివిధ క్రికెట్ పేజీల జాబితాలను సేకరించి కింద చూపించాం. ఈ జాబితాల్లో ఉన్న పేజీల్లో వేటికీ, 2023 జూలై 16 వ తేదీ నాటికి తెలుగులో వ్యాసాలు లేవు. ఎన్వికీ పేజీని మూలంగా తీసుకుని నేరుగా మానవికంగా అనువదించవచ్చు, అనువాద పరికరం ద్వారా అనువదించవచ్చు. అనువాద పరికరం ద్వారా పని వేగంగా జరుగుతుంది కాబట్టి, ఆ పద్ధతిని అనుసరించవలసినదిగా సూచన. అయితే అనువాద పరికరం చేసిన అనువాదాన్ని సహజంగా ఉండేలా సవరించాక మాత్రమే ప్రచురించాలి.
- భారద్దేశం తరపున టెస్టు మ్యాచిలాడిన ఆటగాళ్ళు 269 పేజీలున్నై. తెలుగులో లేనివి.
- భారత్ తరపున వన్డేలు ఆడిన వాళ్ళు 110 పేజీలు తెలుగులో లేవు.
- ఈ 162 పేజీలు మహిళా క్రికెటర్లవి, తెవికీలో లేనివే.
- ఆస్ట్రేలియా వన్డే ఆటగాళ్ళు - 368 పేజీలు
- ఇంగ్లాండు వన్డే ఆటగాళ్ళు - 873 పేజీలు
- ఇంగ్లాండు టెస్టు ఆటగాళ్ళు - 630 పేజీలు
- వెస్టిండీస్ టెస్టు క్రికెటర్లు - 340 పేజీలు
- వెస్టిండీస్ వన్డే క్రికెటర్లు - 122 పేజీలు
- పాకిస్తాన్ టెస్టు క్రికెటర్లు - 268 పేజీలు
- పాకిస్తాన్ వన్డే క్రికెటర్లు - 68 పేజీలు
- న్యూజీల్యాండ్ టెస్టు క్రికెటర్లు - 283 పేజీలు
- న్యూజీల్యాండ్ వన్డే క్రికెటర్లు - 197 పేజీలు
- శ్రీలంక టెస్టు క్రికెటర్లు - 155 పేజీలు
- శ్రీలంక వన్డే క్రికెటర్లు - 124 పేజీలు
- దక్షిణాఫ్రికా టెస్టు క్రికెటర్లు - 410 పేజీలు
- దక్షిణాఫ్రికా వన్డే క్రికెటర్లు - 97 పేజీలు
- వివిధ దేశాల క్రికెట్ జట్లు 136 పేజీలు
- వివిధ దేశాల క్రికెట్ జట్ల చరిత్ర 11 పేజీలు
- వివిధ దేశాల మహిళా క్రికెట్ జట్లు 99 పేజీలు
- వివిధ దేశాల వన్డే క్రికెట్ అంపైర్లు 410 పేజీలు
- వివిధ దేశాల టెస్టు క్రికెట్ అంపైర్లు 284 పేజీలు
- క్రికెట్ వివాదాలు 87 పేజీలు
- టెస్టు క్రికెట్ మైదానాలు 129 పేజీలు
ఇవి కాకుండా కింది పేజీలను సృష్టించడం/విస్తరించడం చేయవచ్చు
- వివిధ దేశాల జాతీయ క్రికెట్ జట్లు (en:Category:National cricket teams) (ప్రస్తుతం భారత్, శ్రీలంకల క్రికెట్ జట్లకు పేజీలున్నాయి. వీటి పేర్లలో "జాతీయ" అనేది లేదు. ఇతర జట్ల పేజీలను కూడా ఆ విధంగానే సృష్టించాలి)
- భారతదేశం లోని వివిధ క్రికెట్ జట్లు (en:Category:Indian first-class cricket teams)) జాబితాను [ఈ లింక్] నుండి తీసుకోవచ్చును
- క్రికెట్ పరిభాష లోని వివిధ పేర్లకు పేజీలు. బౌలింగు, బ్యాటింగు, స్పిన్ బౌలింగు, ఫాస్ట్ బౌలింగు వగైరా క్రికెట్ పదాలకు పేజీలను సృష్టించవచ్చు (en:Category:Cricket terminology)
- క్రికెట్ రికార్డులకు పేజీలు సృష్టించవచ్చు (en:Category:Cricket records and statistics). అయితే వీటిలో కొన్ని పేజీల లోని సమాచారానికి త్వరగా కాలదోషం పడుతుంది. తాజాకరిస్తూ ఉండాలి.
నియమాలు
మార్చు- నాణ్యత ప్రధానం. పేజీలో భాష సహజంగా ఉండాలి. యాంత్రిక అనువాదం చెయ్యవచ్చు, కానీ యంత్రం మిగిల్చే యాంత్రికతను తీసేసి సహజమైన భాష రాసి మాత్రమే ప్రచురించాలి.
- పేజీ పాఠ్యంలో గానీ, సమాచారపెట్టెలో గానీ, పేజీలో మరెక్కడైనా గానీ తెలుగు భాష మాత్రమే ఉండాలి. ఎక్కడా ఇంగ్లీషు ఉండరాదు. అక్కడక్కడా - బ్రాకెట్లలోనూ ఇతరత్రానూ - ఉండే ఇంగ్లీషు పదాలకు ఇది వర్తించదు.
- వికీ పేజీకి ఉండాల్సిన హంగులన్నీ ఉండాలి - సమాచారపెట్టె (వర్తించిన పేజీల్లో), వర్గాలు, వికీలింకులు (కనీసం 3), ఇన్‌కమింగు లింకులు (కనీసం ఒకటి), అంతర్వికీ లింకులు, వగైరా..
- పేజీ కనీసం 5 కిలోబైట్లతో ఉండాలి. ఎన్వికీలో కూడా అంత సమాచారం లేని సందర్భంలో గాని అలాంటి వేరే ప్రత్యేక సందర్భాల్లో గానీ మినహాయింపు ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ 5 కెబి ల కంటే తక్కువ పరిమాణం ఉండే పేజీలు ప్రాజెక్టు మొత్తం మీద 5% కంటే ఉండడానికి వీల్లేదనేది ప్రాజెక్టు లక్ష్యం. ఇహ మొలక స్థాయి వ్యాసాలను పరిగణన లోకి తీసుకోం.
- ఇక్కడ ఇచ్చిన జాబితాలు సూచనామాత్రం గానే. ఈ పేజీలను మాత్రమే సృష్టించాలి అనే నిబంధనేమీ లేదు. క్రికెట్‌కు సంబంధించిన ఏ అంశం మీదనైనా పేజీ సృష్టించవచ్చు.
- సృష్టించాక: వ్యాసాన్ని సృష్టించిన తరువాత, దాని చర్చ పేజీలో {{వికీప్రాజెక్టు క్రికెట్ 2023 లో భాగం}} అనే మూసను చేర్చండి. తద్వారా ఆ పేజీ వర్గం:క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది.
- విస్తరించాక: ఈసరికే ఉన్న వ్యాసాన్ని విస్తరించిన సందర్భంలో, ఆ వ్యాసపు చర్చ పేజీలో పై మూసను, దానిలో 1=y అనే పరామితితో సహా చేర్చాలి - {{వికీప్రాజెక్టు క్రికెట్ 2023 లో భాగం|1=y}} -ఇలా. తద్వారా ఆ పేజీ వర్గం:క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా విస్తరించిన పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది.
- పై మూసలను వ్యాసపు "చర్చ పేజీల్లో" మాత్రమే చేర్చాలి. మరే ఇతర పేజీల్లోనూ చేర్చకూడదు. "చర్చ:" పేరుబరిలో కాకుండా మరే ఇతర పేరుబరిలో చేర్చినా మూస పనిచెయ్యదు.
పాల్గొనేవారు
మార్చు- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:24, 16 జూలై 2023 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- యర్రా రామారావు (చర్చ) 01:55, 17 జూలై 2023 (UTC)
- ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 04:06, 19 జూలై 2023 (UTC)
- Kasyap (చర్చ) 07:05, 19 జూలై 2023 (UTC)
- V.J.Suseela--VJS (చర్చ) 06:55, 20 జూలై 2023 (UTC)
- NskJnv 14:56, 26 జూలై 2023 (UTC)
- పవన్ సంతోష్ (చర్చ) 09:03, 31 జూలై 2023 (UTC)
- Divya4232 (చర్చ) 07:49, 12 ఆగస్టు 2023 (UTC)
- V Bhavya (చర్చ) 08:19, 15 ఆగస్టు 2023 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 11:01, 18 ఆగస్టు 2023 (UTC)
- Pravallika (చర్చ) 17:48, 26 ఆగస్టు 2023 (UTC)
టాప్‌ఐకన్లు
మార్చుఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు {{క్రికెట్ 2023 ప్రాజెక్టు topicon}} అనే టాప్‌ఐకన్ను తమ వాడుకరి పేజీలో పెట్టుకోవచ్చు. దీన్ని పేజీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది, సదరు వాడుకరి పేజీని వర్గం:క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసిన వాడుకరులు అనే వర్గం లోకి చేరుస్తుంది.
పేజీల ఎంపిక
మార్చుఒకే పేజీని ఒకరి కంటే ఎక్కువ మంది అనువదించకుండా ఉండేందుకు గాను కింది పట్టికను తయారుచేసాం. మొత్తం 5,632 పేజీల జాబితా ఇది. ఈ జాబితా పైన మాత్రమే పని చెయ్యాలనే నిబంధనేమీ లేదు. క్రికెట్‌కు సంబంధించిన ఏ పేజీపైనైనా పనిచెయ్యవచ్చు. పని మొదలు పెట్టే ముందు ఆయా వర్గాల్లో ఏ పేజీల శ్రేణిని ఎంచుకుంటున్నారో దానికి సంబంధించిన గడిలో మీ పేరు/వాడుకరిపేరు రాయండి (సంతకం పొడుగైపోతుంది). తద్వారా ఇతరులు ఆయా పేజీలపై పని చెయ్యకుండా ఉంటారు.
లింకు | వివరం - పేజీల సంఖ్య | మొదటి
50 |
51-100 | 101-150 | 151-200 | 201-250 | 251-300 |
---|---|---|---|---|---|---|---|
[1] | భారత టెస్టు ఆటగాళ్ళు 269 | చదువరి | చదువరి | చదువరి | |||
[2] | భారత వన్డే ఆటగాళ్ళు - 110. | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | |||
[3] | భారత మహిళా క్రికెటర్ల -162 | యర్రా రామారావు | వి.జె.సుశీల | - | |||
[4] | ఆస్ట్రేలియా వన్డే ఆటగాళ్ళు - 368 | కశ్యప్ | |||||
[5] | ఇంగ్లాండు వన్డే ఆటగాళ్ళు - 873 | పవన్ సంతోష్ | పవన్ సంతోష్ | దివ్య | |||
[6] | ఇంగ్లాండు టెస్టు ఆటగాళ్ళు - 630 | దివ్య | |||||
[7] | వెస్టిండీస్ టెస్టు క్రికెటర్లు - 340 | వి భవ్య | దివ్య | ||||
[8] | వెస్టిండీస్ వన్డే క్రికెటర్లు - 122 | దివ్య | వి భవ్య | వి భవ్య | |||
[9] | పాకిస్తాన్ టెస్టు క్రికెటర్లు - 268 | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ |
[10] | పాకిస్తాన్ వన్డే క్రికెటర్లు - 68 | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ||||
[11] | న్యూజీల్యాండ్ టెస్టు క్రికెటర్లు - 283 | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ |
[12] | న్యూజీల్యాండ్ వన్డే క్రికెటర్లు - 197 | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ||
[13] | శ్రీలంక టెస్టు క్రికెటర్లు - 155 | ప్రణయ్‌రాజ్ | ప్రణయ్‌రాజ్ | ||||
[14] | శ్రీలంక వన్డే క్రికెటర్లు - 124 | సాయి కిరణ్ | |||||
[15] | దక్షిణాఫ్రికా టెస్టు క్రికెటర్లు - 410 | చదువరి | చదువరి | ప్రణయ్‌రాజ్ | |||
[16] | దక్షిణాఫ్రికా వన్డే క్రికెటర్లు - 97 | చదువరి | చదువరి | ||||
[17] | వివిధ దేశాల క్రికెట్ జట్లు 136 | పవన్ సంతోష్ | |||||
[18] | వివిధ దేశాల క్రికెట్ జట్ల చరిత్ర 11 | పవన్ సంతోష్ | |||||
[19] | వివిధ దేశాల మహిళా క్రికెట్ జట్లు 99 | V.J.Suseela | |||||
[20] | వివిధ దేశాల వన్డే క్రికెట్ అంపైర్లు 410 | పవన్ సంతోష్ | |||||
[21] | వివిధ దేశాల టెస్టు క్రికెట్ అంపైర్లు 284 | పవన్ సంతోష్ | |||||
[22] | క్రికెట్ వివాదాలు 87 | చదువరి | పవన్ సంతోష్ | ||||
[23] | టెస్టు క్రికెట్ మైదానాలు 129 | చదువరి | చదువరి | చదువరి |
గణాంకాల లింకులు
మార్చుప్రాజెక్టుకు సంబంధించిన గణాంకాలను కింది లింకుల్లో చూడవచ్చు.
గమనిక:తాజా గణాంకాలను చూడాలంటే, ఈ లింకుల లోని sql క్వెరీలను కాపీ చేసి, కొత్త క్వెరీ పేజీలో పేస్టు చేసుకుని (ఫోర్కు చేసుకుని) ఆ క్వెరీలను నడపాలి.
ఆగస్టు 6 తాజాకరణ: ఇపుడీ క్వెరీల్లో, చేర్చిన బైట్లను కూడా చూడవచ్చు.
- తేదీ వారీగా, వాడుకరి వారీగా సృష్టించిన పేజీల జాబితాను చూసేందుకు
- తేదీ వారీగా ఒక్కో వాడుకరి సృష్టించిన పేజీల సంఖ్య
- తేదీ వారీగా సృష్టించిన మొత్తం పేజీల సంఖ్య
- వాడుకరి వారీగా సృష్టించిన పేజీల మొత్తం సంఖ్యను చూసేందుకు
- ప్రాజెక్టులో సృష్టించిన పేజీల్లో బొమ్మల్లేనివి. తగు బొమ్మలు చేర్చి ఈ పేజీలను మెరుగుపరచవచ్చు. వీటిలో బొమ్మలు లేకపోవడానికి 99% కారణం - ఎన్వికీలో కూడా లేకపోవడం లేదా అక్కడ ఉన్న బొమ్మ కామన్సు లోది కాక స్థానికంగా ఎక్కించినది కావచ్చు. ఎన్వికీలో బొమ్మ ఉన్నట్లైతే మనం ఆ బొమ్మను దించుకుని తెవికీ లోకి ఎక్కించుకుని, పేజీలో చేర్చవచ్చు.
ఉపపేజీలు
మార్చు- వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/చెయ్యాల్సిన పనులు - ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీల్లో చెయ్యాల్సిన పనులు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/బొమ్మల్లేని వ్యాసాలకు బొమ్మలు - ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీల్లో బొమ్మల్లేని వ్యాసాల జాబితా
- వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/మీకు తెలుసా - ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన పేజీల్లోని మీకు తెలుసా విశేషాలు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/సమీక్ష - ప్రాజెక్టుపై సమీక్ష
నిర్వహణ
మార్చుఆగస్టు నెల నివేదిక
మార్చుప్రాజెక్టు మొదలై ఒక నెల గడిచింది. వ్యవధిలో 27.7% ముగిసింది. దాదాపు వంద రోజుల్లో వెయ్యి వ్యాసాలు రాయాలని పెట్టుకున్న లక్ష్యంలో 77.5% 31 రోజుల్లోనే పూర్తైంది. ప్రాజెక్టులో పాల్గొన్నది 12 మందే అయిన్మప్పటికీ, ఎంతో ఉత్సాహంతో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నారు. విలువైన వ్యాసాలు వికీలోకి వచ్చాయి. మొత్తం 756 కొత్త వ్యాసాలు రాగా 19 వ్యాసాలు విస్తరణకు నోచుకున్నాయి. కొత్త వర్గాల సృష్టి, పాత వర్గాల క్రమబద్ధీకరణ కూడా జరిగాయి. కోటి బైట్ల పైచిలుకు సమాచారాన్ని చేర్చాం. ప్రస్తుతం క్రికెట్ వర్గంలో, దాని ఉపవర్గాల్లో 1100 పైచిలుకు వ్యాసాలున్నాయి.
ప్రాజెక్టులో ఇప్పటివరకూ గమనించిన విశేషాలు:
- రోజుకు సగటున 24 వ్యాసాలు సృష్టించాం. గరిష్ఠంగా ఆగస్టు 20 న 48 వ్యాసాలు, కనిష్ఠంగా ఆగస్టు 28 న 9 వ్యాసాలు సృష్టించాం. ఇవి కాక, 19 వ్యాసాలను విస్తరించాం.
- ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు కోటికి పైగా బైట్లను వికీలోకి చేర్చాం. ఇందులో విస్తరణల బైట్లు కలపలేదు. ఒక్కో వ్యాసానికి సగటున 13,300 బైట్లకు పైచిలుకే.
- వికీలో కొత్తగా రాస్తున్నవారు ప్రాజెక్టులో ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
- మొత్తం 12 మంది ప్రాజెక్టులో భాగమవగా అందులో నలుగురు స్త్రీలు
- అనువాద పరికరాన్ని చాలా విరివిగా వాడారు.
- కొన్ని వ్యాసాల్లో యాంత్రికానువాదాన్ని పూర్తిగా సవరించకుండా ప్రచురించారు
- పదేపదే చెయ్యాల్సిన కొన్ని పనులను AWB కి అప్పజెప్పి సమయాన్ని ఆదా చేసుకున్నారు
- చదువరి, ప్రణయ్‌రాజ్, వెంకటరమణ, విజె సుశీల గార్లు సృష్టించిన వ్యాసాల సంఖ్యలో ముందున్నారు. దివ్య, భవ్య, యర్రా రామారావు, కశ్యప్ గార్లు ఆ తరువాత ఉన్నారు.
క్ర.సం | వాడుకరిపేరు | సృష్టించిన వ్యాసాల
సంఖ్య |
చేర్చిన బైట్లు |
---|---|---|---|
1 | Chaduvari | 261 | 53,34,767 |
2 | Pranayraj1985 | 250 | 23,89,576 |
3 | K.Venkataramana | 95 | 8,96,583 |
4 | Vjsuseela | 50 | 4,79,232 |
5 | Divya4232 | 38 | 3,46,332 |
6 | యర్రా రామారావు | 33 | 2,53,221 |
7 | V Bhavya | 17 | 1,72,329 |
8 | Kasyap | 8 | 1,13,212 |
9 | Pravallika16 | 1 | 58,866 |
10 | Rajasekhar1961 | 1 | 11,283 |
11 | Nskjnv | 1 | 4,741 |
12 | KINNERA ARAVIND | 1 | 6,319 |
756 | 1,00,66,461 |
సెప్టెంబరు నెల నివేదిక
మార్చుఅక్టోబరు లోకి వచ్చేసాం. ఇప్పటి వరకు 1324 వ్యాసాలు సృష్టించాం. 19.72 కిలోబైట్ల సమాచారాన్ని చేర్చాం. సెప్టెంబరు నెలలో ప్రాజెక్టు జోరు కాస్త తగ్గింది. ఆగస్టులో రాసిన వాడుకరుల్లో సగం మందే సెప్టెంబరులో రాయడం చింతించవలసిన సంగతి. రాసిన ఆరుగురిలోనూ నలుగురి స్పీడు తగ్గింది. యర్రా రామారావు గారు, భవ్య గారు - ఈ ఇద్దరే గత నెల కంటే ఈ నెల ఎక్కువ వ్యాసాలు రాసారు. ప్రణయ్ రాజ్ గారు ఈ నెల అత్యధిక వ్యాసాలు రాసి ముందున్నారు, మొత్తమ్మీద కూడా ఆయనే ముందున్నారు.
ప్రపంచ కప్ మరో నాలుగు రోజుల్లో మొదలవబోతోంది. సన్నాహక మ్యాచ్‌లు మొదలయ్యాయ్, నాలుగు మ్యాచ్‌లు అయిపోయాయి కూడాను. ఇకపై 2023 క్రికెట్ ప్రపంచ కప్ పేజీని ఎప్పటికప్పుడు తాజాకరించుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ జరిగే మ్యాచ్‌లు ఏవో చూసి, అవి ముగిసాక వాటి ఫలితాలను ఆయా మూసల్లోకి ఎక్కించుకోవాలి. ప్రాజెక్టు సభ్యులు గమనించవలసినది.
ఇంకో 676 వ్యాసాలు రాస్తే, 2000 వ్యాసాలు చేరతాం. మిగిలిన 50 రోజుల్లో కూడా కృషి చేసి, ఆ కాస్తా పూర్తి చేసి 2000 మైలు రాయికి చేరదామని నా పిలుపు. రోజుకు తలా ఒక వ్యాసం రాస్తే లక్ష్యం చేరతాం. రండి 2000 వైపు అడుగేద్దాం.
క్రసం | వాడుకరి | ఆగస్టు | సెప్టెంబరు | మొత్తం | |||
---|---|---|---|---|---|---|---|
వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | ||
1 | Pranayraj1985 | 250 | 23,89,576 | 237 | 20,84,553 | 487 | 44,74,129 |
2 | Chaduvari | 261 | 53,34,767 | 222 | 67,35,249 | 483 | 1,20,70,016 |
3 | K.Venkataramana | 95 | 8,96,583 | - | 495 | 95 | 8,97,078 |
4 | Vjsuseela | 50 | 4,79,232 | 27 | 5,45,276 | 77 | 10,24,508 |
5 | యర్రా రామారావు | 33 | 2,53,221 | 40 | 8,05,317 | 73 | 10,58,538 |
6 | Divya4232 | 38 | 3,46,332 | 14 | 1,18,144 | 52 | 4,64,476 |
7 | VBhavya | 17 | 1,72,329 | 28 | 3,20,250 | 45 | 4,92,579 |
8 | Kasyap | 8 | 1,13,212 | - | 81 | 8 | 1,13,293 |
9 | Pravallika16 | 1 | 58,866 | - | - | 1 | 58,866 |
10 | Rajasekhar1961 | 1 | 11,283 | - | - | 1 | 11,283 |
11 | Nskjnv | 1 | 4,741 | - | - | 1 | 4,741 |
12 | KINNERA ARAVIND | 1 | 6,319 | - | - | 1 | 6,319 |
మొత్తం | 756 | 1,00,66,461
(9.6 కెబి) |
568 | 1,06,09,365
(10.12 కెబి) |
1,324 | 2,06,75,826
(19.72 కెబి) |
అక్టోబరు నెల నివేదిక
మార్చుఅక్టోబరు నెల ముగిసింది. 82% సమయం గడిచేసరికి 1777 పేజీలు సృష్టించాం, 22 పేజీలను విస్తరించాం. అనుకున్న లక్ష్యాన్ని మించి, 77.9% అదనంగా చేసాం. అక్టోబరులో ప్రణయ్ రాజ్ గారు ముందుండి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళారు. ఈ నెలలో ప్రాజెక్టు సాధించిన ప్రగతిలో 70% ఆయన చలవే.
క్రసం | వాడుకరి | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | మొత్తం | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | ||
1 | Pranayraj1985 | 250 | 23,89,576 | 237 | 20,84,553 | 319 | 23,27,432 | 806 | 68,01,561 |
2 | Chaduvari | 261 | 53,34,767 | 222 | 67,35,249 | 73 | 21,57,907 | 556 | 1,42,27,923 |
3 | K.Venkataramana | 95 | 8,96,583 | - | 495 | - | -1,716 | 95 | 8,95,362 |
5 | యర్రా రామారావు | 33 | 2,53,221 | 40 | 8,05,317 | 16 | 6,51,192 | 89 | 17,09,730 |
4 | Vjsuseela | 50 | 4,79,232 | 27 | 5,45,276 | 12 | 4,28,121 | 89 | 14,52,629 |
7 | VBhavya | 17 | 1,72,329 | 28 | 3,20,250 | 24 | 1,76,755 | 69 | 6,69,334 |
6 | Divya4232 | 38 | 3,46,332 | 14 | 1,18,144 | 0 | -830 | 52 | 4,63,646 |
8 | Pavan santhosh.s | 9 | 1,93,057 | 9 | 1,93,057 | ||||
9 | Kasyap | 8 | 1,13,212 | - | 81 | - | 99 | 8 | 1,13,392 |
10 | Pravallika16 | 1 | 58,866 | - | - | - | - | 1 | 58,866 |
11 | Rajasekhar1961 | 1 | 11,283 | - | - | - | - | 1 | 11,283 |
12 | Nskjnv | 1 | 4,741 | - | - | - | - | 1 | 4,741 |
13 | KINNERA ARAVIND | 1 | 6,319 | - | - | - | - | 1 | 6,319 |
మొత్తం | 756 | 1,00,66,461
(9.6 కెబి) |
568 | 1,06,09,365
(10.12 కెబి) |
453 | 5932017
(5.66 కెబి) |
1,777 | 2,66,07,843
(25.38 కెబి) |
తుది నివేదిక
మార్చుతెలుగు వికీపీడియాలో ఒకే విషయం మీద, 112 రోజుల్లో వెయ్యి వ్యాసాలు (రోజుకు 9 వ్యాసాలు) రాయడం అంటే మామూలు సంగతి కాదు. అలాంటి లక్ష్యం పెట్టుకుని ఈ ప్రాజెక్టు మొదలైంది. మొట్టమొదటి రోజు నుండే ప్రాజెక్టు పరుగు తీయడం మొదలుపెట్టింది. లక్ష్యాన్ని సులువుగా సాధించేస్తామని మొదటి వారం లోనే తేలిపోయింది. నెల తిరిగేసరికి, అంటే దాదాపు మూడో వంతు సమయం గడిచేసరికి, మూడొంతుల లక్ష్యాన్ని సాధించేసారు. 40 రోజుల్లో వెయ్యి వ్యాసాలు రాసి, లక్ష్యాన్ని ఛేదించారు. అ తరువాత మరో 62 రోజులకు రెండో వెయ్యి సాధించారు. చివరి 10 రోజుల్లో మరో 250 వ్యాసాలు రాసి, ప్రాజెక్టు ముగిసేనాటికి 2,250 వ్యాసాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు మొత్తం 378 వ్యాసాలున్న క్రికెట్ వర్గాన్ని 2,628 పేజీలకు చేర్చి సేదదీరారు.
ప్రాజెక్టును కొందరు ముందుండి లాక్కెళ్ళారు. మరి కొందరిని ప్రాజెక్టే ముందుకు లాక్కొచ్చింది. తొలి ఓవర్లలో బ్యాటర్లు వీరవిహారం చేసినట్టు తొలి 15 ఓవర్లలో ప్రాజెక్టుకు గొప్ప ఊపు నిచ్చారు కొందరు. 15-25 ఓవర్ల మధ్య ఊపు మరింత పుంజుకుంది. 25-40 ఓవర్ల మధ్య రన్ రేటు కొంత మందగించినప్పటికీ, స్థూలంగా పట్టుదల మాత్రం సడలలేదు. చివరి 10 ఓవర్లలో మళ్ళీ చాలామంది పుంజుకుని పరుగులు తీసారు. ప్రణయ్ రాజ్ గారు మాత్రం తొలి ఓవరు నుండి ఆఖరి ఓవరు ఆఖరి బంతి దాకా ఆడి, ప్రాజెక్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. మొత్తమ్మీద అందరం కలిసి ప్రాజెక్టును దిగ్విజయంగా ముగించాం.
తెలుగు వికీపీడియా అభివృద్ధిలో, వికీప్రాజెక్టు విజయాల్లో ఇదొక ప్రధానమైన విజయం, ఒక మైలురాయి.
ప్రాజెక్టులో భాగంగా 2,250 పేజీలను సృష్టి 22 పేజీలను విస్తరణ జరిగింది. కొత్త వ్యాసాల ద్వారా 29.3 మెగాబైట్ల సమాచారాన్ని వికీలో చేర్చారు. సగటున ఒక్కో వ్యాసానికీ 13,651 బైట్లను చేర్చారు.
అంతా మంచేనా, అంతా విజయ విహారమేనా, లోపాలూ లోటుపాట్లూ ఏమీ లేవా? ఎందుకు లేవూ.. ఉన్నాయి. వాటిలో కొన్ని:
- ప్రాజెక్టు ఎక్కువమంది వాడుకరులు పాల్గొనేలా ఆకర్షించలేకపోయింది. మరో పది మందైనా పాల్గొని ఉంటే బాగుండేది. ప్రాజెక్టు జరుగుతున్న కాలం లోనే కొందరు క్రికెట్ వ్యాసాలు రాసినప్పటికీ, వాళ్ళు ప్రాజెక్టులో భాగం కాలేదు, ఆ వ్యాసాలను ప్రాజెక్టులో భాగం చెయ్యలేదు. కారణం తెలీదు. అది ప్రాజెక్టు నిర్వాహకుల వైఫల్యమే.
- ప్రాజెక్టు మొదలైనపుడు ఒక సమావేశం పెట్టుకుని ఉంటే బాగుండేది.
- ఒక ప్రత్యేక లక్ష్యంతో తలపెట్టిన ప్రాజెక్టులలో ఏకరూపత ఉండేలా కొన్ని నియమాలు, సంప్రదాయాలను నెలకొల్పుకోవాలి. ఈ ప్రాజెక్టులో అలా కొన్ని చేసి ఉండాల్సింది. ఉదాహరణకు
- అనువాద సంప్రదాయాలు: బ్యాట్స్‌మన్ ను బ్యాటరు అనడం వంటి సర్వసాధారణ విషయాలను ముందే చెప్పుకుని ఉండాల్సింది.
- డూప్లికేషను: ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే పేజీలో పనిచేయకుండా ఉండేదుకు ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అది అంత ఖచ్చితంగా అమలైనట్లు కనిపించదు. కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు సభ్యులు ఇబ్బంది పడి ఉండవచ్చు.
- చాలా పేజీలు అనాథ పేజీలుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, వాటికి మూలంగా ఉండే ప్రధాన పేజీలు (జాబితా పేజీలు, జట్టు పేజీలు వంటివి) లేకపోవడం. ప్రాజెక్టులో భాగంగా ఆ పేజీలను సృష్టించడంపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఇన్ని అనాథలుండేవి కావు.
- భాషా నాణ్యత పరంగా కొన్ని లోటుపాట్లున్నాయి. వాటిని సవరించాల్సి ఉంది. ఉదాహరణకు తేదీ ఆకృతి.
ప్రాజెక్టు సభ్యులు, తాము గమనించిన ఇతర లోటుపాట్లను వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/సమీక్షలో రాయవలసినది.
ప్రాజెక్టులో సృష్టించిన పేజీల గణాంకాలు కొన్నిటిని కింద చూడవచ్చు. ఇవి కాక 22 పేజీలను విస్తరించారు
క్రసం | వాడుకరి | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు 1 - 20 | మొత్తం | |||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | వ్యాసాలసంఖ్య | చేర్చినబైట్లు | ||
1 | Pranayraj1985 | 250 | 23,89,576 | 237 | 20,84,553 | 319 | 23,27,432 | 244 | 18,80,038 | 1050 | 86,81,599 |
2 | Chaduvari | 261 | 53,34,767 | 222 | 67,35,249 | 73 | 21,57,907 | 2 | 90,405 | 558 | 1,43,18,328 |
6 | Divya4232 | 38 | 3,46,332 | 14 | 1,18,144 | 0 | -830 | 123 | 10,24,842 | 175 | 14,88,488 |
4 | Vjsuseela | 50 | 4,79,232 | 27 | 5,45,276 | 12 | 4,28,121 | 31 | 3,55,414 | 120 | 18,08,043 |
7 | VBhavya | 17 | 1,72,329 | 28 | 3,20,250 | 24 | 1,76,755 | 42 | 2,96,018 | 111 | 9,65,352 |
5 | యర్రా రామారావు | 33 | 2,53,221 | 40 | 8,05,317 | 16 | 6,51,192 | 11 | 2,30,944 | 100 | 19,40,674 |
3 | K.Venkataramana | 95 | 8,96,583 | - | 495 | - | -1,716 | 0 | -3,024 | 95 | 8,92,338 |
8 | Pavan santhosh.s | 9 | 1,93,057 | 17 | 2,10,074 | 26 | 4,03,131 | ||||
9 | Kasyap | 8 | 1,13,212 | - | 81 | - | 99 | 0 | 0 | 8 | 1,13,392 |
12 | Nskjnv | 1 | 4,741 | - | - | - | - | 3 | 22,665 | 4 | 27,406 |
10 | Pravallika16 | 1 | 58,866 | - | - | - | - | 0 | 0 | 1 | 58,866 |
11 | Rajasekhar1961 | 1 | 11,283 | - | - | - | - | 0 | 0 | 1 | 11,283 |
13 | KINNERA ARAVIND | 1 | 6,319 | - | - | - | - | 0 | 0 | 1 | 6,319 |
మొత్తం వ్యాసాలు & బైట్లు | 756 | 1,00,66,461 | 568 | 1,06,09,365 | 453 | 59,32,017 | 473 | 41,07,376 | 2,250 | 3,07,15,219 | |
మొత్తం మెగాబైట్లు (ఎంబి) | 9.60 | 10.12 | 5.66 | 3.92 | 29.3 |