చర్చ:గాడ్గే బాబా

తాజా వ్యాఖ్య: గాడ్గే బాబా 140వ జయంతి సందర్భంగా నివాళి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: సుల్తాన్ ఖాదర్
గాడ్గే బాబా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 9 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

గాడ్గే బాబా 140వ జయంతి సందర్భంగా నివాళి

మార్చు

వెంకటరమణ గారూ, సుల్తాన్ ఖాదర్ గారూ గాడ్గే బాబా 140వ జయంతి ఈ నెల 23వ తేదీన జరుగుతుంది. దేశంలోని ఎందరెందరికో శుభ్రత, కులనిర్మూలన, సేవాకార్యకలాపాల విషయంలో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురువు అయిన వారి స్మృతికి నివాళిగా వికీపీడియాలో తొలిపేజీలో వ్యాసాన్ని ప్రదర్శించవచ్చేమో పరిశీలించగలరా? గాంధీజీ కన్నా ముందుగానే గాంధీ ఆదర్శాలైన కులవివక్ష వ్యతిరేకత, అహింస, గ్రామ శుభ్రత వంటి విషయాలపై సాంఘిక రంగంలో కృషి చేసిన మహోన్నతుడాయన. నాకు మొదటిపేజీ వ్యవహారాల గురించి అంతగా అవగాహన లేకపోవడంతో మొదటిపేజీ నిర్వహణలో అనుభవజ్ఞులైన మీవంటివారిని సలహా అడుగుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:34, 22 ఫిబ్రవరి 2015 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ, మొదటి పేజీలో "ఈ వారం వ్యాసం" గా ఒక వ్యాసాన్ని పరిగణించాలంటే మొదట మీరు మంచి వ్యాసం గా గుర్తించిన (సుమారు 10కె.బి దాటినదై యుండాలి!) వ్యాసం యొక్క చర్చాపేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} మూసను చేర్చండి. అపుడు వాటిలో ప్రాముఖ్యతను బట్టి ఆ వ్యాసాన్ని మొదటి పేజీలో ప్రచురించవచ్చు. ఈ వ్యాసంలో మూసను ఇపుడు చేర్చాను. ఈ విషయం ప్రాముఖ్యత కలిగిన అంశం కనుక మొదటి పేజీలో చేర్చడానికి ప్రయత్నిస్తాను.-- కె.వెంకటరమణ 12:44, 22 ఫిబ్రవరి 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారూ సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు. ఈరోజే ప్రారంభమైన ఈ వ్యాసం 9.3 కెబి దాటడం మీరు గమనించే వుంటారు(కేవలం కంటెంట్). అవసరానికి అనుగుణంగా కొద్ది సమయంలోనే దాన్ని పది కెబి దాటించేందుకు ప్రయత్నిస్తాను. కామన్స్‌లో ఫోటోలు లేకున్నా ఆంగ్లం, మరాఠీ భాషల వికీల్లోంచి సేకరించి దస్త్రాలను ఎక్కించాను. ప్రతి లైనుకూ రిఫరెన్సులు కూడా చేర్చేను. వేరేదైనా చేయాలన్నా ఇక్కడ చెప్పండి, నావంతుగా ప్రయత్నిస్తాను. మరోమారు కృతజ్ఞతలు.--పవన్ సంతోష్ (చర్చ) 12:52, 22 ఫిబ్రవరి 2015 (UTC)Reply
పవన్ సంతోష్ గారూ, ప్రాథన్యతను దృష్టిలో పెట్టుకొని నేను మీరు కోరినట్లు చేశాను. కానీ మొదటిపేజీలో సార్వజనీన, ఉచిత చిత్రాలను మాత్రమే ప్రచురించాలి. మీరు ఉచిత దస్త్రాన్ని ఎక్కించడానికి ప్రయత్నించండి. అపుడు దాన్ని మొదటి పేజీలో ప్రచురిద్దాం.-- కె.వెంకటరమణ 12:56, 22 ఫిబ్రవరి 2015 (UTC)Reply
పవన్ సంతోష్ గారూ ఈ వ్యాసానికి మరిన్ని మూలాలను మరియు కంటెంటును చేరవేస్తాను. వ్యాస నాణ్యత పెంచడానికి తీసుకోవలసిన చర్యలు ఇంకా ఏమైనా ఉన్నచో తెలియజేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:51, 23 ఫిబ్రవరి 2015 (UTC)Reply
Return to "గాడ్గే బాబా" page.