చర్చ:గాలి సంపత్ (2021 సినిమా)
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
వ్యాసం పేరు
మార్చుప్రణయ్ రాజ్ గారూ, గాలి సంపత్ అనే పేరు అందుబాటులో ఉండగా దాని తర్వాత (2021 సినిమా) అని శీర్షికలో అక్కర్లేదని నా అభిప్రాయం. బ్రాకెట్లో మనం ఏదైనా రాసేది ఒకే పేరుతో పలు వ్యాసాలున్నప్పుడు వాటిని వేరు చేయడం కోసం మాత్రమే కదా. - రవిచంద్ర (చర్చ) 17:30, 12 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారు, ఫిల్మ్ కార్పోరేషన్ నియమం ప్రకారం ఒక సినిమా పేరు కొన్ని సంవత్సరాల తరువాత ఇంకో కొత్త సినిమాకి పెట్టుకునే అవకాశం ఉంది. ఆ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు రాసిన సినిమా వ్యాస పేరుబరికి సంవత్సరం పేరును జతకలిపి తరలింపు చేయాల్సివుంటుంది. గతంలో కొన్ని సినిమా వ్యాసాల పేర్లు గుర్తింపు కొరకు తరలించవలసి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా ఉండడంకోసం సినిమా వ్యాసాలకు ఇప్పుడే సంవత్సరం చేరుస్తున్నాను. అంతేకాకుండా గాలి సంపత్ అనే పదం వ్యక్తి పేరును సూచిందేదిలా కూడా ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:44, 12 మార్చి 2021 (UTC)
- ప్రణయ్ రాజ్ గారూ, ముందుగా జరబోయేది ఇప్పుడే నుంచే ఊహించి వ్యాస శీర్షికను నిర్ణయించనవసరం లేదని నా అభిప్రాయం. ఇక్కడ Proactive కన్నా Reactive గా ఉండటమే మంచిదని అనుకుంటున్నాను. వ్యాసం పేరు ఎంత సరళంగా ఉంటే అంతమంచిది. అలాగని ఖచ్చితంగా ఉండాలని నియమేమీ లేదు. మీరు చెప్పినట్లు నిజంగా గాలి సంపత్ అనే వ్యక్తి పేరుతో వ్యాసం ఉంటే ఇలా ఉంచవచ్చును గానీ, ప్రస్తుతానికి ఈ వ్యాసం పేరు సింపుల్ గా ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చాను. తుది నిర్ణయం మీదే. రవిచంద్ర (చర్చ) 17:53, 12 మార్చి 2021 (UTC)
- అలాగేనండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:55, 12 మార్చి 2021 (UTC)