గాలి సంపత్ (2021 సినిమా)
గాలి సంపత్, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు సినిమా.[2][3] ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్ బ్యానర్లలో ఎస్. కృష్ణ, హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మించిన ఈ సినిమాకి అనీశ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో[4] రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ళ భరణి, సత్య తదితరులు నటించగా,[5] అచ్చు రాజమణి సంగీతం సమకూర్చాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, విష్ణు తండ్రి-కొడుకులుగా నటించారు.[6]
గాలి సంపత్ | |
---|---|
దర్శకత్వం | అనీశ్ కృష్ణ |
స్క్రీన్ ప్లే | అనిల్ రావిపూడి |
కథ | ఎస్. కృష్ణ |
నిర్మాత | ఎస్. కృష్ణ హరీష్ పెద్ది సాహూ గారపాటి |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ శ్రీవిష్ణు లవ్లీ సింగ్ తనికెళ్ళ భరణి సత్య |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | బి. తమ్మిరాజు |
సంగీతం | అచ్చు రాజమణి |
నిర్మాణ సంస్థలు | ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్ షైన్ స్క్రీన్స్ |
విడుదల తేదీs | 11 మార్చి, 2021[1] |
సినిమా నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా సారాంశం
మార్చుఅరకులో ట్రక్కు డ్రైవర్ సూరి (శ్రీవిష్ణు) తండ్రి గాలి సంపత్ (రాజేంద్రప్రసాద్)కి నోట మాట రాకపోవడంతో గాలితో ఫిఫి భాష మాట్లాడుతుంటాడు. అతని భాష అర్థమయ్యేలా చెప్పేందుకు పక్కన ఓ ట్రాన్స్‌లేటర్ (సత్య) కూడా ఉంటాడు. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని, ఎప్పటికైనా నాటకాల్లో బహుమతి గెలిచి తన కొడుక్కి ట్రక్ కొని ఇవ్వాలనేది గాలి సంపత్ కోరిక. ఆ ఊరి సర్పంచ్ కూతురు (లవ్లీ సింగ్)ను సూరి ప్రేమిస్తాడు. సూరి. ఈ క్రమంలో సూరి, ఒక బ్యాంకు మేనేజర్ దగ్గర తన ప్రేమ విషయం చెప్పి 5 లక్షలు తెస్తాడు. ఆ డబ్బును గాలి సంపత్ తీసుకొని నాటక పోటీలకోసం ఖర్చు చేస్తాడు. దాంతో తండ్రీ కొడుకుల మధ్య పెద్ద గొడవ జరగడంతో గాలి సంపత్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిపోతున్నప్పుడు పెద్దగా కురుస్తున్న వర్షంలో అనుకోకుండా ఇంటి పక్కనున్న 30 అడుగుల నూతిలో పడిపోతాడు. నోటి మాట రాని సంపత్ నూతిలో నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.
నటవర్గం
మార్చు- రాజేంద్ర ప్రసాద్ (గాలీ సంపత్)
- శ్రీవిష్ణు
- లవ్లీ సింగ్
- తనికెళ్ళ భరణి
- సత్య
- రఘుబాబు[7]
- కరాటే కల్యాణి
- అనీష్ కురువిల్లా
- రజిత
- మిర్చి కిరణ్
- శ్రీకాంత్ అయ్యంగార్
- శ్రీనివాస్ సాయి
- గగన్
- మైమ్ మధు
- సురేంద్ర రెడ్డి
- రూపలక్ష్మి
నిర్మాణం
మార్చు2020 అక్టోబరు నెలలో ఈ సినిమాని ప్రకటించారు. 2020, నవంబరు 16న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభించబడింది.[8][9] ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిత్రీకరించారు.[10] స్క్రిప్ట్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు.[11][12][13]
విడుదల
మార్చు2021, జనవరి 24న జరిగిన సమావేశంలో ఈ సినిమాను 2021, మార్చి 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.[14]
మూలాలు
మార్చు- ↑ "'Jathi Rathnalu', 'Gaali Sampath' ready to clash with Sharwanand's film - Telugu News". IndiaGlitz.com. Retrieved 2021-03-12.
- ↑ "Sree Vishnu's Gaali Sampath seals a festive release". 123telugu.com. 2021-01-24. Retrieved 2021-01-25.
- ↑ Goud, Priyanka (2021-01-25). "Sree Vishnu's Gaali Sampath Movie To Release On Shivaratri". Telugu Filmnagar. Archived from the original on 2021-02-04. Retrieved 2021-03-12.
- ↑ "Jathi Ratnalu and Gaali Sampath to hit screens on March 11 - Times of India". The Times of India. Retrieved 2021-03-12.
- ↑ "కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాం". www.eenadu.net. Retrieved 2021-03-12.
- ↑ "Writer-producer of 'Gaali Sampath' thanks Anil Ravipudi for supervising the film". www.ragalahari.com. Retrieved 2021-03-12.
- ↑ "'Gaali Sampath' a bagful of comedy, emotions". Telangana Today. Retrieved 2021-03-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'Gaali Sampath': Sree Vishnu starrer goes on floors in Hyderabad - Times of India". The Times of India. Retrieved 2021-03-12.
- ↑ "JioNews". Jionews. Retrieved 2021-03-12.
- ↑ "Sree Vishnu and Rajendra Prasad shoot for Gaali Sampath at Araku - Times of India". The Times of India. Retrieved 2021-03-12.
- ↑ "Anil Ravipudi supervises direction for Sree Vishnu starrer Gaali Sampath - Times of India". The Times of India. Retrieved 2021-03-12.
- ↑ "Anil Ravipudi turns screenplay writer for Sree Vishnu's next Gaali Sampath - Times of India". The Times of India. Retrieved 2021-03-12.
- ↑ Codingest. "Anil Ravipudi takes on a new job for 'Gaali Sampath'". NTV Telugu. Retrieved 2021-03-12.[permanent dead link]
- ↑ Ravi, Murali (2021-01-24). "Sree Vishnu Gaali Sampath gets release date". Tollywood. Retrieved 2021-03-12.