చర్చ:గ్లోబల్ వార్మింగ్

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
గ్లోబల్ వార్మింగ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2021 సంవత్సరం, 25 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


గ్లోబల్ వార్మింగ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వ్యాసం పేరు

మార్చు

చదువరి గారూ, మీరు ఈ వ్యాసాన్ని రాసిన తర్వాత ఆంగ్ల వికీ వ్యాసానికి పేరు మార్చినట్లున్నారు. ఇప్పుడు అది క్లైమేట్ చేంజ్ అనే పేరుతో ఉన్నది. దాన్ని అనుసరించి మనం కూడా ఈ వ్యాసాన్ని వాతావరణ మార్పు అని మార్చాలంటారా? - రవిచంద్ర (చర్చ) 10:46, 15 డిసెంబరు 2020 (UTC)Reply

రవిచంద్ర గారూ, మనకు వాతావరణ (శీతోష్ణస్థితి) మార్పు అనేదానికంటే గ్లోబల్ వార్మింగ్ అంటేనే ఠక్కున వెలుగుతుందని నేను భావిస్తున్నానండి. అంచేత గ్లోబల్ వార్మింగ్ అనేదే సరైన మాట కావచ్చు. ఆ పేరుతో దారిమార్పు పేజీని సృష్టించుకోవాలని నా అభిప్రాయం. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 11:06, 15 డిసెంబరు 2020 (UTC)Reply
@రవిచంద్ర, ఓపిగ్గా భాషా దోషాలను సరిదిద్దినందుకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 11:07, 15 డిసెంబరు 2020 (UTC)Reply
గ్లోబల్ వార్మింగ్ కు సరైన తెలుగు పదం "భూతాపం". కనుక "భూతాపం" పుటను సృష్టించి ఈ పేజీకి దారిమార్పు చేయాలి. గ్లోబల్ వార్మింగ్ అందరికీ సుపరిచితమైన పదం.కనుక పుట శీర్షికను అలానే ఉంచాలి. "క్లైమేట్ చేంజ్" లేదా "వాతావరణ మార్పు" అనే పదాలు "గ్లోబల్ వార్మింగ్" అనేదానికి సమాన పదాలుగా భావించలేము. వాతావరణ మార్పులకు గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణం. – K.Venkataramana  – 12:09, 15 డిసెంబరు 2020 (UTC)Reply
వార్మింగ్ అంటే వేడెక్కడం, వేడి కాదు. అంచేత భూతాపం అనేది సరైనది కాదని నా అభిప్రాయం -"తాపం పెరగడం" (తాపోద్దీపన?) సరైనది. "భూమి వేడెక్కడం" అనేది మరింతగా సరిపోతుందనుకుంటున్నాను. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కు క్లైమేట్ చేంజ్ అనే మాటను ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అందుకు నాకు కనిపించిన కారణాలివి:
  1. వేడెక్కడం అనేది కారణమైతే శీతోష్ణస్థితి మార్పు అనేది ఫలితం. ఈ ఫలితం పలు విధాలుగా ప్రతిఫలిస్తోంది. అతి/అల్ప ఉష్ణోగ్రతలు, అతి/అల్ప శైత్యం, అతి/అల్ప వర్షాలు, వర్షాల లేమి, వీటన్నిటి లోనూ అతితీవ్ర ఘటనలు (ఎక్‌స్ట్రీమ్ ఈవెంట్స్) మరింత తీవ్రమవడం, మరింత తరచుగా జరగడం వంటివి జరుగుతున్నాయి. వార్మింగ్ అనే మాట వేడెక్కడాన్ని మాత్రమే సూచిస్తోంది.
  2. వేడెక్కడం అనేది పై ఘటనలను సరిగ్గా ప్రతిబింబించడం లేదు. పైగా వ్యతిరేకార్థంలో ధ్వనిస్తున్నాయి. 'ఓ పక్కన చలి పెరిగిపోతూంటే వేడెక్కడం అంటారేంటి ' అంటూ ప్రముఖులే గ్లోబల్ వార్మింగును సందేహించిన సందర్భాలున్నై. అంచేత ఈ దృగ్విషయాన్ని సరిగ్గా, మరింత పరిపూర్ణంగా ప్రతిబింబించే లాగాను, ఈ సైన్సు గురించి ఏమీ తెలియని సామాన్యులకు సందేహాలేమీ లేకుండా ఉండే లాగానూ "క్లైమేట్ ఛేంజ్" కొత్త పేరును కాయించారని నేను అనుకుంటున్నాను.
పై కారణాల వలన రవిచంద్ర గారు చెప్పేది సబబైన సంగతే. కానీ మనలో (తెలుగు ప్రజల్లో) "గ్లోబల్ వార్మింగు" కున్నంత ప్రఖ్యాతి, శీతోష్ణస్థితి మార్పు/వాతావరణ మార్పుకు లేదని నాకు తోస్తోంది. అంచేత ఈ పేరు ఉంచేస్తేనే సబబని నా భావన.
పైగా ఇంకో సంగతి ఉంది.. ఈ క్లైమేట్ చేంజి అనేది మానవ కార్యకాలాపాల జనిత మార్పు గురించే మాట్లాడుతుంది. ఇది కాకుండా భూగోళంపై నిరంతరం ప్రకృతి సహజం గానే క్లైమేట్ చేంజి జరుగుతూ ఉంటుంది (సుదీర్ఘ కాలావధుల్లో ఇది కనిపిస్తుంది) - మంచు యుగాలు, మధ్యంతర వేడి కాలాలు, మంచుయుగాలలో అంతర్గతంగా మళ్ళీ గ్లేసియేషను, వేడి కాలాలు.. వగైరాలు. ఈ సహజమైన వాతావరణ మార్పును ఏమనాలి? అదొక సమస్య మనకు. అంచేత గ్లోబల్ వార్మింగును అలాగే ఉంచెయ్యాలని భావిస్తున్నాను. పెద్దలు పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 01:19, 16 డిసెంబరు 2020 (UTC)Reply
చదువరి గారూ మీరిచ్చిన వివరణలవల్ల ఈ వ్యాసానికి గ్లోబల్ వార్మింగ్ అనే పేరు కొనసాగించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. మిగతా పదాలతో పోలిస్తే సామాన్య ప్రజానీకానికి గ్లోబల్ వార్మింగ్ అనే పదమే ఎక్కువ ఎరుకలో ఉండవచ్చు. ఇందుకు ప్రసార మాధ్యమాలు కూడా కారణం. వారు ఆంగ్ల పదానికి కల్పించిన ప్రాచుర్యం తెలుగు పదానికి కల్పించలేదు. కాబట్టి తెలుగు పదాలకు ఈ వ్యాసానికి దారి మార్పు సృష్టిస్తే సరిపోతుందని భావిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 05:56, 16 డిసెంబరు 2020 (UTC)Reply
Return to "గ్లోబల్ వార్మింగ్" page.