చర్చ:జమీల్యా (నవల)
{in use} మూసలో పేర్కొన్నట్లు ఒక పది గంటల సమయం దాటిపోయి ఉండవచ్చు. ప్రాధమికంగా english wiki నుంచి అనువాదరూపంలో చేద్దామంటే అక్కడ అది stub గానే వుంది. తెలుగులో ఇంకొద్దిగా డేటా తో విస్తృతి చేద్దామనుకొంటున్నాను. వ్యాసం ఇంకా పూర్తవ్వలేదు. అందుకే "నిర్మాణంలో ఉంది" అనే మూసను నేనే వుంచాను. కొద్దిగా సమయం పడుతుంది పూర్తిచేయడానికి. పూర్తి అయ్యినతరవాత మెరుగవ్వలేదు అనిపిస్తే చర్చించవచ్చు. ఈ కొత్త వ్యాసం ప్రారంభించి 4 రోజులే అయ్యింది. వ్యాసం పూర్తవ్వడానికి జస్ట్ ఇంకొద్దిగా సమయం పడుతుంది.--Vmakumar (చర్చ) 00:35, 1 సెప్టెంబరు 2020 (UTC)
- Vmakumar గారు, ముందుగా వ్యాసానికి కొన్ని మూలాలు చేర్చండి. ఇతర పేజీలనుండి ఈ పేజీకి, ఈ పేజీ నుండి ఇతర పేజీలకు వికీ లింకులు ఇవ్వండి. ఇవి వికీ వ్యాస కనీస నియమాలు. అలా చేస్తే ఈ వ్యాసం పట్ల ఇతర సభ్యులకు ప్రాథమికంగా ఒక అభిప్రాయం వస్తుంది. ఆ తరువాత మీరు వ్యాసాన్ని విస్తరణ చేయవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 00:47, 1 సెప్టెంబరు 2020 (UTC)
- Vmakumar గారు, వ్యాసంలో కొద్ది మార్పులుచేసి మూసలు తొలగించాను. మీరు అనుకున్నట్లుగా వ్యాసాన్ని పూర్తిచేయండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 01:26, 1 సెప్టెంబరు 2020 (UTC)
ThanQ ప్రణయ్‌రాజ్ వంగరి గారు. "ముందుగా వ్యాసానికి కొన్ని మూలాలు చేర్చండి". చక్కని సలహా. వ్యాసం నిర్మాణంలో వున్నప్పుడు ముందుగా కొన్ని మూలాలు అయినా చేరిస్తే, ఆ వ్యాసం పూర్తవ్వడం ఒకింత ఆలస్యం అయినప్పటికీ, మీరు చెప్పినట్లు ఇతర సభ్యులకూ వ్యాసం పట్ల ప్రాధమికంగా ఒక అభిప్రాయం కలుగుతుంది. పైగా ఆ అసంపూర్ణ వ్యాసం ఆ దశలో కూడా చూడడానికి పొందికగా, ఉన్నంతలో కొద్దిగా సమగ్రంగా నైనా కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఆ కోణంలో ఆలోచించలేదు. నేను రాస్తున్న వ్యాసంలో అన్ని భాగాలు పూర్తయినతరువాతనే చిట్టచివరగా మూలాలు, వర్గాలు, ఇతర వికీలింకులు, బయటిలింకులు, రిఫెరెన్సులు,దారిమార్పులు,అనాధ పేజీ కాకుండా చేయడం లాంటివి అన్నీ ఒకేసారి చేర్చాలనే ప్రయత్నం చేసేవాడిని. నా వరకూ నేను 'ఎలాగూ వీటిని వ్యాసంలో చేరుస్తాను కదా, వ్యాసం పూర్తి అయిన తరువాత చివరలో చేరుద్దాంలే' అనే అభిప్రాయంలో చివరి వరకూ ఆగి వుండేవాటిని. దీనివలన వ్యాసం వారాల తరబడి కొనసాగుతూ వస్తున్నప్పుడు, ఆ కొనసాగుతున్న వ్యాసం గురించి సభ్యులకు ఏవిధమైన అభిప్రాయం కలగకపోయే అవకాశం ఉండదు అని గ్రహించలేకపోయాను. మీరు చెప్పినది మంచి సలహా. ఇకనుంచి వ్యాసం కొనసాగిస్తున్న ప్రారంభదశలోనే కనీసం కొన్ని మూలాలైనా చేర్చుకొంటూ, ఇతర పేజీలకు లింకులు, .. తదితర అంశాలు సాధ్యమైనంతవరకూ చేర్చుకుంటూ పోతాను. I always welcome good suggestions from senior Wikipedians like you that contribute to the improvement of the wiki policies I follow in writing articles. Thank you once again for nice advice. --Vmakumar (చర్చ) 21:40, 1 సెప్టెంబరు 2020 (UTC)