చర్చ:తస్లీమా నస్రీన్
సభ్యులకు ఒక సూచన: ముస్లిం సమాజంలో తస్లీమా ఒక ఫిత్నా. ఈమె, మానవతావాదపు కొన్ని విషయాలు లేవదీసి వుండవచ్చు, కానీ ఇస్లాం మతానికి విమర్శించే స్థాయి స్థోమత కలిగి వున్నదంటారా? ఒక మతంవారిని విమర్శించినందుకు దానిని క్వాలిఫికేషన్ గా గుర్తించి,ఈ వ్యాసానికి ఇన్ని హంగులతో ఉద్దరించాల్సిన అవసరం ఉన్నదంటారా? బహుశా ఈ భావనే కాబోలు 'ఇస్లాం విమర్శకులు' అనే వర్గం తయారీకి పరోక్షంగా తోడ్పడింది. ఏమైనా, ఆధునిక భావనలు గల వారి గురించి వ్యాసాలు అభ్యంతరాలు లేనివే, అయిననూ, వీరి పట్ల మన భారతసమాజంలో ఎలాంటి భావనలున్నాయి అనే అంశం కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాసాలు తయారు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈమెపై దాడి చేసిన వారిని 'ముష్కరులు' 'ఛాందసులు' అని సంబోధనలు బాగానేవున్నాయి. ఇదే సమయంలో ఈమె 'ఇస్లాం పై దాడి చేసింది' అనే విషయం ఆధారంగా, ఈమె గురించి అసభ్య పదజాలాలు వ్రాసే ఆస్కారమూ వున్నది. నిర్వాహకులూ మరియు సభ్యులు ఇలాంటి విషయాల పట్ల కొంచెం దృష్టి సారించాలని మనవి. నేటి కాలంలో కొందరికి 'సల్మాన్ రష్దీ' 'తస్లీమా నస్రీన్' లు హీరో హీరోయిన్ లు గావచ్చు, కానీ మెజారిటీ ముస్లిం సోదరులలో ఈ రెండు పేర్లు 'తిట్లు' లాంటివి. ఇలాంటి వ్యాసాలు సున్నితమైనవనే విషయం గమనించాలని మనవి. లేని యెడల, మత విమర్శకుల వర్గాలూ, కులవిమర్శకుల వర్గాలూ, జాతి తెగల విమర్శకుల వర్గాలూ తయారయ్యే ప్రమాదముంది. ఇలాంటి ప్రమాదాలను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆస్కారం ఇవ్వకూడదు. ఈ వ్యాసంపై కన్నా, బంగ్లాదేశ్ జాతీయ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం గురించిన వ్యాసంపై శ్రద్ధ ఉపయుక్తం. నిసార్ అహ్మద్ 21:10, 7 నవంబర్ 2008 (UTC)
- శశికాంత్ గారూ,ఈమె హేతువాది మరియు నాస్తికురాలు.ఈ వాక్యాలు ఎందుకు తీసేశారు?ఇన్నయ్య గారే ఆ సభలో ఈవిషయాన్ని చెప్పారుగదా?మజ్లిస్ పార్టీ నాయకులు ఆమెపై దాడిచేశారు.దీనిని మజ్లిస్ పార్టీకి చెందిన ఇస్లాం చాందసవాదులు గా మార్చి మీరు మళ్ళీ మతంమీదే గురిపెట్టారు.ముస్లిముల్లో చాలామంది హేతువాదులు నాస్తికులు[ఆధారం చూపాలి] ఉన్నారు--Nrahamthulla 02:11, 13 సెప్టెంబర్ 2010 (UTC)
- హేతువాది , నాస్తికురాలు అన్న విషయాలు మొదట తీసివేసినా వాటిని సరైన మూలాలతో సరైన అర్థంతో మళ్ళీ చేర్చాను. ఆమె పుట్టుకతో నాస్తికురాలు కాదు. మీరు రాసిన దానికి అర్థం అలానే వచ్చింది. అందుకే మార్పు చేశాను.
- రెండో విషయం, ఆమెపై దాడి చేసింది ఇస్లామిక్ చాందసవాదులు కాబట్టి [ఆధారం చూపాలి]అలా రాశాను. మీరు చెప్పిన హేతువాదులు నాస్తికులు ఆమెపై దాడి చేయలేదు. అన్ని పేపర్లలోనూ islamic fundamentalists అని వచ్చింది. ఆమె కూడా అదే చెప్పింది. నేను కేవలం తర్జుమా చేశాను.
- ముస్లింలలో తీవ్రవాదులు ఉండరు కానీ నాస్తికులు ఉంటారట. ఇది వ్యాసానికి సంబంధంలేని విషయం కాబట్టి నవ్వి వదిలేస్తున్నా.
--శశికాంత్ 06:06, 13 సెప్టెంబర్ 2010 (UTC)
- పుట్టుకతోనే మనిషికి ఏమతంలోనూ విశ్వాసం రాదు.పెరిగే కొద్దీ సమాజ ప్రభావం వల్ల మతవిశ్వాసాలు ఏర్పడతాయి.ముస్లిం కుటుంబంలో పుట్టిన మనిషి దరిమిలా నాస్తికుడు కాకూడదని గ్యారంటీ ఏంటి?షేక్ సిద్దార్ధబక్ష్ ,సయ్యద్ నజీర్ అహమద్ హజరత్ అలీ షరీఫ్ గోరా లాంటి నాస్తికులు తెలుగునాట మనచుట్టు చాలామంది ఉన్నారు.వాళ్ళు నమాజుకూడా చెయ్యరు.కీర్తి శేషులు సయ్యద్ అబ్దుల్ అజీమ్ (తెనాలి) నిండు సభలో నేను నాస్తికుడిని అని ప్రకటించారు.తస్లిమా స్వేచ్చగా తనభావాలు వ్యక్తంచేశారు.ఆమె అడిగిన వాటికి ఓపికగా సహేతుకమైన సమాధానం కూడా ఇవ్వలేక హింసకు పాల్పడి ఆమె గొంతు నొక్కేవాళ్ళు పాపులు,అరాచకవాదులు.ఇలాంటి తీవ్రవాదులు అన్ని మతాలలో ఉన్నారు.వారిని సాకుగాచూపి మొత్తం ఆ మతమే ఇలాంటిది అని దుయ్యబట్టటం న్యాయమా?--Nrahamthulla 06:59, 13 సెప్టెంబర్ 2010 (UTC)
- నేను మొత్తం మతాన్ని ఎక్కడ దుయ్యబట్టాను. ముస్లింలు దాడి చేశారు అనలేదు. ఇస్లామిక్ చాందసవాదులు దాడి చేశారు అన్నాను. ఇలా రాయడం వల్ల moderate ముస్లింలకు ఈ దాడి నుంచి మినహాయింపు ఇచ్చినట్టు అయింది. అది కూడా నేను చెప్పింది కాదు. ఆమె మరియు పత్రికలు చెప్పిన విషయం రాశాను. ఆమె వెబ్‌సైట్ లో అలానే ఉంది, చదవండి. nasreen. ఇంతకు మించి సాక్షాలు చర్చలు అనవసరం. దాడి చేసిన వాళ్ళు ఇస్లామిక్ చాందసవాదులు కాదని మీరు అంటే దానికి తగిన సాక్షాలు సమర్పించండి. --శశికాంత్ 07:12, 13 సెప్టెంబర్ 2010 (UTC)
- ఇస్లామిక్ చాందసవాదులు అనొద్దు.మజ్లిస్ అల్లరిమూకలు అనండి.మతాన్ని ముడిపెట్టటం తప్పు.--Nrahamthulla 07:53, 13 సెప్టెంబర్ 2010 (UTC)
తస్లీమా నస్రీన్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. తస్లీమా నస్రీన్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.