ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఆంగ్లం : All India Majlis-e-Ittehadul Muslimeen) (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين, కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అర్థం: అఖిల భారత సమైక్య ముస్లింల కౌన్సిల్) భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్నిచోట్ల ఓమాదిరి ఉనికి గల పార్టీ. 2004 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ ఓ సీటు గెలుపొందింది. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1984-2004 వరకు ఆ.ఇ.మ.ఇ.ము. పార్టీ అధ్యక్షుడిగా సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఉన్నాడు. అనంతరం తన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ کل ہند مجلس اتحاد المسلمين | |
---|---|
నాయకత్వం | అసదుద్దీన్ ఒవైసీ |
వ్యవస్తాపన | బహాదుర్ యార్ జంగ్ |
స్థాపన | 1927 లో అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్ |
ప్రధాన కార్యాలయం | దారుస్సలాం బోర్డు హైదరాబాదు |
పత్రిక | ఇతేమాద్ డైలీ (ఉర్దూ దినపాత్రిక) |
సిద్ధాంతం | లౌకిక వాద ప్రజాస్వామ్యం |
రంగు | ఆకు పచ్చ |
తెలంగాణా అసెంబ్లీ | 7 / 119 |
మహారాష్ట్ర అసెంబ్లీ | 2 / 288 |
లోక్ సభ | 1 / 545 |
ఓటు గుర్తు | |
గాలిపటం | |
వెబ్ సిటు | |
http://www.aimim.in |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాదు నగర కార్పొరేషన్ లోని 100 సీట్లలో 36 సీట్లు కలిగివున్నది.
చరిత్రసవరించు
దీని చరిత్ర పూర్వపు హైదరాబాదు సంస్థానం వరకూ పోతుంది. దీనిని 1927 అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్ స్థాపించాడు. ఈ పార్టీ నిజాం కాలం నాటి పార్లమెంటరీ పార్టీ. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత, హైదరాబాదు ప్రత్యేక ప్రాంతంగా వుండాలని కాంక్షించింది. రజాకార్లు (వాలంటీర్లు), ఒక ముస్లిం పారా-మిలిటరీ సంస్థ. ఇది మజ్లిస్ పార్టీతో సంబంధాలు కలిగివుండేది. దాదాపు లక్షా యాభైవేలమంది రజాకార్లు, కాసిం రిజ్వీ నాయకత్వాన భారత రక్షక దళాలతోనూ కమ్యూనిస్టులతోనూ స్వతంత్ర హైదరాబాద్ కొరకు పోరాడాయి. పోలీస్-యాక్షన్ ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని భారత-యూనియన్ లో కలుపబడింది. కాసిం రిజ్వీని కారాగారంలో బంధించి, శాంతిభద్రతల దృష్ట్యా పాకిస్తానుకు పంపించివేశారు. మజ్లిస్ పార్టీ బ్యాన్ చేయబడింది.[1] 1957లో మజ్లిస్ పార్టీ నూతన హంగులతో పునస్థాపించబడింది. 1970లో రాజకీయ ప్రవేశం గావించింది. ఆల్ ఇండియా అనే ప్రజాస్వామ్య పేరును తగిలించడం జరిగింది. నేటివరకు గల తన ప్రస్థానంలో ప్రజాస్వామ్యయుతంగా తన ఉనికిని కలిగివున్నది.[1] 1990 లో మజ్లిస్ పార్టీ చీలిపోయి, అమానుల్లా ఖాన్ (శాసనసభ్యుడు) నాయకత్వంలో మజ్లిస్ బచావో తెహ్రీక్ అనే గ్రూపు బయలు దేరినది.
ఎన్నికల ఫలితాలుసవరించు
లోక్ సభసవరించు
Year | Seats Contested | Seats Won | Vote Share | Seat change |
---|---|---|---|---|
1989 | 8 | 1 | NA | 0 |
1991 | 2 | 1 | 0.17% | 0 |
1996 | 2 | 1 | 0.10% | 0 |
1998 | 1 | 1 | 0.13% | 0 |
1999 | 1 | 1 | 0.12% | 0 |
2004 | 2 | 1 | 0.11% | 0 |
2009 | 2 | 1 | 0.07% | 0 |
2014 | 5 | 1 | 1.4% | 0 |
ఆంధ్రప్రదేశ్ శాసనసభసవరించు
సంవత్సరం | పోటిచేసిన స్థానాలు | గెలిచిన స్థానాలు | ఓట్ల శతం | సీట్ల మార్పు |
---|---|---|---|---|
1989 | 35 | 4 | 1.99% | - |
1994 | 20 | 1 | 0.70% | 3 |
1999 | 5 | 4 | 1.08% | 3 |
2004 | 7 | 4 | 1.05% | 0 |
2009 | 8 | 7 | 0.83% | 3 |
2014 | 9 | 7 | 1.5% | 0 |
మతవాదం
ప్రస్తుత నాయకులుసవరించు
విమర్శలుసవరించు
తస్లీమా నస్రీన్ పై దాడిసవరించు
ఆగస్టు 9, 2007, తస్లీమా నస్రీన్ తన పుస్తకం "శోధ్" తెలుగు భాషలో ఆవిష్కరిస్తున్న వేదికపై మజ్లిస్ పార్టీ ముగ్గురు శాసనసభ్యులు, కార్యకర్తలు పూలకుండీలు, కుర్చీలతో దాడి చేశారు. తస్లీమా నస్రీన్ ను ఇస్లాం-ద్రోహిగా వర్ణిస్తూ నానా హంగామా సృష్షించారు.[2] వీరికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.[3]