నాస్తికత్వం

(నాస్తికురాలు నుండి దారిమార్పు చెందింది)

భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు, అయితే కొన్ని సార్లు నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని పాటించని వాళ్లుగా చూడొచ్చు. ఉదాహరణకు బౌద్ధమతంలో దేవుడున్నాడనే భావనకు విలువలేదు, కాబట్టి ఆ మతాన్ని ఆచరించే వారందరినీ నాస్తికులుగానే చూడొచ్చు. కమ్యూనిస్టులు ప్రాథమికంగా నాస్తికులై ఉండాలి. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తిక వాదం కూడా అంతే ప్రాచీనం. ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం... ఇలా అనేక అంశాలమీద శతాబ్దాలుగా చర్చ, వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.

పాల్ హెన్రీ 18వ శతాబ్దపు నాస్తికత్వ వాది

నాస్తిక సూత్రాలు

మార్చు
  • ఆస్తికుల దృక్పథం విశ్వంనుంచి ప్రారంభమై మనిషి వరకూ వస్తుంది. నాస్తికుల దృక్పథం మనిషినుంచి ప్రారంభమై విశ్వంవైపు వెళ్తుంది.
  • ఆస్తికులు కష్టనష్టాలకు దేవుడిని, సంఘాన్ని, ప్రభుత్వాన్ని కారకులుగా భావిస్తారు. ఆస్తికులు తాము సంఘంలో ఒక భాగం అనుకొంటారు. అయితే నాస్తికులు సంఘం, ప్రభుత్వం... వంటివన్నీ తమలో ఒక భాగంగా భావిస్తారు. అందువల్ల నాస్తికులకు జీవితం పట్ల స్తబ్దత పోయి శ్రద్ధ కలుగుతుంది! తామ చేసే ప గురించి ఆలోచిస్తారు. వాస్తవిక విజ్ఞాన దృష్టి పెరుగుతుంది. సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. సామాజిక దృష్టి ఎక్కువవుతుంది. నాస్తికులకు యుద్ధాలు, దౌర్జన్యాలు పట్ల ఆసక్తి ఉండదు. సాటి మనుషులపట్ల ద్వేషం ఉండదు. మత కలహాలుండవు. నియంతృత్వ భావనలుండవు. సమానత్వం, స్వేచ్ఛ, వాస్తవిక విజ్ఞానం, నీతివర్తనం అలవడతాయి.
  • ప్రభుత్వం ఏదైనా ప్రజలందరికీ సమానమే. వారు ధనికులైనా, పేదలైనా ఏ కులం, మతం, జాతికి చెందినవారైనా వృద్ధులు, పురుషులు, స్త్రీలు... ఎవరైనా అందరికీ సమానంగా చెందుతుంది. అయితే ఆస్తికులు తమ బానిస ప్రవృత్తివల్ల అలా ఆలోచించక అది కొందరికే చెందిందనుకుంటారు. నాస్తికులు అందుకు భిన్నంగా ఆస్తికులు ప్రభుత్వం ద్వారా సాధించలేని ఫలితాలను సాధించగలుగుతారు.
  • ధనికులు నాస్తికులవడానికి ఇష్టపడరు. పైగా నాస్తికత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారికి దేవుడిమీద నమ్మకమున్నా లేకున్నా ప్రజల్లో మత విశ్వాసాలను మాత్రం పోషిస్తారు. అసమానతలు తొలగిపోకూడదన్నదే వారి లక్ష్యం.
  • ఎవర్నీ దేవుడు సృష్టించలేదు. అసలుంటే కదా ఆయన సృష్టించడానికి మానవుల కష్టాలకీ - దేవుడికీ ఏవిధమైన సంబంధం లేదు. ఎంతో కాలంనుంచీ దేవుళ్లని ప్రార్థిస్తున్నవారు తమ కష్టాల్ని దేవుడు తీర్చాడని నిరూపించగలరా? ఎక్కడాలేని దేవుడు కష్టాలు ఎలా తీరుస్తాడు?
  • ఈ మతాలు కలిగించే భావదాస్యమే ఆర్థిక దాస్యానికి కారణం. ప్రజల్లో మూఢనమ్మకాలు, మతభావాలు లేకుండా చెయ్యగలిగితే దోపిడీ దానంతట అదే పోతుంది.
  • ప్రకృతిలో నియమాలంటూ లేవు. మానవుడు ప్రకృతిని చూసి తన బుద్ధి కుశలత వలన దాన్ని అర్థంచేసుకుంటున్నాడు. అప్పుడు కొన్ని నియమాలు ప్రకృతికి ఉన్నాయని ఊహించి, వాటిని ప్రకృతికి ఆరోపించి వాటి ద్వారా ప్రకృతిని అర్థం చేసుకొంటున్నాడు.
  • భారతదేశం లాంటి దేశంలో పుట్టి నాస్తికులుగా ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కేవలం దేవుడి ఆంక్షల వల్లే సంభవిస్తున్నాయని నమ్మే మనుషుల మధ్య ఉంటూ తార్కిక ధోరణి అలవరచు కోవటం నిజంగా గొప్ప విషయమే..ఎంత తక్కువ వయసులో ఈ ధోరణి మనకు అలవడింది అనేది మన జీవిత వికాసానికి ఆనందానికి మూలనగా ఉంటుంది...

నాస్తికత్వం వల్ల ప్రతికూలతలు

మార్చు
  • జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనపుడు దాని పరిష్కారం దొరకణుపుడు ఎదురయ్యే వత్తిడిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది.. దీనికి చాలా హేతుబద్దంగా ఆలోచిన్చగలిగే పరిపక్వత చాలా అవసరం.. ఇది లేని వాళ్ళు ఆ భారాన్నంతా దేవుడి పి వేసి జీవితాన్ని సాగిస్తుంటారు..
  • దేవుడి పేరుతో లేదా ఆచారాలు సంప్రదాయాల పేరుతో ఇతరుని మోసం చేసేవారిని చూస్తే విపరీతమయిన కోపం కలిగి అది మన ఆరోగ్యానికి నఅష్టాన్ని కలిగించును..
  • మన జీవితాలను ఎవరూ నియంత్రించటం లేదని, కేవలం మన చుట్టూ ఉన్న మనుషులు లేదా మనం ఫైనాన్సియల్ గా, ఎమోషనల్ గా ఆధారపడ్డ వల్లే మన జీవితాన్ని కంట్రోల్ చేయగలుగుతారు.. కావున సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్ గా జీవితాన్ని ముఖ్యంగ ఆర్థిక పరంగా మన మీద మనం ఆధారపడాలి..
  • ఆస్తికులైన బందు మిత్రుల మధ్య ఇమడటం కొంచెం ఇబ్బందే.. కావున వారితో దేవుడి గురించి వాగ్వాదానికి దిగి సంబంధాన్ని తెంచుకోవడం కంటే, వారి మూర్కత్వన్ని నాస్తికులే అర్తం చేసుకొనే జీవితాన్ని సాగించడం మేలు.ముఖ్యంగ మధ్య తరగతి కుటుంబాలలో ఈ విధానం మరి మంచిది..
  • ప్రతి మానవుడు తన దైనందిన జీవితంలో చేసే పనులకు వాస్తవికతను జోడించి ఆలోచిస్తే అర్ధమౌతుంది. ఫలితం మనం చేసే పనులద్వార జరుగుతుందని అప్పుడు దైవం దేవుడు అనే మాటలపై ఆలోచన ఉండదు.
 ఆస్తికత ఎవరికి ఇబ్బంది కలిగించదు.

తెలుగు హేతువాదులు, నాస్తికులు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు