చర్చ:తెలుగుదనం
తెలుగు వికీపీడియాలో మొదటి వ్యాసం ఇది, మొలకలను రక్షించడానికి మొలక స్థాయి దాటింపు కొరకు విస్తరణ చేశాను.YVSREDDY (చర్చ) 07:33, 12 మే 2020 (UTC)
- YVSREDDY గారు, ఇది వికీపీడియాలో తొలి వ్యాసం అనడానికి ఆధారం ఏమిటి..? Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:47, 13 మే 2020 (UTC)
తెలుగుదనం వ్యాసమును తెలుగు సంస్కృతిలో విలీనం చేయమని మూస పెట్టినందున
మార్చు- రెండు వ్యాసాలు ఒకటే అయితే మొదట ప్రారంభించిన వ్యాసంలో తరువాత ప్రారంభించిన వ్యాసం విలీనం జరగాలి. అదీగాక తెలుగు వికీపీడియాలో మొదటి వ్యాసం ఇది. YVSREDDY (చర్చ) 05:03, 13 మే 2020 (UTC)
- ఈ వ్యాసాన్ని బయటకు తీసుకువచ్చి పెద్ద తప్పిదమే చేసినట్టున్నాను. అసలు వీలేలేదు, అసలు వీలేకాదు అని మొండి పట్టు పడితే తప్పక వీలయితే రెండు వ్యాసాలు వేరువేరుగా ఉంచండి.YVSREDDY (చర్చ) 05:21, 13 మే 2020 (UTC)
- విలీనం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రతి విషయానికీ ఆంగ్ల వికీపీడియాను ప్రామాణికంగా తీసుకునే మనం ఈ విషయంలో ఎందుకు శ్రద్ధ వహించడం లేదో అర్థం కావడం లేదు. ఇంగ్లీషులో మొట్టమొదటి మూడు ఎడిట్లను కాపాడుకుని ఉన్నారు. అలాగే మొదటి ఆర్టికల్ మొన్నమొన్నటి వరకు అంటే 25 ఏప్రిల్ 2020 వరకు సవరింపబడి 11 వందలపైచిలుకు ఎడిట్లతో 14 కిలోబైట్లతో అభివృద్ధి చెందింది. వీలైతే ఈ ఆర్టికల్‌ను కూడా అలా అభివృద్ధి చేయాలి. లేకుంటే తెలుగు వికీపీడియా చారిత్రిక ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పుడున్న విధంగానే ఉంచనివ్వాలి. ఎవరో సిగ్గుతో తలదించుకుంటున్నారని ఈ వ్యాసాన్ని మరో వ్యాసంలోనికి విలీనం చేయాల్సిన అవసరం లేదు.--స్వరలాసిక (చర్చ) 01:24, 14 మే 2020 (UTC)
- స్వరలాసిక గారూ నామీద గౌరవంతో పేరు ప్రస్తావించకుండా ఎవరో సిగ్గుతో తలదించుకుంటున్నారని ఈ వ్యాసాన్ని మరో వ్యాసంలో విలీనం చేయాల్సిన అవసరంలేదు అని పరోక్షంగా అన్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.ఇక వ్యాసం విలీనం సంగతికి వద్ద్దాం.
మీరు వెలిబుచ్చిన అబిప్రాయాలపై నాకు కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి. 1.మనం ప్రతిదానికి ఆంగ్ల వికీపీడియాను ప్రామాణికంగా తీసుకుంటున్నాం.మనం ఈ విషయంలో ఎందుకు శ్రద్ద వహించడంలేదో అర్థం కావటంలేదు అని అన్నారు.దీనికి నా సందేహాలు.
---నిజంగా మనం పాటిస్తున్నామా!ఒకసారి అన్ని విషయలలో పరిశీలించండి. ఆంగ్ల వికీపీడియాలో పరభాషతో వ్యాసాలు ఉండవు.కానీ మన తెలుగు వికీపీడియాపుట్టి 16 సంవత్సరాల అయినా, ఇంకా ఆంగ్ల భాషతో, ఆంగ్ల పేరాలతో ఇప్పటికీ వ్యాసాలు ఉన్నమాట వాస్తవంకాదా?.గత కొద్దికాలం క్రిందట గౌరవ వికీపీడియన్లు దృష్టికి నేను తీసుకువెళ్లటంజరిగింది.అది వాస్తవమో కాదో మీకు తెలుసు.తెలుగు వికీపీడియాలో రెండు లేదా మూడు వాక్యాలలో వ్యాసాలు ఉంటాయి.మూలాలు ఉండవు.భాష సరిగా ఉండదు.అలా రాసిన, రాస్తున్న వ్యాసాలును నిర్వాహకులు సరియైన నియంత్రణలో ఉంచటానికి తీసుకునే చర్యలు తప్పంటారా?
2.అలాగే మొదటి ఆర్టికల్ మొన్నమొన్నటి వరకు అంటే 25 ఏప్రిల్ 2020 వరకు సవరింపబడి 11 వందలపైచిలుకు ఎడిట్లతో 14 కిలోబైట్లతో అభివృద్ధి చెందింది. వీలైతే ఈ ఆర్టికల్‌ను కూడా అలా అభివృద్ధి చేయాలి. లేకుంటే తెలుగు వికీపీడియా చారిత్రిక ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పుడున్న విధంగానే ఉండనివ్వాలి. ఎవరో సిగ్గుతో తలదించుకుంటున్నారని ఈ వ్యాసాన్ని మరో వ్యాసంలోనికి విలీనం చేయాల్సిన అవసరం లేదు అనే అబిప్రాయంపై వివరణ
---తెలుగుదనం వ్యాసం మీరన్నట్లు వికీపీడియాలో మొదటి వ్యాసం అయిఉంటే, ఆ వ్యాసాన్ని మనం ఎంతవరకు అబివృద్ది చేసామో నేను ఇంతకుమందే వివరించాను.నిజంగా అదే మొదటి వ్యాసం అయితే ఇప్పటికీ అది అలా ఉన్నందుకు నిజంగానే సిగ్గుపడుతున్నాను.మీరన్నట్లు అదే మొదటి వ్యాసం అయితే ఇప్పడైనా దానిని అభివృద్దిచేసి ఎప్పటికీ అది తొలగించకుండా, జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేనూ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.ఒకవేళ ఆ వ్యాసం మొదటి వ్యాసం కాకపోతే తెలుగుదనంలో, తెలుగు సంస్కృతిని విలీనం చేయాలా, లేదా తెలుగు సంస్కృతిని, తెలుగుదనంలో విలీనం చేయాలా అనేది మన ఇద్దరి ఇష్ట ఇస్టాలకు లోబడి కాదుగదా? అది సముదాయం లేదా మెజారిటీ వాడుకరుల నిర్ణయాలకు లోబడి ఉంటుంది.నేను ఆనిర్ణయాలకు కట్టుబడి ఉంటాను.ధన్యావాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:36, 14 మే 2020 (UTC)
- యర్రా రామారావుగారూ! "నిజంగా అదే మొదటి వ్యాసం అయితే ఇప్పటికీ అది అలా ఉన్నందుకు నిజంగానే సిగ్గుపడుతున్నాను." అని అన్నారు. అసలు మీరెందుకు సిగ్గుపడాలి? అలా అన్నారంటే ఇంత వరకు ఆ వ్యాసానికి మార్పులు చేసిన వెన్నా నాగార్జున, వైజాసత్య, చదువరి, వీవెన్, వేమూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర మొదలైన వారిని అవమానించినట్టే లెఖ్ఖ. వారు చేసిన మార్పులకు కొనసాగింపుగా ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేయగలిగితే చేయగలగాలి కాని ఎవరూ చేయట్లేదని వగస్తే ఏం లాభం?మన పూర్వీకులైన ఆదిమానవులు ఆకులూ అలములు తినేవారని, దిసమొలతో తిరిగేవారని ఇప్పుడు మనం సిగ్గుపడితే ఎలా ఉంటుంది? (ఈ పోలిక ఛండాలంగా ఉందని తెలుస్తూనే ఉంది. :-) ) ఈ వ్యాసం తొలి వ్యాసం కాదని చదువరిగారు ఎటూ తేల్చేశారు కనుక ఈ చర్చను ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వ్యాసం కొనసాగాలో, విలీనం చేయాలో, తొలగించాలో సముదాయం నిర్ణయించగలదు.--స్వరలాసిక (చర్చ) 07:07, 14 మే 2020 (UTC)
- గౌరవ వికీపీడియన్లును నేను ఎవ్వరినీ అవమానించాలనే అభిప్రాయం ఇప్పడేకాదు, ఎప్పుడూ ఉండదు.అలా భావన కలిగిస్తే నేను శిరస్సు వంచి క్షమాపణలు చెప్పటానికి ఎప్పటకీ వెనకాడను.చర్చ వక్రమార్గాలకు మళ్లించుచున్నందున నేనూ ఈ చర్చను ముగిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:41, 14 మే 2020 (UTC)