చర్చ:నాయిని నర్సింహరెడ్డి ఉక్కు వంతెన
వాక్య నిర్మాణంలో దోషం
మార్చుఈ వ్యాసాన్ని సృష్టించిన క్రమంలో వాక్య నిర్మాణం సరిచూడకపోవడంతో '...ప్రాంతాలకు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరనుంది' అని రాయాల్సిన దానికి బదులుగా '...ప్రాంతాలకు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరింది' అని రాశాను. ఇది గమనించిన @మురళీకృష్ణ గారు వికీపీడియా లోని "ఈ సభ్యునికి ఈ-మెయిల్ పంపు" ఫంక్షను ద్వారా పంపించిన మెయిలులో "ఇందిరాపార్కు– వీఎస్‌టీ స్టీలు బ్రిడ్జి ప్రారంభం కాకుండానే ట్రాఫిక్ సమస్య తీరింది అని రాసారు. గమనించగలరు." అని రాశారు. వ్యాస రచనలో జరిగిన తప్పును గ్రహించిన నేను వెంటనే ఆ వాక్యాన్ని '...ప్రాంతాలకు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరనుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది' గా సరిచేయడం జరిగింది. వాక్య నిర్మాణంలో జరిగిన తప్పును నాకు తెలియపరిచి, వ్యాస తటస్థ దృక్కోణం విషయంలో నాకు సహకరించిన మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:29, 6 జూలై 2023 (UTC)
- మీకూ ధన్యవాదాలు.. Muralikrishna m (చర్చ) 16:46, 6 జూలై 2023 (UTC)