చర్చ:పద్మా దేవేందర్ రెడ్డి

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

వాడుకరి:Pranayraj1985‎ గారూ, కరీంనగర్ జిల్లాలో నామాపూర్ ఉన్నట్టు నాకు కనబడలేదు. అందుకే జన్మస్థలం తెలియని వర్గంలో చేర్చాను. మండలం వివరం చేరుస్తారా? దాన్ని బట్టి వర్గాలు చేరుస్తాను.__చదువరి (చర్చరచనలు) 11:26, 16 జూలై 2019 (UTC)Reply

చదువరిగారు మీరు చెప్పింది నిజమే. జిల్లాల పునర్య్వస్థీకరణ తరువాత కొన్ని గ్రామాలు, మండలాలు వేరువేరు జిల్లాలకు మారడం జరిగింది. ఆంగ్ల వికీపీడియా వ్యాసం నుండి జన్మస్థలం పేరును తీసుకున్నాను. నాకు కూడా పూర్తి సమాచారం తెలియదు. అయితే వాడుకరి:C.Chandra Kanth Rao గారి బ్లాగులో కరీంనగర్ జిల్లా రాంపూర్ గ్రామంలో జన్మించినట్టుగా ఉంది. చంద్రకాంతరావు గారు పూర్తి వివరం అందించగలరు అనుకుంటున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:41, 16 జూలై 2019 (UTC)Reply
నేను నా బ్లాగులో రాజకీయ నాయకుల వ్యాసాలు రచించేటప్పుడు అప్పుడు ఎన్నికల సమయంలో వార్తాపత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఇప్పుడు అంతర్జాలంలో శోధిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకటికంటే అధికంగా రాంపూర్ గ్రామాలున్నట్లుగా తెలుస్తోంది. కాని కరీంనగర్ నగర శివారులో ఉన్న రాంపూర్ సరైనది కావచ్చునని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె 2004 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫడవిట్‌లో హైస్కూల్ విద్యాభ్యాసం కరీంనగర్‌లో జరిగిందని ఉంది. కరీంనగర్‌లో పద్మాదేవేందర్ అభ్యసించిన వాణినికేతన్ గల్స్ హైస్కూల్ కూడా రాంపూర్ సమీపంలోనే ఉన్నట్లుగా గూగుల్ మ్యాప్స్ ప్రకారం తెలుస్తోంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:40, 16 జూలై 2019 (UTC)Reply
Return to "పద్మా దేవేందర్ రెడ్డి" page.