చర్చ:పనస పొట్టు కూర
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
పవన్ సంతోష్ గారూ, ఈ వ్యాసంలో రాసిన తయారు చేయు విధానం వికీ విధానానికి అనుగుణంగా లేదని నా ఉద్దేశం. అయితే మిగతా విశేషాలు పనికివస్తాయి. ఆ కూర ప్రశస్తి గురించి రాయాలి. పనసను తరగడంలోని ప్రత్యేకతలు (చేతులకు నూనె రాసుకోవడం వంటివి), ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటారు, పోషకవిలువలు, జనసామాన్యంలో/సాహిత్యంలో దీనికి ఉన్న చోటు ("పుస్తెలమ్మయినా పులస కూర తినాలి", "వంకాయ వంటి కూరయు" లాగా), వంటివి రాస్తే వ్యాసానికి విలువ చేకూరుతుంది. పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 04:47, 19 జూలై 2018 (UTC) పనసపొట్టు కూర
- సరేనండీ. ఓ వారంలోపు దీన్ని సరిదిద్దుతాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:55, 19 జూలై 2018 (UTC)
- బ్లాగు లింకు మూలంగా వాడారు. దానితో పాటు అందులోనుంచి కాపీ పేస్టు చేసిన సమాచారం ఏదైనా ఉంటే తొలగించాలి. రవిచంద్ర (చర్చ) 12:12, 19 జూలై 2018 (UTC)
- ఆయన తాయారు చేస్తే నేను తయారు చేశానండీ రవిచంద్ర గారూ! :-) పిండితార్థం ఏమంటే బ్లాగు మూలం ఇవ్వడం, వికీపీడియా పరిధిలో ఒదగనివి రాయడం తప్ప కాపీ చేయలేదండీ.--పవన్ సంతోష్ (చర్చ) 18:53, 21 జూలై 2018 (UTC)
- బ్లాగు లింకు మూలంగా వాడారు. దానితో పాటు అందులోనుంచి కాపీ పేస్టు చేసిన సమాచారం ఏదైనా ఉంటే తొలగించాలి. రవిచంద్ర (చర్చ) 12:12, 19 జూలై 2018 (UTC)