చర్చ:పాత కడప
తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: త్రివిక్రమ్
పాత కడప అనేది దేవుని కడప గా వ్యవహరించబడుతున్నది. కావున ఈ వ్యాసాన్ని ఆ పేరుకు తరలిస్తే సమంజసంగా ఉంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:12, 5 ఆగష్టు 2013 (UTC)
- పాతకడప అనేది రెవిన్యూ గ్రామం.దేవుని కడప పేరుతో ఆలయం వ్యాసం పేజి ఉంది.తరలిస్తే రెవెన్యూ గ్రామం మరుగున పడుతుంది.కడప మండలంలోని గ్రామాలు మూసలో దేవాలయం వ్యాసం పేజికి లింకు వెళుతుంది.కావున ఇలా ఉండటమే సమంజసం.--యర్రా రామారావు (చర్చ) 15:50, 14 నవంబర్ 2018 (UTC)
పై చర్చలో పాత కడప రెవెన్యూ గ్రామం అని పొరపాటున తెలుపటమైంది.కానీ ఇది రెవెన్యూయేతర గ్రామం.కడప మండలంలో ఎటువంటి రెవెన్యూ గ్రామాలు లేవు.--యర్రా రామారావు (చర్చ) 16:17, 1 అక్టోబరు 2022 (UTC)
- పాత కడప వేరు, దేవుని కడప వేరు. కడప కార్పొరేషన్ ఏర్పడక ముందు పాత కడప అనేది రెవెన్యూ గ్రామంగా ఉండేది. ఆ గ్రామ పరిధిలోని రెవెన్యూయేతర గ్రామం దేవుని కడప (దేవుని కడప అంటే కేవలం దేవాలయం కాదు. ఆ ఆలయం ఉన్న గ్రామం పేరు దేవుని కడప). ప్రస్తుతం ఈ రెండు గ్రామాలూ ఉనికిలో లేవు. కడప కార్పొరేషన్లో కలిసిపోయినాయి. కానీ ఆయా ప్రాంతాలకు ఇప్పటికీ పాత పేర్లే వాడుకలో ఉన్నాయి. - త్రివిక్రమ్ (చర్చ) 16:43, 2 జూన్ 2023 (UTC)