చర్చ:పాబ్లో ఎస్కోబార్
పాబ్లో ఎస్కోబార్ ప్రస్తుతం మంచి వ్యాసం ప్రతిపాదనలో ఉంది. ఈ వ్యాసాన్ని మంచి వ్యాసం ప్రమాణాలకు అనుగుణంగా సమీక్షించేందుకు ఒక ఎడిటరు సుముఖత చూపారు. ఈ వ్యాసంలో కృషి చెయ్యని ఎడిటర్లు ఎవరైనా కూడా వ్యాసాన్ని సమీక్షించి, తమ సూచనలనుసమీక్షా పేజీలో రాయవచ్చు. కానీ, వ్యాసం మంచిదో కాదో నిర్ణయించే అధికారం మాత్రం మొదటి సమీక్షకుడిదే. పవన్ సంతోష్ (చర్చ), 12:31, 5 ఆగస్టు 2018 (UTC) న ప్రతిపాదించారు. |
నెట్‌ఫ్లిక్స్‌లో ఎస్కోబార్ జీవితంపై సీరీస్
మార్చునెట్ఫ్లిక్స్లో గత ఏడాది ఎస్కోబార్ జీవితం గురించి 2015-ఇప్పటివరకూ దాదాపు నాలుగు సీజన్ల సీరీస్ తెరకెక్కించి, మూడిటిని విడుదల చేసింది. చెరొక 10 ఎపిసోడ్లు కలిగిన ఈ మూడు సీజన్లు మంచి విజయం అందుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ద్వారా తెలుగు వారు కూడా ఈ సీజన్లు చూస్తూన్నారు. నార్కోస్ అన్న కీవర్డుతో వెతికితే తెలుగు వెబ్‌సైట్లు ఈ సీరీస్ గురించి రాసిన విషయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అలా స్థానికంగా ఆసక్తిదాయకమై ఉండీ, మరోవైపు తప్పనిసరిగా ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితాలో చోటుచేసుకున్న ఈ పాబ్లో ఎస్కోబార్ వ్యాసాన్ని ఈవారం వ్యాసానికి ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:40, 9 జూలై 2018 (UTC)
- పవన్ సంతోష్గారూ, మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది అయిన ఈ పాబ్లో ఎస్కోబార్ వ్యాసం మొదటి పేజీలో వికీ విధానాల ప్రకారం ప్రచురణకు అనుగుణంగా అన్ని అంశాలు ఉన్నప్పటికీ అతను మత్తుపదార్థాల అక్రమవ్యాపారి, నార్కో తీవ్రవాది అయినండున మొదటి పుటలో ప్రచురించవచ్చా? తెలియజేయగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 07:07, 9 ఏప్రిల్ 2020 (UTC)
- నిరభ్యంతరంగా ప్రచురించవచ్చునని నా ఉద్దేశం కె.వెంకటరమణ గాదు. ఈవావ్యా కోసం, వ్యాసం బాగుందా లేదా, దినుసులన్నీ ఉన్నాయా లేదా అనేది మనకు ముఖ్యం. వ్యాస విషయం మంచిదా కాదా అనే దాన్ని గణించకూడదు -ఒక్క అశ్లీలపు టంచుల్లో తచ్చాడుతూ ఉండే విషయాలు తప్పించి. __చదువరి (చర్చ • రచనలు) 11:12, 9 ఏప్రిల్ 2020 (UTC)
- చదువరి గారూ ధన్యవాదాలు. ప్రచురించాను.--కె.వెంకటరమణ⇒చర్చ 11:32, 9 ఏప్రిల్ 2020 (UTC)
- నిరభ్యంతరంగా ప్రచురించవచ్చునని నా ఉద్దేశం కె.వెంకటరమణ గాదు. ఈవావ్యా కోసం, వ్యాసం బాగుందా లేదా, దినుసులన్నీ ఉన్నాయా లేదా అనేది మనకు ముఖ్యం. వ్యాస విషయం మంచిదా కాదా అనే దాన్ని గణించకూడదు -ఒక్క అశ్లీలపు టంచుల్లో తచ్చాడుతూ ఉండే విషయాలు తప్పించి. __చదువరి (చర్చ • రచనలు) 11:12, 9 ఏప్రిల్ 2020 (UTC)