చర్చ:ప్రపంచ సాంస్కృతిక మండలాలు
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వాడుకరి:Pavan santhosh.s గారు, ఈ ప్రపంచ సాంస్కృతిక మండలాలు వ్యాసంలో క్రింది image files లను ఏ కారణం చేత తొలగించారో నాకు సరిగా అర్ధం కాలేదు. నేను ఇంగ్లీష్ వికీ లోని బొమ్మలనే కదా తీసుకొన్నాను. వాటిని ఎడిట్ చేసి తెలుగు వ్యాసానికి అనుగుణంగా సాదాఫామ్ పై తెలుగుపేరుతో అప్లోడ్ చేసి ఈ వ్యాసంలో ఉపయోగించాను.
- దస్త్రం:Arab or Islamic Cultural Realm SWAs+NAf Deblij Classification.png|thumb|అరబ్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు ని తొలగించి File:Greater Middle East (orthographic projection).svg|thumb|అరబ్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలు ను చేర్చారు.
- అలాగే దస్త్రం:African Negrito Cultural Realm (నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండలం) (Sub Saharan Cultural Realm) Deblij Classification.png|thumb|నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండల ప్రాంతం ని తొలగించి File:Africa (orthographic projection).svg|thumb|నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండల ప్రాంతం ను చేర్చారు.
- దస్త్రం:Anglo American Cultural Realm (ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండలం).png|thumb|ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండల ప్రాంతం ను తొలగించి File:Anglo America (orthographic projection).svg|thumb|ఆంగ్లో-అమెరికన్ సాంస్కృతిక మండల ప్రాంతం చేర్చారు.
- దస్త్రం:Chinese Cultural Realm (చైనీస్ సాంస్కృతిక మండలం).png|thumb|చైనీస్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలును తొలగించి File:East Asia (orthographic projection).svg|thumb|చైనీస్ సాంస్కృతిక మండలంలోని ప్రాంతాలును చేర్చారు.
పొరపాటు నా వైపు నుండి ఎక్కడ జరిగిందంటారు? mistake తెలిస్తే, అది మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడగలను.--Vmakumar (చర్చ) 21:10, 22 అక్టోబరు 2020 (UTC)
- ఆంగ్ల వికీపీడియా నుంచి కాదండీ మీరు బొమ్మల్ని తెచ్చింది. కామన్స్ అన్న ప్రాజెక్టు ఒకటి ఉంది. ఇప్పటికే వికీమీడియా కామన్స్ అన్న ప్రాజెక్టు లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని అవగాహన చేసుకోకుండా జరిగిన మార్పులు కావడంతో ఇలా మార్చాల్సి వచ్చింది. అంతేకాక, ఇలా మార్చడానికి ముందే ఒక దస్త్రపు చర్చలో మిమ్మల్ని పింగ్ చేసి అడిగాను ఎందుకు చేస్తున్నారని. నాకు సమాధానం రాలేదు. సర్లెమ్మని ఇక్కడ మార్పుచేర్పులు చేశాను. అదలా ఉంచితే- వికీమీడియా కామన్స్ అన్నది స్వేచ్ఛా కాపీరైట్లలో ఉన్న ఫోటోలు, బొమ్మలన్నిటినీ సెంట్రల్‌గా ఉంచే రిపాజిటరీ. అక్కడి బొమ్మల లింకులు వికీమీడియా ప్రపంచంలో ఎక్కడైనా (తెలుగు వికీపీడియా సహా) ప్రదర్శితమవుతాయి. అక్కడ ఇప్పటికే ఒక బొమ్మ ఉంటే దాన్నే వాడుకోవడం మెరుగు తప్పించి తిరిగి తెలుగు వికీపీడియాలో చేర్చనక్కర లేదు. చాలా వరకూ బొమ్మలు ఎస్‌విజి ఫార్మాట్‌లో ఉండగా మీరు వాటిని పీఎన్‌జీకి మార్చి యధాతథంగా తెలుగు క్యాప్షన్లు, టైటిళ్ళతో ఎక్కించారు. ఎందుకో అర్థం కాలేదు, నేను మార్చినవి ప్రధానంగా ఇలాంటి బొమ్మల్నే.
- అలానే ఒకవేళ మీరు ఉన్న బొమ్మకు మీరు అవసరానికి తగ్గ మార్పుచేర్పులు చేసివుంటే ఆ దాన్నే సోర్సుగా ప్రకటిస్తూ వికీమీడియా కామన్సులోనే ఎక్కించడం మంచి పద్ధతి. మీరు ఎక్కించిన బొమ్మను కావాలనుకుంటే ఇతర భాషల వికీపీడియాల్లో తిరిగి వాడుకో గలుగుతారు. ఇప్పుడు మీరు ఎక్కించిన బొమ్మలను కామన్సుకు తరలించాలని నేను చేసిన ప్రయత్నాలు కూడా ఫలప్రదం కాలేదు. స్థానికంగా దస్త్రాలు ఎక్కించే ఏర్పాటు ఉన్నది ప్రధానంగా కాపీహక్కుల పరిధిలో ఉండి, ఫెయిర్ యూజ్ పాలసీ కింద నాణ్యత తగ్గించి వాడుకునే ఫోటోలు, బొమ్మల కోసమే. సాధ్యమైనంత చెప్పాను. దీనిని సవ్యంగా అర్థం చేసుకోవడానికి పైన ఇచ్చిన వికీమీడియా కామన్స్ లింకులో చదవి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 12:02, 23 అక్టోబరు 2020 (UTC)