బంగాళదుంప వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 41 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మూలాలు మార్చు

ఈ వ్యాసంలో మూలాలు ఇవ్వలేదు. "ఈనాడు" ఆదివారం అనుబంధంలో వచ్చిన "బంగాళదుంప" వ్యాసం ఆధారంగా ఇందులో కొంత భాగం కూర్చబడిందని నా అనుమానం. అలాగయితే ఆ వ్యాసాన్ని "వనరులు" లో పేర్కొంటే సరిపోతుంది. "ఈనాడు"లో ఆ వ్యాసం కూర్పుకు ప్రధానంగా కృషి చేసిన శర్మగారు తెలుగు వికీకి మంచి మిత్రులు కూడాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:20, 25 సెప్టెంబర్ 2008 (UTC)

"వనరులు"లో పేర్కొంటే భవిష్యత్తులో కొంత ఇబ్బంది వచ్చే ప్రమాదముంది. ఏ మూలమైనా ముఖ్యమైన వాక్యాల చివరనే ఉండాలి. ఎందుకంటే ఏ వ్యాసమైనా ఇప్పటితోనే ఆగిపోయేది లేదు. మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉంటాయి. వేరే వనరులనుంచి సేకరంచిన వివరాలు కూడా ఇదే "వనరులు" అనే అర్థం వస్తుంది. కాబట్టి వ్యాసం మొత్తానికి వనరులు విభాగంలో చేర్చడం బాగుండదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:59, 8 అక్టోబర్ 2008 (UTC)
అవును. నేను ఏకీభవిస్తాను. నా వుద్దేశం ఈ వ్యాసానికి మూలాలు వ్రాయలేదు గనుక ఆ రచయితలు కనీసం వనరుగా నైనా ఆ వ్యాసం పేర్కొంటే బాగుంటుందని. ఏమయినా వ్యాసంలో (అశోక చక్రవర్తికి, మొగలాయి పాలకులలో చాలామందికి, అంతెందుకు, అజంతా-ఎల్లోరాలలో రమ్యమైన చిత్రాలను చిత్రించిన చిత్రకారులకు, బంగాళదుంప రుచి తెలియదు) కొన్ని వాక్యాలు తొలగించుదాము --కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:10, 8 అక్టోబర్ 2008 (UTC)
తాత్కాలికంగా అలా పేర్కొనడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. వ్యాసంలో ఒక్క రెఫరెన్సు కూడా ఉండనప్పుడు అలా ఉంచి ఆ తర్వాత తొలిగిస్తే సరిపోతుంది. మీరన్నట్టు వికీ ప్రమాణాలకు అనుగుణంగా లేని "కొన్ని" వాక్యాలు కూడా తొలిగించాలి. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:26, 8 అక్టోబర్ 2008 (UTC)
నా ఉద్దేశ్యంలో వనరులకు మూలాలకు తేడా ఉంది. వనరులు ఇంకా విషయం కావలసి వస్తే సభ్యులు చూసుకునేందుకు వాడతారనుకుంటా, కానీ మూలాలు విషయ నిర్దారణకు వాడాలి. δευ దేవా 21:30, 8 అక్టోబర్ 2008 (UTC)

బంగాళదుంప చరిత్ర మార్చు

బంగాళాదుంప చరిత్ర చదివిన తరువాత, చాలాకాలం క్రితం, అంటే 2008 ప్రాంతాల్లో "మింట్" (Mint) అనే ఆంగ్ల Financial పత్రికలో ఈ విషయం మీద వారి శనివారం మాత్రమే వేశే ప్రత్యేక వ్యాసం గుర్తుకు వస్తున్నది. ఆ వ్యాసంలో ఉన్న విషయాలు బంగాళాదుంప చరిత్రలో ఉట్టంగించారని నా ఉద్దేశ్యం.

Return to "బంగాళదుంప" page.