చర్చ:మధ్యాహ్న భోజన పథకము

తాజా వ్యాఖ్య: కామరాజ్ నాడార్ సంఘటన టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

కామరాజ్ నాడార్ సంఘటన

మార్చు

ఈ వ్యాసంలో కామరాజ్ నాడార్ కి మధ్యాహ్న భోజన పథకం ఆలోచన ఎలా వచ్చింది అనే కథనం ఉన్నది. దీనికి ప్రస్తుతం మూలం పేర్కొనలేదు. ఒకవేళ మూలం ఉన్నా కూడా ఇది ఈ వ్యాసంలో ఉంచదగింది కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది కామరాజ్ నాడార్ జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఆయన జీవిత శైలిని తెలిపే అత్యంత డీటెయిల్డ్ వివరం. ఒకవేళ ఈ పథకం మొత్తం ఈ సంఘటన మీదే ఆధారపడి ఉన్నా దీనిని ఉంచవచ్చని వాదించవచ్చు. స్వాతంత్ర్యం రాక మునుపు నుంచి ఇలాంటి పథకాలు ఉన్నాయి. కాబట్టి ఆ భాగాన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. చదువరి గారూ మీ అభిప్రాయం ఏమిటి? రవిచంద్ర (చర్చ) 09:28, 7 మార్చి 2019 (UTC)Reply

చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈ విభాగం నేను చేర్చిందే. :-) కానీ అది అనుభం, వికీ పాలసీలు పూర్తిగా అవగావన లేని సమయంలో రాసినది. బహుశ ఆంగ్ల వికీలో ఉన్నది యదాతథంగా అనువదించి రాసి ఉండవచ్చనుకుంటా. ఇప్పుడు అంతగా అవసరం అనిపించడం లేదు. రవిచంద్ర (చర్చ) 11:03, 7 మార్చి 2019 (UTC)Reply
రవిచంద్ర గారూ, నేను కూడా ఆ సంఘటన మూలాల కోసం వెతికాను. ప్రతీ చోటా ఇలా జరిగిందట అని ఉందేగాని, విశ్వసనీయ మూలం దొరకలేదు. కాబట్టి తీసెయ్యాల్సిందే ననుకుంటా. పోతే, ఈ లింకు చూడండి. యథాతథంగా ఇది పనికిరాకపోయినా, అందులో ఇచ్చిన మూలాలు పనికి రావచ్చు. __చదువరి (చర్చరచనలు) 13:40, 7 మార్చి 2019 (UTC)Reply
పిడిఎఫ్ లింకులో ఉన్నది నేను అనువదించిన ఆంగ్ల పాఠ్యం లాగే ఉంది. దాన్ని మూలంగా పేర్కొనవచ్చు కానీ నాకు ఆ సంఘటన ఉంచడం ఇష్టం లేదు. అందుకనే తీసేస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 14:16, 7 మార్చి 2019 (UTC)Reply
నా దగ్గర కామరాజ్ జీవిత చరిత్ర తెలుగు అనువాదం ఉంది. ఏమైనా స్ఫూర్తి గురించి ఉందేమో చూస్తాను. ఉన్నా ఓ లైనుకు మించి అనవసరం, కాబట్టి అంతమాత్రం చేరుస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:37, 7 మార్చి 2019 (UTC)Reply
Return to "మధ్యాహ్న భోజన పథకము" page.