చర్చ:మాధవి పూరి బచ్

తాజా వ్యాఖ్య: ఇప్పటికే వున్న వ్యాసం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Batthini Vinay Kumar Goud

ఇప్పటికే వున్న వ్యాసం

మార్చు

 Y సహాయం అందించబడింది

"మాధబి పూరి బుచ్‌" పేజీ ఉంది. గమనించగలరు.--మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 06:12, 3 మార్చి 2022 (UTC)Reply

@మురళీకృష్ణ ముసునూరి గారు, చర్చలు సమర్ధవంతంగా జరగటానికి, చర్చలలో సంబంధిత వాడుకర్ల పేర్లకు లింకు ఇస్తే మంచిది. ఇక్కడ @Batthini Vinay Kumar Goud గారికి లింకు ఇవ్వాలనమాట. అర్జున (చర్చ) 06:48, 3 మార్చి 2022 (UTC)Reply
@Batthini Vinay Kumar Goud గారు, వ్యాఖ్య ద్వారా మీ పేరు పేర్కొని, హెచ్చరించినతరువాత, ఇప్పటికే ఎక్కువ వృద్ధి అయిన వ్యాసంలో మీరు సవరణలు చేయాల్సింది. కాని కనీసం స్పందించకుండా మీరు ఇదేవ్యాసాన్ని విస్తరించడం, వికీలో సహకారాన్ని దెబ్బతీయడమే. మీ రచనలు గమనించితే కొత్త వ్యాసాలను మీరే సృష్టించాలన్న ధ్యాసతో ఏక వాక్య వ్యాసాలను కనీసం ఒక్క మూలంలేకుండా సృష్టించడం గమనించాను. ఎవరు కొత్త వ్యాసాన్ని సృష్టించారన్న దానికి ఏమాత్రం ప్రాధాన్యతలేదు. దయచేసి అలా చేయకండి. ఈ వ్యాసానికి విలీనం మూసలు చేరుస్తాను. విలీనం చేయటానికి సహకరించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 04:16, 7 మార్చి 2022 (UTC)Reply
విలీనం చర్చ చర్చ:మాధబి పూరి బుచ్‌ లో చేయండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:27, 7 మార్చి 2022 (UTC)Reply
అర్జున గారూ... 'మీ రచనలు గమనించితే కొత్త వ్యాసాలను మీరే సృష్టించాలన్న ధ్యాసతో ఒక వాక్య వ్యాసాలను కనీసం ఒక్క మూలంలేకుండా సృష్టించడం గమనించాను' అన్నారు, నేను గత 10 నెలలుగా రోజుకు 5 వ్యాసాల చొప్పున వికీలో రాస్తున్నాను. ఇప్పటివరకు నేను రాసిన వ్యాసాల్లో ఏది ఒక వాక్య వ్యాసం కనీసం ఒక్క మూలంలేకుండా ఉందో చూపించండి. వికీలో ఎవరైనా ఎలాగైనా కృషి చేయొచ్చు. కొత్త వ్యాసాలు సృష్టించొద్దు అని చెప్పడం వికీ విరుద్ధం. నిర్వాహకులై ఉండి వికీ సభ్యులను నిరుత్సాహపరచడం మంచిది పద్దతి కాదు. విలీనం చర్చ చర్చ:మాధబి పూరి బుచ్‌ లో రాశాను. చూడగలరు.--Batthini Vinay Kumar Goud (చర్చ) 10:08, 7 మార్చి 2022 (UTC)Reply
@Batthini Vinay Kumar Goud గారు నేనంటున్నది తొలిగా సృష్టించేటప్పుడు, మూలం లేకుండా సృష్టిస్తున్నారని. ఉదాహరణకి ఈ వ్యాసం చరిత్రలో 2022-03-03 నాటి తొలి కూర్పు చూడండి. ఆ తరువాత కూర్పు 2022-03-07 లో మూలం చేర్చారు.
వికీ అభివృద్ధికి మేలు చేసేపనులు ప్రోత్సహించటం, అంత మేలు చేయని పనులను నిరుత్సాహపరచటం రెండు నిర్వాహకులు చేయవలసినవే. వికీలో పోటీ ప్రధానం కాదు, సహకారం ప్రధానం. అలాగే ఎన్ని వ్యాసాలు సృష్టించామని కాదు, చేసిన పనికి ఎంత ఉపయోగం వుంది (ప్రధానంగా వీక్షణల ద్వారా) అని గమనించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 03:51, 12 మార్చి 2022 (UTC)Reply
అర్జున గారూ, వికీలో వ్యాసం కొద్దికొద్దిగా అభివృద్ధి జరుగుతుందే తప్ప, ఒకేసారి పూర్తి వ్యాసం తయారవదు. నేను ఏదన్న వ్యాసాన్ని అభివృద్ధి చేయకుండా ఎక్కువ రోజులు వదిలేస్తే అప్పుడు మీరు దాని గురించి మాట్లాడవచ్చు, నిర్మాణ దశలో ఉన్న వ్యాసాన్ని పట్టుకొని మాట్లాడడం సరికాదు. ఇక ‘‘ఎన్ని వ్యాసాలు సృష్టించామని కాదు, చేసిన పనికి ఎంత ఉపయోగం వుంది (ప్రధానంగా వీక్షణల ద్వారా) అని గమనించండి’’ అని అన్నారు. మీరు చెప్పినట్టు వీక్షణల వారిగా చూసుకుంటే వికీ మొత్తంలో వేళ్ళమీద లెక్కపెట్టే వ్యాసాలే ఉంటాయి, అంతేకాకుండా ఎవరికి ఎప్పుడు ఎలాంటి సమాచారం అవసరమవుతుందో కూడా మనం నిర్ణయించలేం.--Batthini Vinay Kumar Goud (చర్చ) 11:40, 12 మార్చి 2022 (UTC)Reply
Return to "మాధవి పూరి బచ్" page.