చర్చ:ముహమ్మద్ ప్రవక్త

ముహమ్మద్ ప్రవక్త వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

రహమతుల్లా గారూ సలామ్, ఈ వ్యాసంలో మీరు, ముహమ్మద్ ప్రవక్త యొక్క వంశవృక్షం మరియు ముహమ్మద్ ప్రవక్తకు పూర్వం ఆదమ్ ప్రవక్త వరకూ గల ప్రవక్తల గొలుసు క్రమం ఖురాన్, హదీసులు మరియు ఇస్లామీయ చరిత్ర పుస్తకాలు చూసి ఆయా ప్రవక్తల పేర్లు, మరియు ఆదమ్ మరియు హవ్వాల సంతానాల పేర్లు వ్రాయవలెనని మనవి. మరియు క్రైస్తవ మరియు యూదమత గ్రంధాలలో గల పేర్లను బ్రాకెట్లలో సూచిస్తే బాగుంటుంది మరియు అర్థవంతంగానూ వుంటుంది. అలాగే క్రైస్తవ మత సంబంధ వ్యాసాలలో ఆయా గ్రంధాలలో గల పేర్లను వ్రాస్తూ బ్రాకెట్లలో ఇస్లామీయ గ్రంధాలలో గల పేర్లను ఉదహరిస్తే అర్థం చేసుకోవడానికి సులభంగానూ ఉచితంగానూ వుంటుంది. కానీ మీరు ఈ వ్యాసంలో వ్రాస్తున్న పేర్లు హిబ్రూ లేదా ఇబ్రానీ భాషా శైలిలో వున్నవి. ఇలాంటి పేర్లు ఎక్కువగా క్రైస్తవ మరియు యూదమత గ్రంధాలలో కానవస్తాయి. మీరు వ్రాస్తున్న పేర్ల స్పెల్లింగులను చూచి, క్రైస్తవ మరియు యూద మత గ్రంధాలతో పరిచయంలేని ముస్లిం సోదరులు, వీరెవరబ్బా అనే ప్రశ్నార్థక ముఖం పెట్టవచ్చు. ఉదాహరణకు, ఆదమ్ ప్రవక్త తనయుల పేర్లు ఇస్లామీయ గ్రంధాలలో హాబీల్ మరియు ఖాబీల్ (అరబ్బీ భాషా శైలి) అని వుంటే క్రైస్తవ మత గ్రంధాలలో 'హేబేలు' మరియు 'కయీను' (హిబ్రూ లేదా ఇబ్రానీ భాషా శైలి) అని వుంటాయి. ఇస్లామీయ గ్రంధాలలో నూహ్ ప్రవక్త (ఇది అరబ్బీ భాషా శైలి) అని వుంటే, క్రైస్తవ మరియు యూదమత గ్రంధాలలో 'నోవహు' అని మరియు నోవా అని వుంటుంది, ఇది హిబ్రూ భాషా శైలి. గమనించి అరబ్బీ శైలిలో వ్రాయగలరు. నిసార్ అహ్మద్ 21:13, 6 నవంబర్ 2008 (UTC)

  • వ అలైకుమ్ సలాం నిస్సార్.అవును.హాబీల్ మరియు ఖాబీల్ ను తెలుగు క్రైస్తవులు హేబేలు కయీను అంటారు.ఇంగ్లీష్ వాళ్ళు ఏబెల్, కెఇన్ అంటారు.తెలుగు బైబిల్ నుంచి తీసుకున్న పేర్లకు సమానమైన అరబ్బీ పేర్లను బ్రాకెట్లలో పెట్టటం మంచిది.--Nrahamthulla 03:28, 7 నవంబర్ 2008 (UTC)

ముహమ్మద్ ప్రవక్త గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "ముహమ్మద్ ప్రవక్త" page.