ఆదమ్ ప్రవక్త

(ఆదమ్ నుండి దారిమార్పు చెందింది)

ఆదమ్ (آدم) : ఇస్లామీయ ధార్మిక గ్రంథాలు, సాహిత్యాల ప్రకారం, ఆదమ్, అల్లాహ్ యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ ప్రవక్త కూడానూ. ఇతడి ధర్మపత్ని హవ్వా. వీరిరువురూ ధరణి పై తొలి మానవులు, ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 710 కోట్లకు చేరింది. ప్రథమంగా కాబా గృహాన్ని ఆదమ్ నిర్మించాడు. వీరి ప్రథమ, ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు ఖాబీల్ (బైబిల్ లో పేరు - కయీను), హాబీల్ (బైబిల్ లో పేరు - హేబేలు), హాబీల్ ఖాబీల్ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి హత్య. దీనితో ఆదమ్, హవ్వలు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. ఇస్లాం ధర్మం ప్రకారం ఆదమ్ మొదటి ప్రవక్త.

మైఖేల్ ఏంజిలో ప్రసిద్ధ చిత్రం - ఆదాము సృష్టి - సిస్టైన్ చాపెల్ కప్పుపైని చిత్రం. ఈ బొమ్మలో ఎడమ ప్రక్కనున్న వ్యక్తి ఆదాము.

బయటి లింకులు సవరించు