ఫలానా దుకాణం అని రాయొచ్చు కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంది ఇంత మందికి ప్రియం అని రాయటం ప్రచారం చేస్కున్నట్టు ఉంది. ఆ భాగాలు తొలగించవచ్చా? రహ్మానుద్దీన్ 09:15, 28 ఆగష్టు 2011 (UTC)

దుకాణాల గురించి రాసినది నేను తొలిగించాను. గ్రామవ్యాసంలో ఆ గ్రామవిశేషాలు, ప్రముఖ వ్యక్తులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, విద్యాసంస్థలు, పంటల వివరాలు, ఇలా అందరికీ ఉపయోగపడే మరియు ఎవరికీ అభ్యంతరంకాని విషయాలు వ్రాయవచ్చు. దుకాణాల గురించి ఇదివరకే ఒకసారి చర్చ జరిగించి. గ్రామంలో ఉండే అన్ని దుకాణాల గురించి రాయడం అవసరం లేదు, ఏవో కొన్ని దుకాణాల గురించి రాసిననూ అది ప్రచారం కిందికే వస్తుంది. అలా రాయడానికి అవకాశం ఇచ్చిననూ ఎవరికి వారు తమకనుకూలమైన పేర్లు రాసుకుంటారు. దుకాణాల పేర్లు సరినవా? కావా? అని సరిచూసుకోవడానికి ఇతరులకు అవకాశం కూడా ఉండదు. ఇవన్నీ కారణాల వల్ల దుకాణాల పేర్లు వ్రాయడానికి గ్రామవ్యాసాలలో అవకాశం ఇవ్వకపోవడమే సమంజసం. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:32, 28 ఆగష్టు 2011 (UTC)
Return to "మొవ్వ" page.